
హీరోయిన్ సంగీత తెలుగులో `ఖడ్గం` సినిమాతో మంచి బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత బిజీ హీరోయిన్ అయిపోయింది. `పెళ్లాం ఊరెళితే`, `ఆయుధం`, `టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్`, `ఖుషీ ఖుషీగా`, `విజయేంద్ర వర్మ`, `సంక్రాంతి`, `నా ఊపిరి`, `అదిరిందయ్యా చంద్రం`, `బహుమతి` వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది సంగీత. అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది.
ఆ తర్వాత కొంత కాలం తెలుగు సినిమాలకు గ్యాపిచ్చింది. పెళ్లి తర్వాత కొంత సెలక్టీవ్‌గా వెళ్లింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన సంగీత వరుసగా సినిమాలు చేస్తుంది. అదే సమయంలో తన పాత్రకి ప్రయారిటీ ఉన్న చిత్రాలే చేస్తోంది. `మసూద`తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. `ఆచార్య`లో టెంపుల్ సాంగ్‌లో చిరంజీవితో కలిసి స్టెప్పులేసి అదరగొట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు సినిమాలతో కాకుండా వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచింది. ఆమె విడాకులు తీసుకోబోతుందనే వార్త నెట్టింట దుమారం రేపుతుంది.
సంగీత సోషల్ మీడియా అకౌంట్లలో తన భర్త పేరుని తొలగించడంతో ఈ రూమర్లు విస్తరించాయి. ఇన్ స్టాగ్రామ్‌లో సంగీత క్రిష్ నుంచి సంగీత యాక్టర్ గా మార్చుకున్నారని, దీంతో భర్తతో రిలేషన్ చెడిందా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు నెటిజన్లు ఈ లాజిక్‌ని తీసి నెట్టింట డైవర్స్ రూమర్స్ క్రియేట్ చేశారు. అంతేకాదు ఇటీవల 1990 స్టార్స్ అందరు గెట్ టూ గెదర్ అయ్యారు. ఇందులో సంగీత భర్త లేరు. ఒంటరిగానే కనిపించింది. దీంతో ఈ రూమర్స్ ని మరింత బలంగా నమ్ముతున్నారు.
ఈ క్రమంలో తాజాగా దీనిపై నటి సంగీత స్పందించింది. రూమర్స్ పై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ రూమర్స్ లో నిజం లేదని, మొదట్నుంచి తన పేరుని ఇన్‌స్టాగ్రామ్‌లో సంగీత యాక్టర్ అని ఉంచుకున్నట్టు తెలిపింది. దీంతో విడాకులకు రూమర్స్ కి చెక్ పెట్టింది. తాము కలిసే ఉన్నట్టు ఆమె స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 2009లో హీరోయిన్ సంగీత.. ప్లే బ్యాక్ సింగర్ క్రిష్‌ని వివాహం చేసుకుంది. తిరువన్నమలైలోని అరుచలేశ్వర టెంపుల్‌లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది.
సంగీతం నటిగానే కాదు, టీవీ షోస్‌లోనూ మెరుస్తుంది. గతంలో ఆమె `జోడీ నెంబర్ 1`, `డాన్స్ జోడీ డాన్స్`, `సూపర్ జోడీ` డాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరించింది. ప్రస్తుతం ఆమె `పరదా` చిత్రంలో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ మెయిన్ లీడ్ చేస్తుండగా, ఆమెకి సపోర్టింగ్‌గా సంగీత కనిపించబోతున్నారు. ఆమెది బలమైన పాత్ర అని తెలుస్తోంది. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కాబోతుంది.