Akhanda 2 : నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన సినిమా అఖండా 2. ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇంతకీ అఖండ2 వాయిదాకు కారాణం ఏంటో తెలుసా? మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు?
వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు బాలకృష్ణ.. వెంట వెంటనే నాలుగు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. డబుల్ హ్యాట్రిక్ దిశగా వెళ్తోన్న బాలయ్య సక్సెస్ లైన్ లో అఖండా 2 సినిమా ఐదొవది. ఈక్రమంలో ఈసినిమాపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇక అంతే భారీ అంచనాల నడుమ రిలీజ్ రు రెడీ అయిన అఖండ 2 మూవీ రిలీజ్ ఆగిపోయింది. ఎప్పుడు రిలీజ్ అవ్వబోతోందో కూడా ఇంకా ప్రకటించలేదు. చివరి నిమిషంలో ఈసినిమా వాయిదాకు కారణం ఏంటి?
24
రిలీజ్ పై కోర్టుకెక్కింది ఎవరు?
డిసెంబర్ 5వ న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావాల్సిన అఖండా 2 సినిమా బెనిఫిట్ షోలను ముందుగా రద్దు చేశారు. ఈ విషయంలోనే అభిమానులు చాలా నిరాశ చెందారు. కానీ అసలు సినిమానే మొత్తంగా రిలీజ్ ఆపేయడంతో.. నందమూరి అభిమానులకు షాక్ తగిలినట్టు అయ్యింది. సడెన్ గా ఈ సినిమా విడుదల వాయిదా వేయాలంటూ.. డిసెంబర్ 4 న ఎరోస్ ఇంటర్నేషన్ సంస్థ మద్రాస్ కోర్టును ఆశ్రయించడం వివాదంగా మారింది. రాత్రి వరకు ఎరోస్ సంస్థతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సినిమా నిరవధికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
34
సోషల్ మీడియాలో వెల్లడించిన నిర్మాణ సంస్థ
అఖండ2 వాయిదాపై ఎక్స్ లో నిర్మాణ సంస్థ ఓ ప్రకటన కూడా రిలీజ్ చేసింది. భారమైన హృదయంతో అఖండ 2 సినిమా వాయిదా వేశామని తెలియచేయడానికి చింతిస్తున్నాం. కొన్ని సమస్యలు పరిష్కరించలేని పరిస్థితులు ఏర్పడ్డ కారణంగా ఈ సినిమాను అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయలేకపోతున్నాం. ఇది మాకు చాలా బాధాకరమైన విషయం. ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రతీ ఒక్కఅభిమానికి అఖండ వాయిదా వేయడం తీవ్ర నిరాశను కలిగించి ఉంటుంది. వారి పరిస్థితిని మేము అర్ధం చేసుకోగలం. ఈ సినిమా చూట్టు నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం ప్రతీక్షణం ప్రయత్నిస్తూనే ఉన్నాం. అభిమానులకు మా వల్ల కలిగిన ఈ అసౌకర్యానికి చాలా బాధపడుతూ.. క్షమాపణలు అడుగుతున్నాం.. ఈ పరిస్థితుల్లో మీ సహకారం మాకు ఎంతో అవసరం. అదే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అన్ని సమస్యలు పరిక్షరించి.. త్వరలోనే అఖండ2 రిలీజ్ పై పాజిటీవ్ అప్ డేట్ ను అందిస్తాం అని 14 రీల్స్ ప్లస్ ట్వీట్ చేశారు.
నందమూరి అభిమానులు అఖండ2 పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బాలయ్య అఖండ తాండవం టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ తో ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ కు భారీగా డిమాండ్ ఉంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన అఖండ 2: తాండవం పై కూడా అంచనలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా తమన్ మ్యూజక్ ఈసినిమాను నెక్ట్స్ లెవల్స్ కు తీసుకెళ్తుందన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇక ఈ సినిమా ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తుండగా.. బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందిన అఖండ2 రిలీజ్ పై త్వరలో మరో ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.