అల్లు అర్జున్ ‌- రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీ స్టారర్ మూవీ..? డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సింద

First Published | Dec 27, 2024, 9:27 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - గ్లోబల్ హీరో రామ్ చరణ్. ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ వస్తే ఎలా ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఒకరు. 
 

ram charan allu arjun

మెగా ఫ్యామిలీలో కోల్డ్ వార్ గురించి ఇండస్ట్రీలో ఎన్నో రూమర్లు ఉన్నాయి. కాని ఈ విషయంలో ఎవరు బయటపడలేదు. కలిసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు. మరి కోల్డ్ వార్ ఎక్కడ ఉంది అనేది మాత్రం క్లారిటీ లేదు. ఎవరికి వారు ట్విట్టర్ లో పిట్టల్లా కూయడం తప్పించి అసలు మేటర్ ఏంటీ అనేది ఎవరికీతెలియదు. సరే ఈ విషయం కాస్త పక్కన పెడితే..మెగా ఫ్యామిలీ నుంచి. ఇటు అల్లు అర్జున్  - అటు రామ్ చరణ్ ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు గా ఉన్నారు. 

Also Read : నాగబాబును బండ బూతులు తిట్టిన రామ్ చరణ్, చిరంజీవి ఏం చేశాడంటే..?

టాలీవుడ్ తో పాటు ఓవర్ ఆల్ ఇండియా అంతటా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. మరి  ఈ ఇద్దరు స్టార్లు కలిసి సినిమా చేస్తే.. అది కూడా భారీ బడ్జెట్ తో.. అదిరిపోయే యాక్షన్ కథతో.. హై టాలెంటెడ్ డైరెక్టర్ తో.. మరి ఇన్ని సెట్ అవ్వాలంటే ఈ పనికి పూనుకునేది ఎవరు.

Also Read: విక్టరీ వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?


ఇదే ప్రయత్నంలో ఉన్నాడట బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్. అవును పాన్ఇండియా ఇమేజ్ ఉన్న ఈ ఇద్దరు మెగా హీరోలను కలిపి భారీ సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడట. 

అల్లు అర్జున్ ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తన్నాడు. పుష్ప 2 సినిమాతో 2000  కోట్ల మార్క్ కలెక్షన్ ను అందుకోవడానికిచాలా దగ్గరలో ఉన్నాడు. పుష్పరాజ్ దెబ్బకు బాలీవుడ్ ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. బాలీవుడ్ లోనే దాదాపు 800 కోట్లకుపైగా కలెక్షన్స్ ను సాధించింది పుష్ప2 సినిమా. ఇక ఈ మూవీ రిలీజ్ తరువాత బాలీవుడ్ అంతా సైలెంట్ అయ్యింది. ఈ దెబ్బతో నార్త్ లో బన్నీ క్రేజ్ అంతా ఇంతా పెరగలేదు.. ఈ ఇమేజ్ ను గమనిస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. 

ఇక రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ టైమ్ నుంచి ఫుల్ క్రేజ్ ఉంది నార్త్ లో. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చిన తరువాత అది మరింత పెరిగిపోయింది. బన్నీ ఎప్పుడైనా నార్త్ కు వెళ్తే.. భారీగా ప్యాన్స్ వచ్చి చుట్టుముట్టేస్తున్నారు. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో సినిమా చేస్తే.. అది హిస్టరీలను బ్రేక్ చేస్తుందని ఆలోచనలో ఉన్నారట కరణ్ జోహార్. అయితే గతంలో వీరిద్దరు కలిసి ఎవడు సినిమాలో నటించారు. కాని ఇందులో బన్నీరోల్ పెద్దగా కనిపించదు. 

ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే దర్శకుడి పేరు కూడా వైరల్ అవుతుంది. అతను ఎవరో కాదు బాలీవుడ్ కు 1000 కోట్ల సినిమా అందించిన తమిళ దర్శకుడు అట్లీ. అవును. ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు.. తమిళ దర్శకుడి తోకలిసి బాలీవుడ్ సినిమా చేయిస్తే.. పాన్ ఇండియా రేంజ్ లో అది హిట్ అవుతుంది అని అనుకుంటున్నారట కరణ్ జోహార్. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కాని.. ఈసినిమా నిజంగా పట్టాలెక్కిందంటే.. రాజమౌళి రికార్డ్ లను బ్రేక్ చేయడం ఖాయం అని చెప్పవచ్చు. 
 

అయితే ఈ ఇద్దరు హీరోల మధ్య కోల్డ్ వార్ ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే. అల్లు అర్జున్ అరెస్ట్, ఇబ్బందులు పడుతున్న క్రమంలో రామ్ చరణ్ నుంచి ఎటువంటి స్పందన లేదు. కనీసం బన్నీకి ఫోన్ చేసి మాట్లాడినట్టు కూడా మీడియాలో ఎక్కడా రాలేదు. మరి ఈ ఇద్దరు స్టార్లు ఫ్యూచర్ లో సినిమా చేయడం సాధ్యం అయ్యే పనేనా..? నిజంగా వీరు సినిమా చేస్తే.. ప్యాన్స్  మాత్రం దిల్ ఖుష్ అవుతారని చెప్పోచ్చు. 

Latest Videos

click me!