విరోష్.. అంటే విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26, 2026న ఉదయ్‌పూర్‌లో జరిగింది. ఇప్పుడు ఈ జంట పెళ్లికి సంబంధించిన మరికొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కనిపిస్తున్న మూడో వ్యక్తి ఎవరో తెలుసా?
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ఫొటోలను 'Unseen Friend' అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ షేర్ చేసింది. 'విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు అభినందనలు. ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పగించినందుకు ధన్యవాదాలు. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది.
26
ఫొటోల్లో విజయ్-రష్మికతో పాటు మూడో వ్యక్తి
ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఈ కొత్త ఫొటోల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వధూవరులుగా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. కానీ, వాళ్లిద్దరితో పాటు కనిపిస్తున్న మూడో వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పూజారిలా కనిపిస్తున్న ఈ వ్యక్తే.. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
36
రష్మిక-విజయ్ పెళ్లి కారులో కూడా ఉన్నది ఎవరు?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వైరల్ ఫొటోల్లో కనిపిస్తున్న వ్యక్తి.. కొన్నిచోట్ల మంత్రాలు చదువుతూ, మరికొన్ని చోట్ల వాళ్లను ఆశీర్వదిస్తూ కనిపించాడు. అంతేకాదు, పెళ్లి తర్వాత వధూవరులు వెళ్తున్న వింటేజ్ కారులో కూడా విజయ్, రష్మికలతో పాటు ఈ వ్యక్తి కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ వైరల్ ఫొటోలు చూసి నెటిజన్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఇవి AIతో క్రియేట్ చేసినవని స్పష్టంగా తెలుస్తోంది. ఓ యూజర్ 'పెళ్లి నిజమే, కానీ పంతులు మాత్రం AI' అని కామెంట్ చేశాడు. 'దయచేసి ఇవి AI అని చెప్పకండి' అని మరొకరు రాశారు. 'అరే.. నేను నిజం అనుకున్నా' అని ఒకరు, 'స్క్రోల్ చేస్తుంటే మైండ్ కన్ఫ్యూజ్ అయ్యింది' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఎడిటింగ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందంటే.. బంధువులు కూడా నమ్మేశారు' అని మరో యూజర్ రాశాడు. మొత్తానికి ఇవి ఏఐ ఫోటోలు అని తేల్చేశారు?
56
విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్
విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ రష్మిక మందన్నతో తన పెళ్లిని కన్ఫర్మ్ చేశాడు. 'ఒకరోజు తను పక్కన లేని లోటు బాగా తెలిసింది. తను పక్కనుంటే నా రోజు ఇంకా బాగుండేదనిపించింది. తను ఎదురుగా కూర్చుని తింటుంటే ప్రతి ముద్దా ప్రశాంతంగా అనిపించేది. తనతో వర్కవుట్ చేస్తుంటే అది శిక్షలా కాకుండా, సరదాగా ఉండేది. ఎక్కడున్నా, తను పక్కనుంటే చాలు.. ఇల్లే గుర్తొచ్చేది, ప్రశాంతంగా అనిపించేది. అందుకే.. నా బెస్ట్ ఫ్రెండ్‌నే నా భార్యగా చేసుకున్నాను' అని ఫొటోల క్యాప్షన్‌లో రాశాడు.
66
భర్తను పరిచయం చేసిన రష్మిక మందన్న
రష్మిక మందన్న పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ, 'హాయ్ మై లవ్స్, ఈయనే నా భర్త మిస్టర్ విజయ్ దేవరకొండ. నిజమైన ప్రేమ, ప్రశాంతతకు అర్థం ఆయనే నాకు చెప్పారు. పెద్ద కలలు కనే ధైర్యాన్నిచ్చారు, ఎప్పుడూ నన్ను నమ్మారు. ఆయన వల్లే నేను ఎప్పుడూ ఎలా ఉండాలనుకున్నానో అలా తయారయ్యాను. నా ప్రతి సంతోషం, కష్టం, విజయం ఇప్పుడు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆయన నాతో ఉన్నారు. ఆయన భార్య అయినందుకు చాలా ఎగ్జైటింగ్‌గా, అదృష్టంగా ఫీలవుతున్నాను' అని రాసింది.