క్రికెట్ ను అమితంగా ఇష్టపడే వెంకీ.. తనకు క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సచిన్, ధోనీని కలిసిన సందర్భం మర్చిపోలేనిదన్నారు వెంకటేష్. ఇక ఈ ఎపిసోడ్ ఈరోజు అనగా డిసెంబర్ 27న ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా సందడి చేయబోతోంది.