సమంత 10th క్లాస్ మార్కుల షీట్ చూశారా..? ఎన్నిమార్కులు వచ్చాయంటే.. ?

హీరోయిన్  సమంత తన పాఠశాల విద్యను చెన్నైలో పూర్తి చేశారు, ఆమె పల్లవరం పాఠశాలలో 10 వ తరగతి చదివింది. కాగా సమంత మార్క్ షిట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

సమంత స్కూల్ మార్కులు

గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత. ఈసినిమాలో  నాగ చైతన్యకు జోడీగా నటించారు సమంత

ఇక తమిళంలో సమంత తొలిసారిగా హీరోయిన్‌గా నటించిన సినిమా బాణా కాతాడి. ఆ సినిమాలో నటుడు అధర్వ మురళికి జోడీగా నటించారు సమంత. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. యువన్ పాటలతో ఈ సినిమా వేరే లెవల్ హిట్ అయింది.

పవన్ మిస్ అయ్యాడు, మహేష్ బాబు బుక్ అయ్యాడు, ఏ సినిమానో తెలుసా..?

నటి సమంత

దీని తర్వాత తెలుగులో నటి సమంతకు వరుసగా అగ్ర హీరోలకు జోడీగా నటించే అవకాశం వచ్చింది. దాన్ని అంగీకరించి జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి వారికి జంటగా వరుస సినిమాల్లో  నటించారు సమంత. ఇటు తెలుగు, అటు తమిళంలో వరుస సినిమాలు చేశారు సమంత. 

కోలీవుడ్‌లో కూడా స్టార్  దర్శకులుగా వెలుగొందుతున్న మణిరత్నం కడల్ చిత్రంలో నటించడానికి మొదట కమిటైనది సమంతనే. అదేవిధంగా  దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ఐ చిత్రంలో విక్రమ్ జోడీగా నటించడానికి చిత్ర బృందం మొదట సంప్రదించింది సమంతనే. కానీ ఆ రెండు సినిమాల నుంచి సమంత తప్పుకున్నారు.

తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన  ఈగ చిత్రంలో నానికి జోడీగా నటించారు సమంత. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయవంతం కావడంతో సమంతకు మార్కెట్ ఒక్కసారిగా పెరిగింది. దాని తర్వాత తమిళంలో విజయ్‌కి జోడీగా థేరి, కత్తి, మెర్సల్ వంటి చిత్రాల్లో నటించారు సమంత.

రేటు పెంచిన అనిల్ రావిపూడి... సినిమాకు అన్ని కోట్లా..?


సమంత రూత్ ప్రభు

తర్వాత 2017లో నటుడు నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్నారు సమంత. వీరి వివాహం గోవాలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై సమంత - నాగ చైతన్య జంటను ఆశీర్వదించారు.

వివాహం తర్వాత కూడా నటి సమంత సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ వచ్చారు. దాదాపు 4 ఏళ్లు సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితంలో 2021లో చెడు చేరింది. ఆ ఏడాదే ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు.

సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నటుడు నాగ చైతన్య నటి శోభితా ధూళిపాళ్లపై ప్రేమలో పడ్డారు. ఆ జంట వివాహం త్వరలో జరగనుంది. ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. మరోవైపు సమంత మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనని బహిరంగంగానే చెప్పేశారు.

బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల్లో కనిపించని మోక్షజ్ఞ, కారణం ఏంటి..?

పల్లవరం స్కూల్లో చదివిన సమంత

 సమంత  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. అయితే ఆమె చదివింది మాత్రం చెన్నెలోనే.  చెన్నై పల్లవరంలోనే పుట్టి పెరిగారు. అక్కడే తన పాఠశాల విద్యను పూర్తి చేశారు సమంత. పల్లవరంలోని సెయింట్ స్టీఫెన్స్ మెట్రికുలేషన్ పాఠశాలలోనే 10వ తరగతి వరకు చదివారు సమంత.

నటనలో దిట్ట అయిన సమంత చదువులో కూడా టాపర్ అని తేలింది. ఆమె 10వ తరగతి  మార్క్‌షీట్ రీసెంట్ గా వైరల్ అవుతోంది. అందులో వెయ్యికి 887 మార్కులు సాధించి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు సమంత.  సమంత. ఆ ర్యాంక్ కార్డు ప్రస్తుతం వైరల్ అవుతోంది.

అందులో ఇంగ్లీష్ మొదటి పేపర్‌లో 90 మార్కులు, రెండో పేపర్‌లో 74 మార్కులు సాధించగా, తమిళంలో మొదటి పేపర్‌లో 83 మార్కులు, రెండో పేపర్‌లో 88 మార్కులు సాధించారు. గణితంలో మొదటి పేపర్‌లో 100 మార్కులు, రెండో పేపర్‌లో 99 మార్కులు సాధించారు. అదేవిధంగా ఫిజిక్స్‌లో 95, బోటనీలో 84, హిస్టరీలో 91, జియోగ్రఫీలో 83 మార్కులు సాధించారు.

సమంత 10వ మార్కులు

ఆ పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించిన నటి సమంతను ప్రశంసిస్తూ, సమంత ఈ స్యూల్ లో చదవడం మా లక్కీ అంటూ..  టీచర్ అందులో రాయడం ప్రముఖంగా కనిపిస్తుంది. ఇక ఈ మార్క్ షీట్ చూసి..నెటిజన్లు నటనలాగే నటి సమంత చదువులో కూడా టాప్ అని ఆశ్చర్యంతో చూసి ఆమెను ప్రశంసిస్తున్నారు.

నటి సమంత వద్ద ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ఉంది. ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ వెబ్ సిరీస్‌కు రాజ్ & డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్‌కి జోడీగా నటి సమంత నటించారు.

ఇది కాకుండా ఇటీవల నటి సమంత నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ఆమె నిర్మిస్తున్న తొలి చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలో తమిళంలోనూ ఓ చిత్రంలో సమంత నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. అది ఏ సినిమా అనేది  చూడాలి.

Latest Videos

click me!