నా జీవితంలో జ్యోతిష్యుడు చెప్పినట్టే జరిగింది.. అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు

Published : Feb 27, 2026, 12:36 PM IST

Amala Paul: టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ అమలాపాల్ తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని సంచలన విషయాలను పంచుకున్నారు. అల్లు అర్జున్ సరసన 'ఇద్దరమ్మాయిలతో' సినిమాతో.. 

PREV
15
ఒక జ్యోతిష్యుడు ముందే ఊహించారని

హీరోయిన్ అమలాపాల్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన పెళ్లి గురించి ఒక జ్యోతిష్యుడు ముందే ఊహించారని, ఆ సమయంలో తనకు బాయ్ ఫ్రెండ్ కూడా లేరని ఆమె తెలిపారు. జగత్ దేశాయ్‌తో పరిచయం, ప్రేమ, ప్రెగ్నెన్సీ తర్వాత పెళ్లి జరిగిన తీరు గురించి ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

25
తన వ్యక్తిగత జీవితం గురించి

టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ అమలాపాల్ తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని సంచలన విషయాలను పంచుకున్నారు. అల్లు అర్జున్ సరసన 'ఇద్దరమ్మాయిలతో' సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె, కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, ప్రస్తుత ఫ్యామిలీ లైఫ్ గురించి వివరించారు.

35
జ్యోతిష్యుడి జోస్యం నిజమైంది

తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో విడాకుల తర్వాత అమలాపాల్ ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందట. ఒక జ్యోతిష్యుడు ఆమెను కలిసి, త్వరలోనే ఆమెకు వివాహం జరుగుతుందని చెప్పారు. "ఆ సమయంలో నాకు బాయ్ ఫ్రెండ్ కూడా లేడు.. అసలు పెళ్లి ఎలా జరుగుతుంది అనుకున్నాను" అని ఆమె పేర్కొన్నారు. కానీ ఆశ్చర్యకరంగా కొద్ది రోజుల్లోనే గోవాలో జగత్ దేశాయ్‌తో పరిచయం ఏర్పడిందని, అది కాస్తా ప్రేమగా మారిందని ఆమె వెల్లడించారు.

45
తొందరగా జరిగిన పెళ్లి

జగత్ దేశాయ్‌తో ప్రేమలో ఉన్న సమయంలోనే అమలాపాల్ గర్భవతి అయ్యారు. ఆ పరిస్థితుల్లో వివాహం తప్పనిసరి కావడంతో, ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే తాను జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. "మా జీవితంలో ఇవన్నీ చాలా త్వరగా జరిగిపోయాయి.. ఇప్పుడు ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది" అని ఆమె వ్యాఖ్యానించారు. జగత్ దేశాయ్ ఒక వ్యాపారవేత్త అని, పెళ్లయ్యే వరకు తాను ఒక నటినని అతడికి తెలియదని అమలాపాల్ ఈ సందర్భంగా వెల్లడించారు.

55
ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను

మొదటి భర్తతో విడాకులు, ఆ తర్వాత ఎదురైన విమర్శల నుండి జగత్ తనను కాపాడారని, ఆయన అండగా నిలిచారని ఆమె తెలిపారు. 2023లో వీరి వివాహం జరగగా, 2024లో వీరికి ఒక కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం తన భర్త, కొడుకుతో కలిసి జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నానని, ఇంతకంటే తనకు ఏమీ వద్దని అమలాపాల్ ఎమోషనల్ అయ్యారు. అమలాపాల్ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories