హరీష్ శంకర్ ని లీకైన ఆ ఫొటో చాలా ఇబ్బంది పెడుతోంది

First Published | Aug 16, 2024, 9:20 AM IST

వివాదాలు ఒక్కోసారి చాలా చిత్రంగా మొదలవుతాయి., అసలు ఊహించలేరు. అలాగే వాటికి వివరణలు, సమాధానాలు చెప్పటం కష్టం. 


రవితేజ లేటెస్ట్ చిత్రం మిస్టర్ బచ్చన్ సినిమాకు  వస్తోన్న నెగిటివ్  రెస్పాన్స్ గురించి అందరికీ తెలిసిందే. హరీష్ శంకర్ తీసిన వాటిల్లో అత్యంత చెత్త సినిమా ఇదే అవుతుందంటూ సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోలింగ్ చేస్తున్నారు. బయట కనిపిస్తే కొట్టేస్తామంటూ పబ్లిక్ టాక్‌లో రవితేజ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చే పరిస్థితి కనపడింది. రవితేజ  సరైన కథలు ఎంచుకోవటం లేదంటూ   ఫ్యాన్స్ సైతం మిస్టర్ బచ్చన్ విషయంలో పెదవి విరుస్తున్నారు. అయినా రీమేక్ స్పెషలిస్ట్ అనుకుంటే మిస్టర్ బచ్చన్ ఇలా ఎలా తీశావ్ అంటూ హరీష్ శంకర్‌ను ట్రోల్ చేస్తున్నారు.  ఈ నేపధ్యంలో కొత్త వివాదం మొదలైంది. 
 


సితార్ సాంగ్ లో వేయించిన స్టెప్పులు  దారుణంగా ఉన్నారని, చూడటానికి కూడా ఎబ్బెట్టుగా ఉన్నాయని ట్రోలింగ్ చేస్తున్నారు.సితార పాటలో డ్యాన్స్ మూవ్‍మెంట్‍లో భాగంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే డ్రెస్‍ను రవితేజ ముందు నుంచి పట్టుకునే స్టెప్ ఉంది. అయితే, అభ్యంతకరంగా ఉందంటూ ఈ స్టెప్‍కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  దీనిపై హరీష్ శంకర్ తన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్దితి వచ్చింది.ఆ డ్యాన్స్ మూమెంట్స్ తనకు కూడా అంత ఇష్టం కాలేదట.. కానీ శేఖర్ మాస్టర్ మొదటి రోజే అలా స్టెప్పులు కంపోజ్ చేయడం.. అది తనకు నచ్చలేదని చెబితే.. ఎక్కడ లో అవుతారో అనుకున్నానని హరీష్ శంకర్ వివరణ ఇచ్చుకున్నాడు. 
 



అయితే అది పాటలో భాగంగా చూస్తే ఎబ్బెట్టుగా అనిపించదని అన్నారు. అయితే ఈ షాట్ చూసిన జనం ఫస్ట్ రోజు శేఖర్ మాస్టార్ కంపోజ్ చేస్తున్నారని చెప్పలేదు. ఓకే ఎడిటింగ్ నీ చేతిలోనే ఉంటుంది కదా అప్పుడైనా దాన్ని తీసేయచ్చు కదా అంటున్నారు. అతను ఇచ్చిన వివరణ సరిగ్గా లేదంటున్నారు. మాట్లాడితే వాళ్లని ట్విట్టర్ లో బ్లాక్ చేస్తా...వీళ్లను బ్లాక్ చేస్తాను అంటాను తన చేతిలో ఉన్న అవుట్ ఫుట్ లో ఏది బ్లాక్ చేయాలో చూసుకోలేదా అని ప్రశ్నిస్తున్నారు. 
 


మాములాగా డైరెక్టర్ హరీష్ శంకర్ కు మ్యూజిక్ లో మంచి టేస్ట్ ఉంది, ఆయన సినిమాలు థియేటర్లలో విడుదలకు ముందే మ్యూజికల్ గా హిట్ అవుతాయని ఆయన గత చిత్రాలు పరిశీలిస్తే అర్దమవుతుంది. మాస్ మహారాజా రవితేజతో ప్రస్తుతం హరీష్ శంకర్ చేసిన 'మిస్టర్ బచ్చన్' కూడా పాటలతో హిట్ కొట్టబోతోన్నాడనే అందరూ భావించారు. ప్రోమోతో ఆదరగొట్టిన తర్వాత, మేకర్స్ ఫస్ట్ సింగిల్- సితార్ లిరికల్‌ వీడియోని రిలీజ్ చేశారు. ఇనిస్టెంట్ గా హిట్టయింది ఈ సాంగ్. సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్ తర్వాత మిక్కీ జె మేయర్, హరీష్ శంకర్‌ కాంబోలో వచ్చిన సినిమా ఇది. ఈ పాట సితార్ సౌండ్స్ తో ప్రారంభమైంది, మంచి బీట్ తో ఉన్న మెలొడీ ఇది. కెవ్వు కేక, అస్మైక యోగ అనే రెండు చార్ట్‌బస్టర్‌ల తర్వాత, హరీష్ , లిరిక్ రైటర్ సాహితీ రీ-యూనియన్ లో వచ్చిన ఈ పాట ఆకట్టుకుంది. అయితే ఈ ఒక్క షాట్ తో చర్చకు దారి తీసింది. 

మిస్టర్ బచ్చన్ రిజల్ట్ ని ప్రక్కన పెట్టి .. సినిమా టీం మాత్రం సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ ప్రెస్ మీట్ పెట్టింది. నిర్మాత, దర్శకుడు, హీరోయిన్ ప్రెస్ మీట్‌ ముందుకు వచ్చి మాట్లాడారు. ఇక నెగెటివ్ రివ్యూలు, రేటింగ్‌ల మీద హరీష్ శంకర్ స్పందించాడు. తన సినిమా అందరికీ నచ్చాలనే అత్యాశ లేదన్నట్టుగా చెప్పుకొచ్చాడు. మిక్స్డ్ రివ్యూలు,రేటింగ్‌లు తనకు కొత్తేమీ కాదని, షోలు పెరుగుతున్న కొద్దీ పాజిటివ్ టాక్ వస్తోందని, మరిన్ని షోలు యాడ్ అవుతున్నాయని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. 
 


 “మిక్స్డ్ టాక్, మిక్స్డ్ రేటింగ్స్ చాలా సినిమాలకు వచ్చాయి. కొత్తగా ఏముంది. నాకు నచ్చినవి కూడా ట్వీట్ చేశా. ఇది కూడా సమానంగానే ఉంది. ఇదేం కొత్తకాదు. షోల తర్వాత టాక్ పెరుగుతోంది. తర్వాత సెలవులు ఉన్నాయి. సినిమా మా అంచనాలకు తగ్గట్టే సాగుతోంది. మా అంచనాలు దాటాలని కోరుకుంటున్నాం” అని హరీశ్ శంకర్ అన్నారు. అయితే రిలీజ్‌కు ముందు హరీష్ శంకర్ మాట్లాడిన మాటలు, విధానం, మొహంలో కనిపించిన హుషారు మాత్రం ఈ సక్సెస్ మీట్‌లో కనిపించలేదనే  అంటున్నారు. 

Latest Videos

click me!