Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి

Published : Dec 04, 2025, 11:20 PM IST

బిగ్ బాస్ తెలుగు 9 షోలో తొలి ఫైనలిస్ట్ రేసు నుంచి సుమన్ శెట్టి తప్పుకున్నారు. ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ ఇద్దరూ రీతూని సైడ్ చేయడానికి కుట్ర పన్నారు. అయితే వారి పథకంలో భరణి బలి అయ్యారు. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9

బిగ్ బాస్ తెలుగు 9 షోలో భాగంగా ఫస్ట్ ఫైనలిస్ట్ ని ఎంపిక చేసే టాస్కులు పోటాపోటీగా సాగుతున్నాయి. ఈ వారం ఒకరికి తొలి ఫైనలిస్ట్ గా అవకాశం లభించబోతోంది. ఆ ఒక్కరు ఎవరు అనేది ఉత్కంఠ నెలకొంది. తమ గడులని కాపాడుకుంటూ చివరి వరకు పోటీలో నిలిచి విజయం సాధించిన వారికే తొలి ఫైనలిస్ట్ గా ఛాన్స్ లభించబోతోంది. హౌస్ లో 88వ రోజు కూడా టాస్కులు జరిగాయి. 

25
కళ్యాణ్, సుమన్ మధ్య యుద్ధం 

ముందుగా కళ్యాణ్, రీతూ, భరణి కలర్స్ టాస్క్ లో పోటీ పడ్డారు. ఈ ముగ్గురూ తమకి కేటాయించిన కలర్స్ ని బోర్డు పై అంటించాలి. ఎవరి కలర్ బాగా కనిపిస్తే వాళ్ళు విజయం సాధిస్తారు. ఈ టాస్క్ లో కళ్యాణ్ విజయం సాధించాడు. ఆ తర్వాత యుద్ధం కోసం కళ్యాణ్ తనకి పోటీగా తన పక్క గడులని షేర్ చేసుకుంటున్న సుమన్ శెట్టిని ఎంచుకున్నాడు. వీరిద్దరి యుద్ధం ప్రకారం హ్యామర్ తో కొన్ని వస్తువులని పగలగొట్టి త్రాసులో వేయాలి. ఎవరు ఎక్కువ బరువు ఉన్న వస్తువులు త్రాసులో వేస్తారో వాళ్లే విజయం సాధిస్తారు. 

35
సుమన్ శెట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ రేసు నుంచి అవుట్ 

ఈ టాస్క్ లో కూడా కళ్యాణ్ విజయం సాధించాడు. సుమన్ ఎక్కువ బరువు వేయకుండా చివర్లో కళ్యాణ్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో సుమన్ పడిపోయాడు. అయినా కూడా కళ్యాణ్ వదల్లేదు. మొత్తంగా ఈ టాస్క్ లో కళ్యాణ్ విజయం సాధించాడు. దీనితో తన గడులు కోల్పోవడంతో సుమన్ శెట్టి తొలి ఫైనలిస్ట్ రేస్ నుంచి తప్పుకున్నాడు. 

45
ఇమ్ము, కళ్యాణ్ సీక్రెట్ స్ట్రాటజీ 

ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ సీక్రెట్ గా స్ట్రాటజీ మొదలు పెట్టారు. వీళ్లిద్దరి టార్గెట్ భరణి, రీతూనే. రీతూతో భరణి పోటీ పడేలా చేయాలని ఆ విధంగా ఆమెని సైడ్ చేయాలి అని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర పన్నారు. దీని కోసం కాయిన్స్ ని బ్యాలెన్స్ చేసే టాస్క్ లో కావాలని ఓడిపోవాలని ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. 

55
ఇమ్ము, కళ్యాణ్ కుట్రలో భరణి బలి 

కానీ తామిద్దరం కావాలనే ఓడిపోతున్నట్లు రీతూకి తెలియకూడదని ఇమ్ము, కళ్యాణ్ సీక్రెట్ గా మాట్లాడుకున్నారు. అనుకున్న విధంగానే కళ్యాణ్, ఇమ్ము బ్యాలెన్స్ చేయరా డింభకా టాస్క్ లో ఓడిపోయారు. రీతూ విజయం సాధించింది. ఇమ్ము, కళ్యాణ్ అనుకున్నట్లుగానే నెక్స్ట్ టాస్క్ లో రీతూ.. భరణిని పోటీగా ఎంచుకుంది. ట్రైయాంగిల్, సర్కిల్ ఇలా కొన్ని ఆకారాలని వరుసగా అమర్చే టాస్క్ అది. ఇందులో భరణి ప్రారంభంలో పైచేయి సాధించారు. కానీ చివరికి రీతూ విజయం సాధించింది. 

Read more Photos on
click me!

Recommended Stories