Lenin Glimpse: పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది.. అఖిల్‌కి ఇన్నాళ్లకి సరైన సినిమా పడిందా?

Published : Apr 08, 2025, 06:00 PM IST

Akhil Akkineni: అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్‌. నాగార్జున రెండో కుమారుడు అఖిల్‌.. `అఖిల్‌` చిత్రంతోనే హీరోగా పరిచయం అయ్యారు. ఇది యావరేజ్‌గా ఆడింది. ఆ తర్వాత `హలో` మూవీ సైతం నిరాశ పరిచింది. అలాగే `మిస్టర్‌ మజ్ను`తో ఆడలేదు. `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌ లర్‌` మూవీ యావరేజ్‌గా ఆడింది. రెండేళ్ల క్రితం వచ్చిన `ఏజెంట్‌` మూవీ కూడా డిజప్పాయింట్‌ చేస్తుంది. దీంతో అఖిల్‌ కి ఇప్పటి వరకు సరైన బ్రేక్ ఇచ్చే మూవీ పడలేదు. ఈ క్రమంలో తాజాగా ఆయన `లెనిన్‌` అనే మూవీతో రాబోతుంది. తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా నేడు మంగళవారం ఈ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూద్దాం.   

PREV
15
Lenin Glimpse: పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది.. అఖిల్‌కి ఇన్నాళ్లకి సరైన సినిమా పడిందా?
akhil akkineni, lenin movie

Akhil Akkineni: అఖిల్‌ అక్కినేని ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాడు. కానీ ఏది సరైన హిట్‌ ఇవ్వలేదు.  హీరోగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నా, సక్సెస్‌ దక్కలేదు. ఎంతో ఆశలు పెట్టుకున్న గత చిత్రం `ఏజెంట్‌` సైతం బాగా డిజప్పాయింట్‌ చేసింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాడు. రా అండ్‌ రస్టిక్‌ కథతోనే వస్తున్నాడు. తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా అఖిల్‌ కొత్త సినిమా టైటిల్‌, గ్లింప్స్ ని విడుదల చేశారు. 

25
akhil akkineni, lenin movie

అఖిల్‌ నటిస్తున్న కొత్త చిత్రానికి `లెనిన్‌` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్‌ గ్లింప్స్ ని విడుదల చేశారు. నాగార్జున సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఈ మూవీ రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది. రాయలసీమ గ్రామాల్లోనే ప్రేమని తెలియజేసేలా, ప్రేమ కోసం లెనిన్‌ తిరుగుబాటు ప్రధానంగా ఈ మూవీ రూపొందుతుందని తెలుస్తుంది. గ్లింప్స్ మాత్రం అదిరిపోయేలా ఉంది. 
 

35
akhil akkineni, lenin movie

ఇక దేవుడి విగ్రహం, మహాభారతంలోని రథంతో టీజర్‌ ప్రారంభమైంది. రణరంగంలోకి హీరో దిగుతున్నట్టుగా ప్రారంభ సీన్లు చూపించారు. విష్ణువు అవతారం వెనకాల ప్రకాశిస్తుండగా, చైర్‌పై కాలు పెట్టి ఓ యువకుడు కత్తి పట్టి కదన రంగానికి సిద్ధమవుతున్నాడు.

ఈ సందర్భంగా `గతాన్ని తరమడానికి పోతా..మా నైనా నాకు ఒక మాట సెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా, పేరు ఉండదు. అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే.. అని చెబుతూ `లెనిన్‌` టైటిల్‌ వచ్చింది. 
 

45
akhil akkineni, lenin movie

 అఖిల్‌ వాయిస్‌ ఓవర్‌తో వచ్చే సీన్లు గూస్‌ బంమ్స్ తెప్పిస్తాయి. ప్రేమ కోసం చేసే పోరాటం కంటే ఏ యుద్ధం హింసాత్మకంగా ఉండదు అని చెప్పిన కొటేషన్‌ అదిరిపోయింది.

ఇందులో హీరోయిన్‌ శ్రీలీలని ప్రేమించిన అఖిల్‌, ఆమె ప్రేమ కోసం చేసే యుద్ధమే ఈ సినిమా అని అర్థమవుతుంది. గ్లింప్స్ మాత్రం అదిరిపోయింది. అఖిల్‌కి ఇన్నాళ్లకి సరైన సినిమా పడిందని అర్థమవుతుంది. ఇందులో థమన్‌ బీజీఎం మరో స్థాయిలో ఉంది. 
 

55
akhil akkineni, lenin movie

ఇక అఖిల్‌, శ్రీలీలా జంటగా నటిస్తున్న `లెనిన్‌` చిత్రానికి కిశోర్‌ అబ్బూరి దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున, నాగవంశీ నిర్మాతలు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానుంది. 

read  more: Friday Releases: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో తెలుసా? మూవీ లవర్స్ కి పండగే పండగ

also read: మార్క్ శంకర్‌ పవన్‌ కళ్యాణ్‌ ఏ భార్య కొడుకో తెలుసా? సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నాడంటే?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories