ఇటీవల ఉత్తేజ్ భార్య పద్మ అనారోగ్యంతో మరణించారు. క్యాన్సర్ బారిన పడిన పద్మ చికిత్స తీసుకుంటూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించడం జరిగింది. భార్య మరణం మానసికంగా ఉత్తేజ్ ని కృంగదీసింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో పాటు టాలీవుడ్ ప్రముఖులు పద్మ అంత్యక్రియలకు హాజరై, ఉత్తేజ్ ని ఓదార్చారు.