బాలయ్య నటించిన అఖండ 2 విషయంలో అభిమానులకు పెద్ద నిరాశ ఎదురైంది. ఈ చిత్ర ప్రీమియర్ షోలు రద్దు చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఎందుకు అఖండ 2 ప్రీమియర్ షోలు ఉన్నపళంగా రద్దు అయ్యాయి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రానికి రిలీజ్ ముందు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అఖండ 2 చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. గురువారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలు కావలసింది. కానీ ప్రీమియర్ షోలు రద్దు అయినట్లు నిర్మాతలు సంచలన ప్రకటన చేశారు.
25
తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు, అభిమానులకు నిరాశ
నిర్మాతలు చేసిన ఈ ప్రకటన అభిమానులకు, ప్రేక్షకులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 14 రీల్స్ ప్లస్ సంస్థ అఖండ 2 ప్రీమియర్స్ కి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రీమియర్స్ ప్రదర్శించాలని ముందే నిర్ణయించారు. గురువారం రాత్రి 9 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ షోలు మొదలు కావలసింది.
35
ఆర్థిక సమస్యల్లో నిర్మాతలు
కానీ మేకర్స్ చేసిన తాజా ప్రకటనతో అభిమానుల ఆశలు నీరుగారిపోయాయి. ప్రీమియర్ షోలు రద్దు కావడానికి సాంకేతిక సమస్యలు కారణం అని మేకర్స్ ప్రకటించారు. కానీ అసలు వాస్తవం వేరే ఉన్నట్లు తెలుస్తోంది. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాతలు తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్నారట. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. గతంలో 14 రీల్స్ సంస్థ నిర్మించిన చిత్రాలకు గాను.. ఈరోస్ సంస్థకి ఇంకా 28 కోట్లు చెల్లించాల్సి ఉందట.
దీనితో ఈరోస్ సంస్థ మద్రాస్ హై కోర్టుని ఆశ్రయించింది. దీనితో మద్రాస్ హై కోర్టు ఈరోస్ కి అనుకూలంగా తీరుపై విధిస్తూ అఖండ 2 రిలీజ్ పై స్టే విధించింది. అఖండ 2 రిలీజ్ కి ముందే తమ డబ్బు చెల్లించాలని ఈరోస్ సంస్థ పిటిషన్ లో పేర్కొంది. ఈరోస్ వాదనతో ఏకీభవించిన జస్టిస్ ఎస్ ఎం సుబ్రహ్మణ్యం, జస్టిస్ సి కుమారప్పన్ లతో కూడిన డివిజన్ బెంచ్ అఖండ 2 రిలీజ్ ఆపాలని ఉత్తర్వులు జారీ చేసింది. అందువల్లే తాజాగా 14 రీల్స్ ప్లస్ సంస్థ అఖండ 2 ప్రీమియర్ షోలని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
55
ఓవర్సీస్ లో అంతా ఒకే
ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు యథావిధిగా కొనసాగుతాయి అని ప్రకటించారు. అయితే డిసెంబర్ 5 న అఖండ 2 రిలీజ్ ఇండియాలో స్మూత్ గా జరుగుతుందా ? లేక ఏమైనా అడ్డంకులు ఉంటాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.