ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన `రాధేశ్యామ్` చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ `ఈ రాతలే.. ` సోమవారం విడుదలైంది. ఊరించి ఊరించి ఎట్టకేలకు పాటని నైట్ తొమ్మిది తర్వాత విడుదల చేశారు. ప్రస్తుతం పాట ప్రభాస్ అభిమానులతోపాటు సాధారణ ఆడియెన్స్ కి కూడా కనెక్ట్ అవుతుంది. వైరల్ అవుతుంది. అయితే ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు ఇందులో కనిపిస్తుండటం విశేషం. ఈ పాటలోనే `రాధేశ్యామ్` కథ మొత్తం చెప్పినట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు `మగధీర` చిత్రానికి, ఈ సినిమాకి సంబంధం ఉందనే సంకేతాలనిస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ పాటలో కనిపిస్తున్నాయి.
తాజాగా విడుదలైన `ఈ రాతలే` పాటలో సినిమా మొత్తం కథని చెప్పాడు దర్శకుడు రాధాకృష్ణ. ఇది పునర్జన్మల కథ అనే విషయం స్పష్టమవుతుంది. అంతేకాదు ఈ సినిమా సైన్స్ కి, ఆస్ట్రాలజీకి మధ్య కాన్ఫ్టిక్ట్ ని తెలియజేస్తుందనే విషయం అర్థమవుతుంది. అందులో భాగంగా పాటలో స్టెథస్కోప్‌ని, మిర్రర్‌లను చూపించారు.
అదే సమయంలో ట్రైన్ యాక్సిడెంట్ నుంచి వాళ్లు నేరుగా ఆకాశంలోకి వెళ్లిపోవడం, స్టెథస్కోప్, మిర్రర్‌లపై నుంచి సముద్రంలోకి వెళతారు. అక్కడ అరచేతిని చూపించడం విశేషం. ఇదే విషయం సైన్స్, జాతకాలకు మధ్య జరిగే సంఘర్షణని తెలియజేస్తుంది. అది సినిమాలోని హీరోహీరోయిన్ల జీవితాలను ఎలా మలుపు తిప్పిందనేది ఆసక్తిగా ఉండబోతుందని అనిపిస్తుంది.
ముఖ్యంగా సముద్రంలో అరచేతిని చూపించడం, అందులో నుంచి కారులో ప్రభాస్, పూజా హెగ్డే ప్రయాణించడం, తమ గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోవడం జరుగుతుందని తెలుస్తుంది.
మరోవైపు సినిమాలో ప్రభాస్ పామిస్ట్ విక్రమాధిత్యగా కనిపించబోతున్నట్టు ఇటీవల విడుదల ఫస్ట్ గ్లింప్స్ లో తెలిపారు. ఇప్పుడు అదే విషయం పాటలోనూ స్పష్టం చేశారు. ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుందని ముందే గమనించిన ప్రభాస్, తన ప్రియురాలు(పూజా హెగ్డే)ని తీసుకెళ్లేందుకు కారులో వస్తాడు. ఆమెని రక్షించే ప్రయత్నం చేస్తాడు
దీంతోపాటు..ఈ సినిమాకి `మగధీర`కి సంబంధం ఉందని, ఇది పునర్జన్మల స్టోరీ అని.. ట్రైన్‌లో ప్రభాస్, పూజా హెగ్గే ఒకరినొకరు చేతులు పట్టుకునే సన్నివేశం స్పష్టం చేస్తుంది. అంతేకాదు లిరిక్‌ని బట్టి వాళ్లు గత జన్మలో కలవలేకపోయారని, ఈ జన్మలో కలుస్తారనే అర్థం `ఏదో జన్మ బాధే పోదే ప్రేమై.. రాదే.. ఈ రాతలే..`, `ఈ జన్మ రాతలై..దోబూచులే`.. అనే లిరిక్ ఉండటం విశేషం. గత జన్మలో విడిపోయిన వీరిద్దరు ప్రస్తుత జన్మలో కలవబోతున్నారనే విషయాన్ని తెలిపారు.
ఇప్పటికే పునర్జన్మల ఆధారంగా చాలా కథలు మనకు వచ్చాయి. ఆ వృత్తాంతంతో వచ్చిన అన్ని కథలు సక్సెస్ అవలేదు. ఏ కథ అయితే ప్రేక్షకుడిని తనతో పాటు ట్రావెల్ చేపించగలిగిందో... అది మాత్రమే సక్సెస్ అయింది. ఉదాహరణకు మగధీర సినిమా కూడా పునర్జన్మల వృత్తాంతం పీరియాడిక్ డ్రామా నే అయినా అందులోని వైవిఆధ్యం సినిమాను బ్లాక్ బస్టర్ గా మార్చింది. ఇక్కడ కూడా పీరియాడిక్ డ్రామా, పునర్జన్మల కథ ఉన్నాయి. ఇది ఎంత మేర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనేది ఈ సినిమా విజయావకాశాలవిజయావకాశాలను డిసైడ్ చేస్తుంది.
ఒక్క పాటలోనే అనేక విషయాలను చర్చించడం, సినిమా స్టోరీని తెలియజేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. `రాధేశ్యామ్` మేకర్స్ ఆ సాహసం చేశారు. విజువల్ వండర్‌గా ఈ సినిమాని తీర్చిదిద్దారనే విషయాన్ని కూడా ఈ పాటతోనే క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కథని ఎంత ఆసక్తికరంగా, ఎంత ఎంగేజింగ్‌గా, ఎంతటి కొత్తదనంతో కూడా స్క్రీన్‌ప్లేతో, ఆడియెన్స్ ని ఎంగేజ్ చేసేలా ఎలా చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఎందుకంటే `మగధీర` చిత్రంతో పీరియడ్ టైమ్‌ని, ప్రస్తుత కాలానికి పర్‌ఫెక్ట్ గా మ్యాచ్ చేశాడు రాజమౌళి. మరో అనుమానం లేకుండా జనాలకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పి ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాశాడు. మరి `రాధేశ్యామ్` దర్శకుడు రాధాకృష్ణ.. ఈ కథని ఎంత కన్విన్సింగ్‌గా చెప్పబోతున్నాడనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. సినిమా ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే మ జనవరి 14 వరకు ఆగాల్సిందే.