రీతూ చౌదరీ వాళ్లతో ఉండటానికి బిగ్‌ బాస్‌కి వచ్చిందా? పెద్ద షాకిచ్చిన లేడీ కంటెస్టెంట్‌, రాము కూడా ఝలక్‌ ఇచ్చాడా?

Published : Sep 19, 2025, 11:57 PM IST

శుక్రవారం బిగ్‌ బాస్‌ ఎపిసోడ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఇందులో రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయెల్‌ హైలైట్‌ అయ్యారు. రాము హోనర్‌ అయిపోయాడు 

PREV
16
బిగ్‌ బాస్‌ హౌజ్‌లో కన్నీళ్ల పర్వం

బిగ్‌ బాస్‌ తెలుగు 9.. 12వ రోజు ఎపిసోడ్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. అదే సమయంలో పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి.ప్రారంభంలో కంటెస్టెంట్లు ఇతరుల గురించి గాసిప్పులతో స్టార్ట్ చేశారు. అయితే ఇమ్మాన్యుయెల్‌ గేమ్‌ విషయంలో కన్నీళ్లు పెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. నా కోసం ఏడవలేదని ఆయన చెప్పడం విశేషం. ఇద్దరు కలిసి ఎటాక్‌ చేస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌ చెప్పాడు. మరోవైపు రీతూ చౌదరీ కూడా ఏడుస్తూ కనిపించింది. హౌజ్‌లో ఈ కన్నీళ్ల పర్వాలు ఎక్కువైపోయాయి. అనంతరం హోనర్‌ అయ్యే అవకాశం కల్పిస్తూ బిగ్‌ బాస్‌ ఒక టాస్క్ ఇచ్చారు. ఇందులో టెనెంట్స్ ఇందులో పాల్గొనాల్సి ఉంది.

26
ఓనర్‌ అయిన రాము రాథోడ్‌

ఈ టాస్క్ లో మొదటి రౌండ్‌లో ఫ్లోరా ఎలిమినేట్‌ కాగా, సంజనా స్వతహాగా తప్పుకుంది. రెండో రౌండ్‌లో సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌ అయ్యాడు. మూడో రౌండ్‌లో రీతూ చౌదరీ, నాల్గో రౌండ్‌లో తనూజ ఎలిమినేట్‌ అయ్యింది. అయితే ఈ ప్రాసెస్‌లో చాలా పెద్ద పోరాటాలే జరిగాయి. తనూజ, రీతూ చౌదరీలు చేసిన పోరాటం మామూలు కాదు. ఇమ్మాన్యుయెల్‌ కూడా బాగానే పోరాడాడు. రాము రాథోడ్‌ చాలా వరకు సైలెంట్‌గానే తన గేమ్‌ ఆడాడు. కానీ ఈ గేమ్‌లో అంతిమంగా అతనే విన్నర్‌. ఇమ్మాన్యుయెల్‌, రాములు మిలగగా, ఈ టాస్క్ లో పాల్గొన్నవారు ఓనర్‌ అయ్యే అవకాశం ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవాలని బిగ్‌ బాస్‌ చెప్పగా, దీనిపై చాలా డిస్కషన్‌ జరిగింది. మొదట ఇమ్మాన్యుయెల్‌ అనుకున్నారు. కానీ ఫ్లేట్‌ పిరాయించి రాముని ఫైనల్‌ చేశారు. దీంతో రాము ఓనర్‌ అయ్యాడు

36
కన్నీళ్లు పెట్టుకున్న రీతూ

ఇదిలా ఉంటే ఇందులో పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. టాస్క్ లో భాగంగా రీతూ చౌదరీ వద్ద ఉన్న వస్తువులు ఇతర కంటెస్టెంట్లు తీసుకున్నారు. సుమన్‌ శెట్టి, ఇమ్మాన్యుయెల్‌ కూడా తీసుకున్నారు. సంజనా, ఫ్లోరా ఆమెతో ఫైట్‌ చేశారు. ఈ క్రమంలో రీతూ అన్నా తీసుకోవద్దన్నా అంటూ అరవడం, ఎమోషనల్‌ అవ్వడం, కన్నీళ్లు పెట్టుకోవడం నిజంగానే బాధగా అనిపించింది. అనంతరం రౌండ్‌లో రీతూ చౌదరీ, తనూజ గట్టిగా ఫైట్‌ చేసుకున్నారు.

46
తనూజ ఆవేదన

ఇక తనపై కుట్ర చేశారని చెప్పి తనూజ ఆవేదన వ్యక్తం చేసింది. అక్కా అక్కా అని చెప్పి మోసం చేశారని, సమయానికి ఎవరూ హెల్ప్ చేయలేదని తెలిపింది. ఇకపై ఎవరూ అక్కా అని పిలవొద్దని తేల్చి చెప్పింది. ఇకపై సెంటిమెంట్లు నడవవని స్పష్టం చేసింది. డబుల్‌ గేమ్‌, డబుల్‌ ఫేస్‌లు వద్దు అని చెప్పింది.

56
రీతూ నాకే ఎసరు పెట్టింది

ఇందులో కొత్తగా హోనర్‌ అయిన రాము రాథోడ్‌ గురించి ప్రియా ఆసక్తికర విషయం చెప్పింది. గేమ్‌ మొత్తంలో సైలెంట్‌గా ఉన్నావ్‌, ఎవరు ఏమన్నా స్పందించలేదు. చివరికి ఆ సైలెంట్ తోనే హోనర్‌ అయిపోయావని ప్రశంసించింది. ఈ సందర్భంగా రీతూ చౌదరీ విషయంలో పెద్ద బాంబ్‌ పేల్చాడు రాము. ఇద్దరం కలిసి ఆడుదామని చెప్పింది, చివరికి నాకే ఎసరు పెట్టిందని రాము రాథోడ్‌ కామెంట్‌ చేయడం విశేషం. ఇలా ఒక్కో సందర్భంలో ఒక్కోక్కరు తమ నిజ స్వరూపాలను బయటపెట్టారు. ఇంతటితో ఎపిసోడ్‌ ముగిసింది.

66
రీతూ లవ్‌ ట్రాక్‌లు రక్తికట్టించాయి.

అయితే ఎక్స్ ట్రా కట్‌లో ప్రోమోలో షాకింగ్‌ విషయాలు రివీల్‌ అయ్యాయి. రీతూ చౌదరీపై దమ్ము శ్రీజ షాకింగ్‌ కామెంట్‌ చేసింది. ఇందులో రీతూ, కళ్యాణ్‌, డీమాన్‌ పవన్‌లతో సరదాగా కనిపించింది. వీరి ముగ్గురు మధ్య పులిహోర వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇది చూసిన దమ్ము శ్రీజ.. ఆమె గేమ్ లు ఆడటానికి వచ్చిందా? వాళ్లతో ఉండటానికి వచ్చిందా అంటూ ప్రశ్నిచింది. ఇంకోవైపు రీతూ గురించి ఇమ్మాన్యుయెల్‌ మరో షాకింగ్‌ విషయం చెప్పాడు. రీతూచౌదరీ రాముని తన కంట్రోల్‌లోకి తీసుకుందని, అతన్ని డామినేట్‌ చేస్తుందని, అందుకే ఆమె కోసం త్యాగం చేసుకున్నాడు. వాడిని ఇలా నిల్చునేలా చేసింది. రీతూ క్షమించలేదని, ఆమెని తాను ఫ్రెండ్‌ అని అనుకోవడం లేదని తెలిపాడు ఇమ్ము.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories