MEGA VS ALLU: మెగా కాంపౌండ్‌ నుంచి బన్నీకి నో విషెస్‌.. జూ.ఎన్టీఆర్‌ మాత్రం అల్లూ బావ అంటూ..!

Published : Apr 08, 2025, 04:22 PM IST

MEGA VS ALLU: మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య గ్యాప్‌ ఉన్నట్లు గతంలో అనే సందర్భాల్లో స్పష్టంగా అర్థమైంది. పుష్ప-2 సినిమా విడుదల సమయంలో విభేదాలు దాదాపు బహిర్గతం అయ్యాయి. కానీ బన్నీ అరెస్ట్‌తో తిరిగి మెగాస్టార్‌ చిరంజీవి అర్జున్‌ ఇంటికి వెళ్లడం, ఆ తర్వాత బన్నీ కూడా చిరంజీవి ఇంటికి వెళ్లడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు సర్దుమనిగాయని అందరూ భావించారు. కానీ అది జరగలేదనన్నది స్పష్టంగా ఈరోజు తెలిసిపోయింది. అర్జున్‌ పుట్టినరోజున మెగా కుటుంబం ఏం చేసిందో తెలుసా..   

PREV
15
MEGA VS ALLU: మెగా కాంపౌండ్‌ నుంచి బన్నీకి నో విషెస్‌.. జూ.ఎన్టీఆర్‌ మాత్రం అల్లూ బావ అంటూ..!
allu arjun vs mega family

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కెరీర్‌ బిగినింగ్‌ డేస్‌లో సినిమాల్లో రావడానికి మెగాస్టార్‌ చిరంజీవి చాలా సపోర్టు చేశారు. అప్పటికే నంబర్ వన్‌ హీరోగా వెలుగొందుతున్న చిరంజీవి.. మరోవైపు సక్సెస్‌ఫుల్‌ నిర్మాత అరవింద్‌ దగ్గరుండి బన్నీ ఎదుగుదలలో అన్ని విధాలుగా మద్దతుగా నిలబడ్డారు. చిరంజీవి డ్యాన్స్‌ చూసే మామయ్యలా నృత్యంలో రాణించాలని బన్సీ ప్రత్యేకంగా శిక్షణ కూడా పొందారు. ఇక డైలాగ్‌ డెలివరీ, ఎనర్జీలో కూడా మామయ్యను ఇన్సిపిరేషన్‌గా తీసుకున్నాడు అర్జున్‌. 

25
Allu Arjun Mega Family

అల్లు వారసత్వం కోసం.. 
అలా వైకుంఠపురం సినిమా విజయం సాధించన నాటి నుంచి అల్లు అర్జున్‌ - మెగా హీరోల మధ్య గ్యాప్‌ వచ్చినట్లుగా సినీ వర్గాల నుంచి చెబుతున్నారు. బన్నీ తాత అల్లూ రామలింగయ్య పెద్దనటుడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక తాను మెగా కుటుంబ నీడలో ఉంటే తన కష్టం, ఇండివిడ్యూవాలిటీ కోల్పోతానని భావించారో ఏమే కానీ మెగా కాంపౌండ్‌కు మెల్లిమెల్లిగా దూరం అవుతూ వచ్చారు. పరోక్షంగా అనేక సందర్భాల్లో తన తాతా అల్లూ రామలింగయ్య గురించి, నటన గురించి మాట్లాడటం.. అల్లు కుటుంబం అని ప్రస్తావించడం వంటివి బన్నీ చేస్తూ వచ్చాడు. దీని ప్రకారం అల్లు కుటుంబ లెగసీని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నాడని తెలుస్తోంది. 

35
allu arjun vs mega family

చెప్పను బ్రదర్‌ దగ్గరి నుంచీ.. 
గతంలో అల్లు అర్జున్‌ సినిమా ఆడియో, ప్రీ రిలీజ్‌ కార్యక్రమాలకు మెగా కుటుంబం నుంచి చరణ్‌, సాయిధర్మతేజ్‌, వరుణ్‌తేజ్‌, నాగబాబు, చిరంజీవి, పవన్‌ ఇలా ఎవరో ఒకరు వస్తుండేవారు. ఒకవేళ రాకపోయినా.. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ గురించి ఏదోక విషయం బన్నీ చెబుతుండేవారు. కానీ రెండు మూడు సినిమాల నుంచి అసలు మెగా హీరోల పేర్లు ప్రస్తావించడం వారి గురించి చెప్పడం వంటివి అర్జున్‌ చేయలేదు. దీంతో అర్జున్‌ మెగా కుటుంబానికి దూరం పెడుతున్న విషయం బయటకు వచ్చింది. మరోవైపు మెగా హీరోలు సైతం బన్నీ ప్రస్తావన ఇటీవల ఏ ఫంక్షన్లో కూడా తీసుకురావడం లేదు. అయితే.. బన్నీ ఫంక్షన్లలో మెగాస్టార్‌, పవర్‌ స్టార్‌ అంటూ కేకలు వేయడంపై గతంలో అర్జున్‌ ఘాటుగానే చెప్పను బ్రదర్‌ అని స్పందించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే బన్నీ రూటు మార్చాడని అంటున్నారు. 

45
allu arjun aravind

పెద్ద గొడవ జరిగిందా.. 
పుష్ప-2 విడుదల సమయంలో సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ అరెస్టు కావడం, ఆ తర్వాత బెయిల్‌పై రావడం జరిగింది. ఈ సమయంలో చిరంజీవి తప్పా, ఇతర మెగా హీరోలు ఎవరూ బన్నీని పరామర్శించేందుకు రాలేదు. కనీసం సామాజిక మాధ్యమాల్లో కూడా స్పందించలేదు. దీంతో రెండు కుటుంబాల మధ్య ఏదో పెద్ద గొడవ జరిగిందని.. చిరంజీవిని తక్కువ చేసే విధంగా బన్నీ ప్రవర్తించి ఉంటాడని అందరూ భావించారు. ఇరు రెండు వర్గాల ఫ్యాన్స్‌ సోషల్‌మీడియాలో ఒకరిపై ఒకరు దూషణలకు దిగిని పరిస్థితి. అయితే.. అర్జున్‌ అరెస్టు తర్వాత చిరంజీవిని కలిసేందుకు వచ్చాడు. ఆ సమయంలో రెండు కుటుంబాలు కలిసిపోయాయని అందరూ అనుకున్నారు. కానీ అదీ జరగలేదు. 

 

55
allu arjun jr ntr

రెండు కుటుంబాలు కలవడం కష్టమే.. 
తాజాగా అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా నేషనల్‌ వైడ్‌గా హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, ఫ్యాన్స్‌  బన్పీకి విషెస్‌ చెప్పారు. మెగా కాంపౌండ్‌కి చెందిన ఏ ఒక్క హీరో కూడా బన్నీకి విషెస్‌ చెప్పలేదు. కనీసం మెగాస్టార్‌ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. ఇక రీసెంట్‌ చరణ్‌ పుట్టినరోజు నాటు కూడా బన్నీ విషెస్‌ చెప్పలేదు. బన్నీకి ఇష్టమైన డైరెక్టర్‌ సుకుమార్‌ సమర్పణలో వస్తున్న పెద్ది సినిమా గ్లింప్స్‌ విడుదల సమయలో కూడా అర్జున్‌ స్పందించలేదు. దీనికి ప్రతిగా అల్లు అర్జున్ని మెగా హీరోలు పట్టించుకోవడం మానేశారు. దీన్నిబట్టి ఇక భవిష్యత్తులో అల్లు అర్జున్‌ వర్సెస్‌ మెగా హీరోల వైరం అలాగే కొనసాగుతుందని అర్థమవుతోంది. అయితే.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మాత్రం అల్లు అర్జున్‌కి ప్రేమతో విషెస్‌ చెప్పారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్‌ బావ అని సంభోదించారు. ఈ ఏడాది మంచి విజయాలు అందుకోవాలని ఎన్టీఆర్‌ ఆకాంక్షించారు. ఎన్టీఆర్‌ ట్వీట్‌పై అల్లు అభిమానులు ఆనందపడుతున్నారు. మెగాకాంపౌండ్‌ లేకపోయినా.. కష్టపడి పైకి వచ్చే సత్తా బన్నీకి ఉందని అల్లు ఆర్మీ టీం కామెంట్లు చేస్తున్నారు.  

Read more Photos on
click me!

Recommended Stories