25 ఏళ్లు చిన్నదైన వాణిశ్రీ ని, తిప్పుకుంటూ నడుస్తున్నావ్ అని కామెంట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Published : Sep 30, 2025, 06:17 PM IST

అలనాటి స్టార్ హీరోయిన్ వాణిశ్రీని సరదాగా కామెంట్ చేసే ధైర్యం ఉన్న స్టార్ హీరో ఎవరో తెలుసా? తనకంటే 25 ఏళ్లు చిన్నదైన హీరోయిన్ ను తిప్పుకుంటూ నడుస్తున్నావు అని కామెంట్ చేసిన ఆ హీరో ఎవరంటే?

PREV
15
హీరోలను భయపెట్టిన వాణిశ్రీ

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నిలబెట్టిన స్టార్ హీరోలు, హీరోయిన్లలో ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమునలతో పాటు వాణిశ్రీ కూడా ఉన్నారు. గంగా మంగా , దసరా బుల్లోడు, లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను చేసిన ఈ స్టార్ హీరోయిన్.. అప్పట్లో పెద్ద హీరోలందరితో నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి స్టార్స్ సరసన నటింమెపించారు వాణిశ్రీ. అంతే కాదు ఆ కాలంలోనే విమెన్ ఒరియెంటెడ్ సినిమాలు చేసిన ఘనత వాణిశ్రీకి దక్కింది. ఆమె అంటే సహనటుకు ఒకింత భయం ఉండేది. ముక్కుసూటి మనిషి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆమెత మాట్లాడేవారు కో ఆర్టిస్ట్ లు. హీరోలు కూడా వాణిశ్రీతో చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు.

25
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా స్టార్ డమ్

ఇక హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన వాణిశ్రీ.. ఆతరువాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా దుమ్మురేపారు. స్టార్ హీరోలకు అత్తగా, స్టార్ హీరోయిన్ల తల్లి పాత్రల్లో మెరిశారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలకు అత్త పాత్రలో మెరిసింది వాణిశ్రీ. ఆమె ఏ పాత్ర చేసినా అందులో హుందాతనం ఉండేది. పాత్రకు తగ్గట్టు డైలాగ్స్ ను కూడా అద్భుతంగా చెప్పేవారు. పాత్ర ఏదైనా ఆ పాత్రకు వన్నె తెచ్చేవారు వాణిశ్రీ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా చెన్నైలో తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నారు వాణిశ్రీ. కొడుకు మరణం తరువాత ఆమె మరింతగా కృంగిపోయారు. అప్పుడప్పుడు తిరుమల శ్రీవారిణి దర్శించుకుంటూ, ఏదైనా పెద్ద సినిమా ఈ వెంట్ ఉంటే మాత్రమే వాణిశ్రీ బయట కనిపిస్తున్నారు.

35
వాణిశ్రీని టీజ్ చేసిన ఏఎన్నార్

ఇక వాణిశ్రీకి సబంధించిన ఓ విషయం ఈమధ్య వైరల్ అవుతోంది. వాణిశ్రీతో కలిసి నటించి హీరోల గురించి ఆమె కొన్ని విషయాలు వెల్లడించారు. వాణిశ్రీ మాట్లాడుతూ... ఎన్టీఆర్ చాలా హుందాగా ఉండేవారు. ఆయన సెట్ లో ఉంటే అంతా సైలెంట్ గా ఉంటారు. తనకంటే చిన్నవారు వచ్చినా లేచి నిల్చుని మాట్లాడేవారు. ఇక ఆయనతో ఏదైనా చెప్పాలన్నా, మాట్లాడాలన్నా.. మిగతా ఆర్టిస్ట్ లు కాస్త భయపడేవారు. కానీ నేను మాత్రం ఏదైనా చెప్పాలంటే అన్నగారు అంటూ వెళ్ళి మాట్లాడేదాన్ని అని అన్నారు వాణిశ్రీ.

45
హీరోయిన్లతో అక్కినేని చమత్కారాలు

ఇక హీరోలలో అక్కినేని నాగేశ్వరావు మాత్రం చాలా సరదాగా ఉండేవారట. ఆయన చుట్టు ఎప్పుడు సందడి వాతావరణం ఉండేదట. ఇక హీరోయిన్లతో కూడా చాలా చనువుగా ఉండేవారట అక్కినేని. ఏదో ఒక కామెంట్ చేసేవారట. నన్ను చూసి ఓ తిప్పుకుంటూ నడుస్తున్నావ్ అంటూ సరదాగా కామెంట్ కూడా చేశారు అని వాణిశ్రీ ఇంటర్వ్యలో చెప్పుకొచ్చారు. నాగేశ్వారావు సెట్ లో చాలా సందడి చేసేవారట. అందరితో కలివిడిగా ఉండేవారట. అదే సమయంలో ఆయన గౌరవం కాపాడుకునేలా కూడా ప్రవర్తించేవారట.

55
సూపర్ హట్ కాంబో

వాణిశ్రీతో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు అక్కినేని. మరీ ముఖ్యంగా వీరి కాంబోలో వచ్చిన దసరా బుల్లోడు. ప్రేమ్ నగర్, బంగారు బాబు లాంటి ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం వాణిశ్రీ చెన్నైలో తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు. సినిమాల నుంచి రిటైర్ అయ్యి రెస్ట్ లో ఉన్నారు. ఇక అక్కినేని నాగేశ్వరావు 90 ఏళ్ల కు పైగా జీవించారు. ఆయన దాదాపు 80 ఏళ్ల సినిమా జీవితన్ని పూర్తి చేసుకున్నారు. కుటుంబంతో కలిసి మనం సినిమాలో నటించారు. ఆసినిమా చూసిన తరువాతే అక్కినేని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Read more Photos on
click me!

Recommended Stories