పవన్ కళ్యాణ్ కు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ , తెలంగాణలో పెరిగిన ఓజీ సినిమా టికెట్ రేట్లు

Published : Sep 20, 2025, 08:16 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలంగాణ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అందింది. రిలీజ్ కు రెడీగా ఉన్న ఓజీ సినిమా సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఇంతకీ టికెట్ రేట్స్ ఎంత పెరిగాయంటే? 

PREV
14
పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ (OG) సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, సినిమా టికెట్ ధరల పెంపు కోసం సినిమా యూనిట్ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది.

24
తెలంగాణాలో ఓజీ టికెట్ రేట్స్

తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఓజీ సినిమా బెనిఫిట్ షోను సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక ప్రదర్శన టికెట్ ధరను రూ.800గా నిర్ణయించింది.ఇంతేకాదు, సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 4 వరకు, సాధారణ ప్రదర్శనల టికెట్ ధరల్లో కూడా మార్పులు తీసుకువచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం: సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర 100 రూపాయలు కాగా, మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ ధర 150 గా నిర్ణయించారు.

34
తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్

ఈ నిర్ణయంతో OG మూవీ టీమ్ Telangana ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ టికెట్ ధరల పెంపును సానుకూలంగా స్వాగతిస్తున్నారు. గత కొంతకాలంగా OG సినిమాపై భారీ స్థాయిలో హైప్ నెలకొని ఉండటంతో, ఈ నిర్ణయం మాస్, క్లాస్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింతగా పెంచనుంది. కాని ఓ వర్గం ప్రేక్షకులకు ఇది మోయలేని భారమనే చెప్పాలి. ఈ సందర్భంగా OG మూవీ టీం ప్రభుత్వ సహకారాన్ని అభినందిస్తూ, బెనిఫిట్ షోలు విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. టికెట్ ధరలు పెరగడం వల్ల తొలిరోజు కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

44
ఓజీ పై భారీగా అంచనాలు

సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఓజీ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, మ్యూజిక్ వీడియోస్ అన్నీ OG పై ఆసక్తిని మరింతగా పెంచాయి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఎంతో కీలకం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే పవర్ స్టార్ రేంజ్ మరో రేంజ్ కు వెళ్తుందంటున్నారు ఫ్యాన్స్. అయితే, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలపై అభిమానుల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా హౌస్‌ఫుల్ షోలు నమోదు కావడం ఖాయమని అంచనా.

Read more Photos on
click me!

Recommended Stories