Kantara Chapter 1 Review: కాంతార చాప్టర్‌ 1 ఫస్ట్ రివ్యూ, అవే హైలైట్స్, మైనస్‌ లు ఏంటంటే?

Published : Sep 30, 2025, 06:10 PM IST

Kantara Chapter 1: రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన `కాంతార 2` మూవీ ఈ దసరాకి రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. 

PREV
15
`కాంతారః చాప్టర్‌ 1` ఫస్ట్ రివ్యూ

ఈ దసరా పండక్కి తెలుగు సినిమాలు ఒక్కటి కూడా లేవు. డబ్బింగ్‌ సినిమాల సందడే కనిపిస్తుంది. ఈ వారం రెండు డబ్బింగ్‌ చిత్రాలు తెలుగు ఆడియెన్స్ ని అలరించబోతున్నాయి. అందులో ధనుష్‌ `ఇడ్లీ కొట్టు`, రిషబ్‌ శెట్టి `కాంతారః చాప్టర్ 1` చిత్రాలున్నాయి. `కాంతార 2` మూవీ దసరా పండగ రోజు గురువారం విడుదలవుతుంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటించగా, కర్నాటకలోని సాంప్రదాయ పండుగలైన పింజుర్లి, భూత కోలను బేస్‌ చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు రిషబ్‌ శెట్టి. ఈ చిత్రానికి ఆయనే దర్శకుడనే విషయం తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. మొదటి మూవీ `కాంతార` మూడేళ్ల క్రితం విడుదలై భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. దీంతో తాజాగా `కాంతార 2`పై భారీ అంచనాలున్నాయి.

25
`కాంతారః చాప్టర్‌ 1`పై భారీ హైప్‌

`కాంతార 2`పై ఉన్న హైప్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి తెలుగులో వంద కోట్ల బిజినెస్‌ అయ్యిందని సమాచారం. నైజాంలో దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది. ఏపీలో ఐదారుగురు డిస్ట్రిబ్యూటర్లు సినిమా రైట్స్ ని తీసుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించగా, దీనికి ఎన్టీఆర్‌ గెస్ట్ గా వచ్చారు. ఆయన గాయంతో బాధపడుతున్నప్పటికీ రిషబ్‌ శెట్టితో ఉన్న స్నేహం కారణంగా ఈవెంట్‌కి వచ్చారు. సినిమాపై హైప్‌ని అమాంతం పెంచేశారు.

35
`కాంతారః చాప్టర్‌ 1` సెన్సార్‌ టాక్‌

ఇదిలా ఉంటే సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. దీనికి సెన్సార్‌ సభ్యులు U/A సర్టిఫికేట్‌ ఇచ్చారు. దీంతో పెద్దలు చూడొచ్చు. ఫ్యామిలీ కూడా చూసే మూవీ. కానీ మరీ చిన్నపిల్లలు చూడలేరు. సినిమా నిడివి రెండు గంటల 48 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. `కాంతార` కంటే కాస్త ఎక్కువగానే నిడివి ఉంది. ఇది డీసెంట్‌ నిడివి అనే చెప్పొచ్చు. సినిమాపై సెన్సార్‌ సభ్యులు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారట. అయితే `కాంతార` సినిమా కథకి ప్రీక్వెల్‌గా ఇది రూపొందింది. అంటే పూర్వీకులనాటి కథని చెప్పబోతున్నారు. రాచరిక యుగంలో అప్పటి రాజు నిరంకుశ పాలనపై హీరో తిరుగుబాటుని ఇందులో చూపించబోతున్నట్టు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. ఇందులో ఫ్యామిలీ ఎలిమెంట్లు, గిరిజన ప్రజల స్థితిగతులు, భూతకోల, పింజుర్లి పండుగలను ప్రధానంగా ఆవిష్కరించారు. దీనికితోడు బలమైన ఎమోషన్‌ ఉంది. దాన్ని మించిన ఇంటెన్సిటీ, యాక్షన్‌ సీన్లు ఉన్నాయి. యుద్ధాన్ని తలపించే సీన్లు విజువల్స్ ట్రీట్‌లా అనిపిస్తున్నాయి. ఆడియెన్స్ కిది మంచి ట్రీట్‌ అని చెప్పొచ్చు. ఇవన్నీ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

45
ఓవర్సీస్‌ క్రిటిక్‌ ఫస్ట్ రివ్యూ

ఇదిలా ఉంటే ఈ మూవీపై తన ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు ఓవర్సీస్‌ క్రిటిక్‌ ఉమైర్ సంధు. సాధారణంగా తన ఫస్ట్ రివ్యూని పెద్దగా ఇస్తాడు. హైలైట్స్ ఏంటి, మైనస్‌లు ఏంటి అనేది చెబుతాడు. సినిమా ఎలా ఉంది, ఆర్టిస్ట్ లు ఎలా చేశారు? దర్శకుడు ఎలా తీశారనేది పంచుకుంటాడు. ఓవరాల్‌గా తన రేటింగ్‌ కూడా ఇస్తాడు. కానీ ఈ సినిమాపై తన రివ్యూని సింపుల్‌గా తేల్చేశాడు. ఒక్క మాటలో సినిమా ఎలా ఉంటుందో తేల్చేశాడు. `మెరిసేదంతా బంగారం కాదు. అతిగా అంచనా వేయబడ్డ వింతైన మూవీ ఇది` అని ట్వీట్‌ చేశాడు. అంతేకాదు రెండు రేటింగ్‌ ఇచ్చాడు. హైప్‌ ఉన్నంతగా, ప్రచారం జరుగుతున్నంతగా మూవీ   లేదనే విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇదే ఇప్పుడు షాకిస్తుంది.

55
అక్టోబర్‌ 2న గ్రాండ్‌గా `కాంతారః చాప్టర్‌ 1` రిలీజ్‌

ఒకప్పుడు ఓవర్‌గా, మరీ నెగటివ్‌గా తన అభిప్రాయాన్ని వెల్లడించేవాడు ఉమైర్‌. కానీ ఇప్పుడు మారిపోయారు. చాలా వరకు జెన్యూన్‌గా ఇస్తున్నారు. సినిమా ఎలా ఉండబోతుందో చెబుతున్నారు. ఒకటి అర మిస్‌ ఫైర్‌ అవుతున్నాయి, కానీ చాలా వరకు ఆయన చెప్పిందే జరుగుతుంది. అయితే ఆ మధ్య `వార్‌ 2` రివ్యూ మిస్‌ ఫైర్‌ అయ్యింది. కానీ `ఓజీ` విషయంలో సక్సెస్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు `కాంతారః చాప్టర్‌ 1` విషయంలో ఆయన చెప్పిందే జరుగుతుందా అనేది చూడాలి. అయితే ఇప్పుడు `కాంతార` లాంటి సినిమాల ట్రెండ్‌ నడుస్తుంది. మూవీ బాగుంటే జనం బ్రహ్మరథం పడుతున్నారు. పైగా హిట్‌ కాన్సెప్ట్ కావడంతో మూవీ చాలా వరకు పాజిటివ్‌గానే ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అక్టోబర్‌ 2న ఈ చిత్రం విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే కర్నాటకలో మన తెలుగు సినిమాలను చూడటం లేదు. ఓజీతోపాటు ఇతర సినిమాలను కూడా బైకాట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో కన్నడ మూవీ అయిన `కాంతార 2`ని తెలుగు ఆడియెన్స్ చూస్తారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇదే ఇప్పుడు చిత్ర బృందాన్ని కలవరపెడుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories