`ఆదిత్య 369` షూటింగ్‌లో నడుము విరగొట్టుకున్న బాలయ్య, కారణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Published : Jan 20, 2025, 07:17 AM ISTUpdated : Jan 20, 2025, 07:19 AM IST

బాలకృష్ణ ఓ షాకింగ్‌ విషయం బయటపెట్టారు. `ఆదిత్య 369`లో జరిగిన ప్రమాదం బయటపెట్టారు. సెట్‌లో నడుము విరగొట్టుకున్నాడట. మరి ఏం జరిగింది?  

PREV
15
`ఆదిత్య 369` షూటింగ్‌లో నడుము విరగొట్టుకున్న బాలయ్య, కారణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుసగా నాలుగు వంద కోట్ల సినిమాలు చేసి సీనియర్ హీరోల్లో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటికే `అఖండ`, `వీరసింహారెడ్డి`, `భగవంత్‌ కేసరి` చిత్రాలు వంద కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే.

ఇప్పుడు `డాకు మహారాజ్‌` కూడా ఆ జాబితాలో చేరింది. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. రూ.150కోట్ల దిశగా వెళ్తుంది. అదే సమయంలో వంద కోట్ల షేర్‌కి చేరువలో ఉంది. 
 

25

బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాలయ్యకి జోడగా ప్రగ్యా జైశ్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, ఊర్వశీ రౌతేలా హీరోయిన్లుగా నటించారు. బాబీ డియోల్‌ విలన్‌ పాత్ర పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ కలెక్షన్లతో రన్‌ అవుతుంది. 
 

35

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్‌ సుమతో చిట్‌చాట్ చేసింది యూనిట్‌. ఇందులో బాలకృష్ణ, దర్శకుడు బాబీ, హీరోయిన్లు ప్రగ్యా జైశ్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్లు తమన్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలయ్య తనకు సంబంధించిన ఓ సెంటిమెంట్‌ని బయటపెట్టారు.

దాని వల్ల తాను నడుము విరగొట్టుకోవాల్సి వచ్చిందట. మరి ఆ సెంటిమెంట్‌ ఏంటి? నడుము ఎందుకు విరగొట్టుకోవాల్సి వచ్చింది? ఆ సంఘటన ఎప్పుడు చోటు చేసుకుందనేది చూద్దాం. 
 

45

తనకు ఆదివారం నలుపు రంగు ప్రమాదం అని చెప్పారు బాలయ్య. ఆదివారం నలుపు రంగు దుస్తులు వేసుకుంటే చెడు జరుగుతుందని, అందుకే వేసుకోను అన్నారు. అయితే ఓ సారి నలుపు రంగు దుస్తులువేసుకున్నాడట. దీంతో నడుము విరిగిందని చెప్పారు బాలకృష్ణ.

మరి ఏం జరిగిందంటే, అది `ఆదిత్య 369` సినిమాకి ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఓ నిర్మాత. ఆయన ఆదివారం రోజు సెట్‌కి వస్తున్నారు. అది ఆదివారం రోజు. బ్లాక్ షర్ట్ వేసుకుని సెట్ కి వెళ్లాను. అప్పటి మనసు చెబుతూనే ఉంది. ఈ రోజు ఆదివారం, బ్లాక్‌ వద్దు అని, అయినా వినలేదు. 
 

55

రాక రాక ఎస్పీ బాలసుబ్రమణ్యం షూటింగ్‌ సెట్ కి వస్తున్నారని చెప్పి హడావుడగా బ్లాక్‌ షర్ట్ వేసుకుని వెళ్లాను. ఆయన కళ్ల ముందే కింద పడి నా నడుము విరిగింది. ఎల్ఫా ఎయిర్‌లైన్ ఫ్యాక్చర్‌ అయినట్టు తెలిపారు బాలయ్య.

తాను వచ్చినప్పుడే ఇలా జరిగిందని ఎస్పీ బాలుగారు చాలా కంగారు పడ్డారు. దీంతో ఆ తర్వాత ఆయన షూటింగ్‌ సెట్‌కి ఎప్పుడూ రాలేదని తెలిపారు. ఆ రోజు నుంచి తాను కూడా బ్లాక్‌ షర్ట్ ఆదివారం వేసుకోవడం మానేశాను అని తెలిపారు బాలకృష్ణ. 

read more: `గేమ్‌ ఛేంజర్‌`పై ట్రోల్స్ రామ్‌ చరణ్‌ ముందే ఊహించాడా? కాలమే సమాధానం చెబుతుందంటూ స్టేట్‌మెంట్‌

also read: `ఫతే` మూవీ 10 రోజుల కలెక్షన్లు.. దర్శకుడిగా మారిన సోనూసూద్‌కి గట్టి దెబ్బ?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories