అనిల్ రావిపూడి.. టాలీవుడ్ లో రాజమౌళి తరువాత సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న దర్శకుడు. కామెడీ, హీరోయిజం తో డిఫరెంట్ జానర్ లో సినిమాలు చేస్తున్నాడు అనిల్ రావిపూడి. స్టార్ హీరో అయినా.. కొత్త హీరోఅయినా.. తన కథతో విజయాన్ని అందేలా చేయగల దర్శకుడు అనిల్ రావిపూడి.
అన్ని జానర్స్ కు తగ్గ ప్రేక్షకులకి నచ్చేలా సినిమాలు చేయడంలో అనిల్ రావిపూడి రూటే సెపరేటు. సూపర్ స్టార్ మహేష్ కు కూడా తన కామెడీ టచ్ తో సక్సెస్ అందించాడు అనిల్. బాలయ్య బాబుతో సినిమా చేసి.. స్టార్ దర్శకుడిగా టాలీవుడ్ లో నిలిచిపోయాడు.