దీపికా-రణ్‌వీర్ నుండి 2024లో అమ్మ, నాన్నగా మారిన స్టార్ సెలబ్రిటీలు వీళ్ళే

First Published | Dec 27, 2024, 8:18 PM IST

2024 చాలామంది సెలబ్రిటీల లైఫ్ లో గుర్తుండిపోతుంది. ఎందుకుంటే చాలామంది స్టార్స్ ఈ సంవత్సరం తల్లి తండ్రులుగా మారారు.. దీపికా-రణ్‌వీర్ నుండి విరాట్, అనుష్క వరకూ పిల్లల్ని కన్న స్టార్ పేరెంట్స్ ఎవరో తెలుసా..? 

2024లో తల్లిదండ్రులైన సెలబ్రిటీ జంటలు చాలామంది ఉన్నారు. చిన్నారులను వారి జీవితాల్లోకి ఆహ్వానించి.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 
 

దీపికా పదుకొణే - రణ్‌వీర్ సింగ్

బాలీవుడ్ జంట దీపికా పదుకొణే -  రణ్‌వీర్ సింగ్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 8న తమ మొదటి బిడ్డ కు స్వాగతం పలికారు. అంతే కాదు ఆ ఆడపిల్లకు  దువా అనే పేరు కూడా పెట్టారు. 


అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఫిబ్రవరి 15, 2024న తమ రెండవ బిడ్డ కు వెల్కం చెప్పారు. వీరికి బాబు పుట్టగా.. అతనికి  అకాఏ అనే పేరు పెట్టారు.  తల్లిదండ్రులయినందకు గర్వంగా ఉందన్నారు ఈ స్టార్ జంట.

వరుణ్ ధావన్, నటాషా దలాల్

జూన్ 2024లో, వరుణ్ ధావన్ - నటాషా దలాల్ తమ ఆడపిల్ల లారా రాకను జరుపుకున్నారు. ఈ జంట తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

రిచా చద్దా, అలీ ఫజల్

రిచా చద్దా -  అలీ ఫజల్ జూలై 16, 2024న తమ మొదటి బిడ్డ, ఆడపిల్ల పుట్టుకతో తల్లిదండ్రులయ్యారు. ఈ జంట తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

యామీ గౌతమ్, ఆదిత్య ధర్

యామీ గౌతమ్ -  ఆదిత్య ధర్ మే 10, 2024న తమ మగబిడ్డ వేదవిద్‌కు స్వాగతం పలికారు. ఈ జంట తమ కుటుంబంలో కొత్తగా చేరినందుకు తమ ఆనందాన్ని , కృతజ్ఞతను వ్యక్తం చేశారు, ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.

Latest Videos

click me!