Friday Releases: ఈ వారం ఓ రేంజ్ సినిమాలు విడుదలవుతున్నాయి. తెలుగు నుంచి చిన్న చిత్రాలే ఉన్నా, తమిళం, హిందీ నుంచి మాత్రం పెద్ద మూవీస్ ఉన్నాయి. ఈ గురువారం ఏప్రిల్ 10న థియేటర్లోకి మూడు సినిమాలు వస్తున్నాయి. ఏప్రిల్ 11న ఒక సినిమా ఉంది. మరి గురువారం రోజున తెలుగు మూవీ ఒక్కటే ఉంది.
టిల్లుగా పాపులర్ అయిన సిద్దు జొన్నలగడ్డ హీరోగా, వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా నటించిన `జాక్` మూవీ విడుదలవుతుంది. ఇది కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. దీనికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి.