నాగబాబును బండ బూతులు తిట్టిన రామ్ చరణ్, చిరంజీవి ఏం చేశాడంటే..?
మెగా బ్రదర్ నాగబాబును ... మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ బండబూతులు తిట్టేశాడట. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా..? అసలు ఎప్పుడు జరిగింది ఈ సీన్.. రామ్ చరణ్ ఈ విషయంలో చేసిన కామెంట్స్ ఏంటి..?
Mega Family
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అతి పెద్ద సినిమా ఫ్యామిలీగా ఎదిగింది.. ఎదుగుతుంది కూడా. టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో మెగా ఫ్యామిలీ స్టార్లుగా వెలుగు వెలుగుతున్నారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కు పెద్దదిక్కుగా ఉంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగారు.
ఇక పవర్ స్టార్ హీరోగా, డిప్యూటీ సీఎంగా చూస్తూనే ఉన్నామ్. ఇక మెగా బ్రదర్ నాగబాబు, మెగా మేనల్లుళ్లు సాయితేజ్, వైష్ణవ్ తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నిహారిక, ఇలా సినిమా కుటంబం గురించి ఎంత చెప్పినా తక్కవే. ఎవరి రంగంలో వారు అద్భుతమైన పాత్రలు పోషిస్తూ.. దూసుకుపోతున్నారు.
ఇక కోల్డ్ వార్ లు.. మనస్పర్ధలు పక్కన పెడితే.. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూడా మెగా ప్యామిలీనే కదా.. అల్లు శిరీష్, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. మెగా ఫ్యామిలీ బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీని మించిన అతిపెద్ద సినిమా ఫ్యామిలీగా ఎదిగింది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి.
ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్ప2 సినిమా తొ భారీ బ్లాక్ బస్టర్ ను సాధించాడు అల్లు అర్జున్.. ఈ సినిమా 2000 కోట్ల కలెక్షన్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది. ఇక ఈక్రమంలో సంక్రాంతి కానుకగా మెగా పవన్ స్టార్ గేమ్ ఛేంజర్.. రికార్డ్ లు బ్రేక్ చేయడానికిరెడీ అవుతోంది. ఇలా రెండు పెద్ద సినిమాలు మెగా ఫ్యామిలీ నుంచి సందడి చేస్తున్నాయి.
ఇక చిన్నతనం నుంచి మెగా యంగ్ హీరోలంతా చిరంజీవి ఇంట్లోనేసందడి చేసేవారు. ఆటలు, పాటలు, డాన్స్ లు, ఏం జరిగినా.. అంతా కలిసి చేసుకనేవారు. ఈ ఏడాది సంక్రాంతి కూడా మెగాస్టార్ ఫ్యామిలీ అంతా బెంగళూరులోనిఫార్మ్ హౌస్ లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక చిన్నప్పుడు తాము ఎలా ఉండేవాళ్లమో చెప్పారు రామ్ చరణ్. ఓ సందర్భంలో తన చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్నా చరణ్..
తన తండ్రి ఏ సందర్భంలో అయినా తన మీద చేయి చేసుకున్నారా అన్న ప్రశ్నకు సమాధానం చెపుతై.. ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని రివిల్ చేశారు. అదేంటోకాదు.. తాను తన బాబాయ్ నాగబాబును తెలిసి తెలియక బూతులు తిట్టిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఓ సారి నా చిన్నప్పుడు మా ఇంట్లో డ్రైవర్..పనిమనిషి గొడవపడుతున్నారట. అయితే వారు గొడవ పడుతూ.. కొన్ని మాటలు అనుకున్నారట.
అవి అనకూడనిమాటలు అని ఆ ఏజ్ లో తెలియని రామ్ చరణ్.. ఇంట్లోకి వచ్చి.. నాగబాబును ఆ మాటలు అన్నారట. అసలు అవేంటో కూడా తెలియకుండా తన బాబాయి నాగబాబుని ఆ మాటలు అనేవరకూ.. వెంటనే కోపం బచ్చి మెగా బ్రదర్.. ఏంట్రా ఏమన్నావ్.. అంటూ చేయి పట్టుకుని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్ళారట. అన్నయ్యా.. వీడు ఏదో అంటున్నాడు. ఎక్కడ విన్నాడో తెలియదు.. ఫ్రెండ్స్ అంటుంటే విన్నాడేమో.. ఇలానే అయితే చెడిపోతాడు అంటూ చిరంజీవికి అప్పగించాడట.
ఇక చిరంజీవి వెంటనే తన తండ్రి రిటైర్ అయ్యాక ఇచ్చిన పోలీస్ బెల్ట్ తో నాలుగు వాయించాడమే కాదు.. ఇక ముందు అలాంటివి మాట్లాడవద్దని. ఎక్కడ విన్నావంటూ హెచ్చారించారని వెల్లడించాడు రామ్ చరణ్. ఇక అప్పటి నుంచి అలాంటివి జరగకుండా జాగ్రత్త పడ్డాడట చరణ్. అలా తెలిసీ తెలియక నాగబాబును బూతులు తిట్టాడట రామ్ చరణ్. ఈ విషయాన్ని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వెల్లడించాడు గ్లోబల్ స్టార్.