Published : Sep 20, 2025, 10:01 AM ISTUpdated : Sep 20, 2025, 10:05 AM IST
హీరో శర్వానంద్ వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. శర్వానంద్, అతని భార్య రక్షిత రెడ్డి ప్రస్తుతం వేర్వేరుగా ఉంటున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
టాలీవుడ్ ప్రముఖ హీరో శర్వానంద్ గురించి సంచలన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రొఫెషనల్ గా శర్వానంద్ ఎప్పుడూ ఎలాంటి వివాదంలో చిక్కుకోలేదు. తనపని తాను చేసుకుని వెళ్లే మెంటాలిటీ. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు శర్వానంద్ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. శర్వానంద్, అతని భార్య రక్షిత రెడ్డి విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
25
శర్వానంద్ దంపతులు విడిపోతున్నారా ?
ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ప్రస్తుతం శర్వానంద్, రక్షిత రెడ్డి దూరంగా ఎవరి ఫ్యామిలీలతో వాళ్ళు ఉంటున్నారట. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు తెలెత్తినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరికీ విడాకుల ఆలోచన లేదని తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
35
తిరిగి కలిపేందుకు ప్రయత్నాలు
శర్వానంద్ తన తల్లిదండ్రులతో.. రక్షిత రెడ్డి తన తల్లిదండ్రులతో ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. కూతురు మాత్రం ఇద్దరి దగ్గర ఉంటోందట. దంపతుల మధ్య తలెత్తిన విభేదాలని పరిష్కరించేందుకు ఇరువురి కుటుంబ సభ్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. జంటని తిరిగి కలిపేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతా మంచిగా జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
శర్వానంద్ దంపతులు విడిపోతున్నారు అనే వార్త అభిమానులని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2023లో శర్వానంద్, రక్షిత రెడ్డి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. టాలీవుడ్ అత్యంత ధనిక కుటుంబాలకి చెందిన హీరోల్లో శర్వా ఒకరు.
55
రక్షిత రెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్
ఇక రక్షిత రెడ్డి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కూడా బాగానే ఉంది. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి హైకోర్టు లాయర్. ఆమె దివంగత రాజకీయ నేత బొజ్జల గోపాల కృష్ణారెడ్డికి మనవరాలు కూడా. శర్వానంద్, రక్షిత వివాహం జైపూర్ లో గ్రాండ్ గా జరిగింది. రాంచరణ్ లాంటి సెలెబ్రిటీలు కూడా అతిథులుగా హాజరయ్యారు. ఇండస్ట్రీలో శర్వానంద్ కి రాంచరణ్ బెస్ట్ ఫ్రెండ్.