సిల్వర్ కలర్‌ ట్రెండీ వేర్‌లో క్లీవేజ్‌ అందాలతో కేకపెట్టిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌

Published : Nov 15, 2021, 05:35 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా తిరుగులేని 16ఏళ్ల కెరీర్‌ ఆమె సొంతం. ఈ జర్నీలో ఆమె సినిమాలు పరాజయం చెందినా నటిగా తమన్నా ఫెయిల్‌ కాలేదు. అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేయడం తమన్నాకి వెన్నతో పెట్టిన విద్య.   

PREV
18
సిల్వర్ కలర్‌ ట్రెండీ వేర్‌లో క్లీవేజ్‌ అందాలతో కేకపెట్టిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌

తమన్నా(Tamannah) గ్లామర్‌ క్వీన్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. భారీ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. ఈ అమ్మడి హాట్‌ షో ఎప్పుడూ ఆడియెన్స్ కొత్తగానే ఫీలవుతుంటాయి. ఆమె అందాల కోసం ఆతృతగా వేచి చూస్తుంటారు. కచ్చితంగా అభిమానులను ఖుషీ చేసేందుకు తానెప్పుడూ సిద్ధంగానే ఉంటుంది Tamannah. తాజాగా సిల్వర్‌ గౌన్‌లో మెరిసిపోయింది. అందాల నెలవంక భూమిపైకి వచ్చిందా అనేంతగా ముస్తాబైంది. క్లీవేజ్‌ అందాలతో హోయలు పోయింది. నెట్టింట అందాల పోత పోసింది. లేటెస్ట్ గా ఓ ఈవెంట్‌లో ఈ భామ సందడి చేసింది. ఈ సందర్భంగా దిగిన తమన్నా ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

28

తమన్నా ఆదివారం రాత్రి సంతోషం మేగజీన్‌ అందించే అవార్డు ఫంక్షన్‌లో పాల్గొంది. ట్రెండీ వేర్‌లో చాలా అందంగా ముస్తాబై హోయలు పోయింది తమన్నా. ఈ అవార్డు ఫంక్షన్‌కే గ్లామర్‌ తీసుకొచ్చింది. ఇందులో ఏకంగా ఆమె చిరంజీవి చేతుల మీదుగా అవార్డుని అందుకుంది. తమన్నా.. `ఎఫ్‌2` చిత్రానికిగానూ ఉత్తమ నటిగా సంతోషం అవార్డుని అందుకుంది. 
 

38

ఈ సందర్భంగా తమన్నా సంతోషం వ్యక్తం చేసింది. చిరు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. చాలా గర్వంగా ఉందని పేర్కొంది. అంతేకాదు ఈ సందర్భంగా సంతోషం మేగజీన్‌ అధినేత సురేష్‌ కొండేటికి ధన్యవాదాలు తెలిపింది తమన్నా. 
 

48

ఇక ఈ సందర్భంగా తమన్నా ఫోటోలకు అదిరిపోయే పోజులిచ్చింది. అవార్డు అందుకున్న సందర్భంగా రెచ్చిపోయి పోజులుచ్చింది. దీంతో తమన్నా అందాలను అంతే గ్లామరస్‌గా బంధించాయి కెమెరా కన్నులు. దీంతో సోషల్‌ మీడియాలో తమన్నా పిక్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 

58

తమన్నా ఇటీవల `మాస్టర్‌ చెఫ్‌` తెలుగు షోకి వ్యాఖ్యాతగా చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ వంటల ప్రోగ్రామ్‌ కి పెద్దగా రేటింగ్‌ రాకపోవడంతో ఆమె స్థానంలో అనసూయని పెట్టారు. అయినా ఆ షోకి ఆశించిన స్థాయిలో రేంటింగ్‌ రావడం లేదనే టాక్‌ వినిపిస్తుంది. 

68

తమన్నా హీరోయిన్‌గా వెండితెరపై ఎంత మ్యాజిక్‌ చేసిన టీవీ షోలో మాత్రం సక్సెస్‌ కాలేదనే టాక్‌ రావడం విచారకరం. స్పెషల్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా అడ్రస్‌గా నిలిచే తమన్నా ఇప్పుడు హీరోయిన్‌గా సెలక్లీవ్‌గా వెళ్తుంది. కేవలం గ్లామర్‌ పాత్రలే కాదు, అందులో తన పాత్రకి ప్రయారిటీ ఉండేలా చేసుకుంటుంది. 

78

చిరంజీవితో కలిసి నటించిన `సైరా`లో లక్ష్మీగా తమన్నా పాత్రకి మంచి ప్రశంసలు దక్కాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన నటనని ప్రదర్శించిందని క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు రావడం విశేషం. ఇప్పుడు మరోసారి ఈ జోడీ వెండితెరపై మ్యాజిక్‌ చేయబోతుంది.

88

చిరంజీవి సరసన మరోసారి నటిస్తుంది తమన్నా. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `భోళాశంకర్‌` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఇందులో తమన్నాపాల్గొని సందడి చేసింది. మరోవైపు ఇటీవల `మ్యాస్ట్రో` చిత్రంలో నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అబ్బురపరిచింది. ఇందులో హత్యలు కూడా చేయడం విశేషం. నెగటివ్‌ షేడ్‌లో అబ్బురపరిచే నటనతో కనువిందు చేసింది. ప్రస్తుతం తమన్నా `ఎఫ్‌3`, `గుర్తుందా శీతాకాలం` చిత్రాల్లో నటిస్తుంది. హిందీలో `ప్లాన్‌ ఏ ప్లాన్‌ బి`, `బోల్‌ చుడియా` చిత్రాల్లో నటిస్తుంది.

also read: Shivani Rajashekar: డిప్రెషన్‌ గురించి ఓపెన్‌ అయిన రాజశేఖర్‌ తనయ.. బ్యాడ్‌ డేస్‌ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories