ఐశ్వర్యారాయ్ 8 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు.. భారీగా వసూళ్లు సాధించిన ఐశ్ మూవీస్..

First Published | Nov 1, 2024, 8:23 PM IST

భారత మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ నటించిన 8 అద్భుతమైన సినిమాలు  ఏంటో తెలుసా.. ? అందులో బాక్సాఫీస్ ను షేక్ చేసిన మూవీస్ ఎంటో తెలుసా..? 

తన కెరీర్ లో అద్భుతమైన సినిమాలను చేశారు  ఐశ్వర్యారాయ్. అందులో ఆడియన్స్ మనసుల్లో నిలిచిపోయిన ఓ  8 అత్యుత్తమ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిలో 'మొహబ్బతే' చిత్రం బడ్జెట్ కంటే 7 రెట్లు ఎక్కువ వసూలు చేసింది.

Also Read: తెలుగు చదవడం,రాయడం రాని తెలుగు హీరోలు వీళ్ళే..

 హమ్ దిల్ దే చుకే సనమ్:  ఐష్ అద్భుతమైన సినిమాల్లో ముందుగా చెప్పుకోవలసినది 1999లో విడుదలైన ఐశ్వర్యారాయ్ 'హమ్ దిల్ దే చుకే సనమ్.   16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈసినిమా లో  సల్మాన్ ఖాన్-అజయ్ దేవగన్‌లతో కలిసి నటించింది ఐశ్వర్యరాయ్. ఇక ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర 51.38 కోట్లు వసూలు చేసింది.

Also Read: విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక మందన్న దీపావళి వేడుకలు


తాల్: ఐశ్వర్యారాయ్ 'తాల్' సినిమా కూడా  సూపర్ హిట్ అయ్యింది.  బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేసింది.  అనిల్ కపూర్-అక్షయ్ ఖన్నాలతో కలిసి ఈసినిమాలో నటించింది ఐశ్వర్యరాయ్. ఇక  ఈ చిత్రం బడ్జెట్ 15 కోట్లు,కాగా.. ఫైనల్ రన్ లో  51.16 కోట్లు వసూలు చేసింది.

Also Read: విజయ్ దళపతి కొత్త కారు.. విమానం కంటే హైటెక్! ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే..?

మొహబ్బతే : 2000 లో విడుదలైన ఐశ్వర్యారాయ్ 'మొహబ్బతే' చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన ఈ చిత్రం బడ్జెట్ 13 కోట్లు కాగా.. దాదాపు  90 కోట్లు వసూలు చేసింది. ఈసినిమాలో ఐష్ తో షారుఖ్ డ్యూయెట్స్ సూపర్ హిట్ అయ్యాయి. 

Also Read: CID 2 వచ్చేస్తోంది, బుల్లితెర ఆడియన్స్ కు ఇక పండగే..

 దేవదాస్:    ఐశ్వర్యరాయ్ కెరీర్ లోనే అద్భుతమైన సినిమా అంటే దేవదాస్ అని చెప్పవచ్చు. 2002లో విడుదలైన ఐశ్వర్యారాయ్ 'దేవదాస్' చిత్రానికి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు. షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన ఈ చిత్రం బడ్జెట్ 50 కోట్లు కాగా ఫైనల్ రన్ లో  168 కోట్లు వసూలు చేసింది.

Also Read: కోట శ్రీనివాసరావు ముఖంపై కాండ్రించి ఉమ్మేసిన బాలకృష్ణ

 ధూమ్ 2: ఐశ్వర్యారాయ్-అభిషేక్ బచ్చన్-రితిక్ రోషన్ నటించిన ధూమ్ 2 సినిమా  42 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. పక్కా యాక్షన్ మూవీ ఇది. 2006 లో రిలీజ్ అయిన ఈసినిమా దాదాపు గా 151 కోట్లు వసూలు చేసింది.

 గురు:  ఇక తన భర్తతో ఐశ్ నటించిన మరో సినిమా గురు. 2007 లో విడుదలైన ఐశ్వర్యారాయ్-అభిషేక్ బచ్చన్ 'గురు' చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది.  ఐశ్వర్యరాయ్ సినిమా గురువు మణిరత్నం ఈ చిత్రాన్ని 22 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు, 83.67 కోట్లు వసూలు చేసింది.

Also Read: గౌతమ్ కు మళ్లీ వెన్నుపోటు పొడిచిన యష్మి

జోధా అక్బర్: ఐశ్వర్యారాయ్-రితిక్ రోషన్ 'జోధా అక్బర్' చిత్రం 2008 లో విడుదలైంది. ఈ చిత్రానికి 80 కోట్లకు పైగా ఖర్చు చేయగా, ఏకంగా 120 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

 ఏ దిల్ హై ముష్కిల్ : 2016 లో విడుదలైన ఐశ్వర్యారాయ్-రణ్‌బీర్ కపూర్-అనుష్క శర్మ 'ఏ దిల్ హై ముష్కిల్' చిత్రం బ్లాక్‌బస్టర్. చిత్ర బడ్జెట్ 50 కోట్లు. చిత్రం 239.67 కోట్లు వసూలు చేసింది.

Latest Videos

click me!