Bigg Boss Telugu 8: నామినేషన్స్ ఆ ఆరుగురు, ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?

First Published | Sep 3, 2024, 7:49 PM IST


బిగ్ బాస్ తెలుగు సీజన్ మూడో రోజుకు చేరుకుంది. ఫస్ట్ వీక్ నామినేషన్స్ జరగనున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
 


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. హౌస్లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు.  సీరియల్ నటి యాష్మి గౌడ, నటుడు అభయ్ నవీన్, సీరియల్ నటుడు నిఖిల్, ప్రేరణ, నటుడు ఓం ఆదిత్య, సోషల్ మీడియా స్టార్ బేబక్క హౌస్లోకి వచ్చారు. 

కాగా సోమవారం వచ్చిదంటే హౌస్లో హీట్ మొదలవుతుంది. నామినేషన్స్ డే కావడంతో కంటెస్టెంట్స్ ఒకరిపై మరొకరు ఫైర్ అవుతూ ఉంటారు. నామినేషన్స్ లో ఉంటే డేంజర్ బెల్స్ మోగినట్లే. ప్రేక్షకులు ఓట్లు వేయకపోతే ఇంటి బాట పట్టాల్సి వస్తుంది. అందుకే కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండకూడదని భావిస్తారు. 


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో 6 కంటెస్టెంట్స్ ఉన్నారని సమాచారం. నామినేషన్స్ ప్రక్రియలో శేఖర్ బాషా-నాగ మణికంఠ మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. అలాగే ప్రేరణ-సోనియా ఆకుల సైతం పోట్లాటకు దిగారు. యాష్మి గౌడ సైతం ఫైర్ అయ్యింది. 


మెజారిటీ ఓట్లు పడిన కంటెస్టెంట్స్ నామినేట్ అవుతారన్న సంగతి తెలిసిందే. పృథ్విరాజ్, నాగ మణికంఠ, ప్రేరణ, సోనియా ఆకుల, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా నామినేట్ అయినట్లు సమాచారం. వీరిలో ఇకను వచ్చే వారం హౌస్ ని వీడాల్సి ఉంటుంది. ఒక అంచనా ప్రకారం వీరిలో బేబక్క ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. 

Happy Birthday Pawan Kalyan

బేబక్క వయసులో పెద్దవారు. ఆమె కేవలం సోషల్ మీడియా స్టార్. నామినేషన్స్ లో ఉన్న మిగతా వారితో పోల్చితే ఆమెకు అంతగా ఫేమ్ లేదు. అలాగే ఏజ్ బార్ లేడీ కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ మేకర్స్ త్వరగా ఉద్వాసన చెబుతారు. గతంలో హేమ, కిరణ్ రాథోడ్, షకీలా, కరాటే కళ్యాణి తక్కువ వారాల్లో ఎలిమినేట్ అయ్యారు. 

Bezawada Bebakka Bigg Boss8


మరొక లాజిక్ ఏమిటంటే... మెజారిటీ సీజన్స్ లో ఫస్ట్ వీక్ లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. కాబట్టి ఏ విధంగా చూసినా బెజవాడ బేబక్క ఇంటికి వీడటం ఖాయం అంటున్నారు. మరి ఈ అంచనా ఈ మేరకు నిజం అవుతుందో చూడాలి. 

Latest Videos

click me!