Mamidi Konala Meena: తెలంగాణ జానపద సాహిత్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. మట్టి వాసన, మనసును తాకే బాణీలతో కూడిన జానపద గీతాలు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఫోక్ సాంగ్స్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. పల్లెటూరి సంస్కృతిని, అక్కడి మనుషుల అనుబంధాలను ప్రతిబింబించే ఈ పాటలు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి సంబంధాలు, ప్రేమ, విరహం వంటి అంశాలపై వచ్చే జానపదాలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా యూట్యూబ్‌లో విడుదలైన "మామిడి కోనల మీన" (MAMIDI KONALA MEENA) అనే పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక యువతి తన కాబోయే వరుడి గురించి కలలు కంటూ, అతని గురించిన ఆలోచనలను అందంగా పంచుకునే లిరిక్స్ ఆకట్టుకుంటోంది.
25
మనసు దోచే భావం
ఈ పాట ఒక స్వచ్ఛమైన గ్రామీణ ప్రేమకథను గుర్తు చేస్తుంది. తన కాబోయే భర్త ఎలా ఉంటాడో, అతని రాక కోసం తాను ఎలా ఎదురుచూస్తున్నానో ఒక యువతి తన మనసులోని మాటను పాట రూపంలో వ్యక్తపరుస్తుంది. ఆత్మీయత, అనురాగం నిండిన పదాలతో సాగే ఈ గీతం వింటుంటే పల్లెటూరి వాతావరణం కళ్లముందు కదలాడుతుంది.
35
గానం, రచన
ఈ పాట ఇంతగా ఆకట్టుకోవడానికి దీని వెనుక ఉన్న టీమ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాటను ప్రముఖ జానపద గాయని మధు ప్రియ, నాగవ్వ కలిసి ఆలపించారు. మధు ప్రియ గొంతులోని మాధుర్యం, నాగవ్వ గొంతులోని జానపద సొగసు ఈ పాటకు ప్రాణం పోశాయి. కల్యాణ్ కీస్అం దించిన సంగీతం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ పాటకు కమలేష్ లావత్ (Kamaleslavath) సాహిత్యం అందించారు. తెలంగాణ మాండలికంలో సాగే పదాలు ఎంతో అర్థవంతంగా ఉన్నాయి.
కేవలం ఆడియో మాత్రమే కాకుండా, ఈ పాట మేకింగ్, విజువల్స్ కూడా చాలా సహజంగా ఉన్నాయి. ఇందులో కనిపించడం అదనపు ఆకర్షణ. యువతి తన కాబోయే వరుడిని ఊహించుకుంటూ మురిసిపోయే సన్నివేశాలు, పల్లెటూరి లొకేషన్లు ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తున్నాయి. ఇక ఈ పాటకు అన్నింటికంటే ప్రత్యే ఆకర్షణ లీడ్ రోల్‌లో నటించిన నాగ దుర్గ. ఆమె అద్భుత డ్యాన్స్, ట్రెడిషనల్ క్యాస్టూమ్స్ బాగున్నాయి.
55
జానపదానికి పట్టాభిషేకం
కొత్తదనంతో పాటు మట్టి వాసనను కోరుకునే ప్రేక్షకులకు 'మామిడి కోనల మీన' ఒక చక్కని కానుకగా చెప్పొచ్చు. జానపద పాటలు కేవలం వినోదం మాత్రమే కాకుండా, మన సంస్కృతిని, భాషను తర్వాతి తరానికి ఎలా చేరవేస్తాయో ఈ పాట మరోసారి నిరూపించింది. ఇకపై ఎక్కడ చూసినా ఈ పాట మారు మోగడం ఖాయమని చెప్పడంలో సందేహం లేదు.