దీపావళి పండుగని పురస్కరించుకుని మూడు, నాలుగు సినిమాలు థియేటర్లోకి వచ్చి సందడి చేశాయి. దసరాకి కూడా చాలా సినిమాలు వచ్చినా, ఒక్కటి కూడా హిట్ కాలేదు. దీంతో ఈ దీపావళి సీజన్ అయినా క్యాష్ చేసుకుంటాయా? మంచి సినిమాలు వస్తాయా? అనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఈ దివాళీకి ప్రధానంగా మూడు సినిమాలు సందడి చేస్తున్నాయి. అందులో దుల్కర్ సల్మాన్ `లక్కీ భాస్కర్`, కిరణ అబ్బవరం `క`, సాయిపల్లవి, శివకార్తికేయన్ `అమరన్` చిత్రాలు వచ్చాయి. వీటితోపాటు శ్రీ మురళీ `బఘీర` మూవీ కూడా విడుదలైంది.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరి ఈ సినిమాల్లో ఏది హిట్, ఏది ఫట్ అనేది చూస్తే.. కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతుంది `అమరన్. ఇది తమిళంలో రూపొందిన చిత్రం. పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఓ సైనికుడి బయోపిక్ తరహాలో రూపొందిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. క్రిటిక్స్ సైతం అదిరిపోయిందనే టాక్ వినిపించింది. దీనికితోడు ఇందులో సాయిపల్లవి చేస్తున్న మ్యాజిక్ సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్లిందని చెప్పొచ్చు.
సుమారు 130కోట్లతో హీరో కమల్ హాసన్ దీన్ని నిర్మించారు. ఈ మూవీకి ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రావడం విశేషం. ఈ మూవీ ఫస్ట్ డే 42.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 22కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాకి 65కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. అంటే 130కోట్ల గ్రాస్ వస్తే బయ్యర్లు సేఫ్ అని చెప్పొచ్చు. సినిమాకి వస్తోన్న టాక్ చూస్తుంటే తొలి వీకెండ్‌లోనే కొట్టేలా ఉంది.
ఈ దీపావళికి విడుదలైన సినిమాల్లో అన్ని చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగులో వచ్చిన `లక్కీ భాస్కర్` మూవీకి కూడా మంచి స్పందన లభిస్తుంది.ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. బ్యాంక్ స్కామ్‌ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ డీసెంట్ ఓపెనింగ్స్ ని సాధించింది.
ఫస్ట్ డే 12.7కోట్ల గ్రాస్ లభించింది. అయితే ఈ మూవీకి 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. తొలి రోజు 7కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 23 కోట్లు వస్తే అంటే సుమారు 50కోట్ల గ్రాస్ వసూలు చేస్తే సినిమా హిట్ ఖాతాలో పడుతుంది. ఈ మూవీ నెమ్మదిగా పుంజుకునే అవకాశం ఉంది.
దీపావళి కానుకగా వచ్చిన చిత్రాల్లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన `క` కూడా ఉంది. సుజీత్, సందీప్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కిరణ్ అబ్బవరంకి జోడీగా నయన్ సారిక నటించగా, తన్వి రామ్ కీలక పాత్ర పోషించింది. సుమారు 20కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందింది. 12కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అయ్యింది.
తొలి రోజు ఇది 6.18కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంటే 3కోట్ల షేర్ సాధించింది. ఇంకా 18కోట్ల గ్రాస్ వస్తే సినిమా హిట్ లోకి వెళ్లిపోతుంది. తొలి రోజుతో పోల్చితే రెండో రోజు ఇది మరింత పుంజుకుంది. ఈ వీకెండ్‌లోనే ఈ మూవీ బ్రేక్‌ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్లబోతుంది. ఇది పెద్ద హిట్ గా నిలవబోతుంది.