ఒకవైపు చిరు మరోవైపు రజినీ.. సౌందర్య దెబ్బకు హీరోయిన్ల జోలికి వెళ్ళకూడదు అని డిసైడ్ అయిన నటుడు ఎవరో తెలుసా ?

Published : Feb 01, 2026, 01:41 PM IST

సౌందర్య దెబ్బకు ప్రముఖ నటుడు ఒకరు హీరోయిన్ల జోలికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారు. సౌందర్య కారణంగా గతంలో తనకి చేదు అనుభవం ఎదురైంది అని ఆ నటుడు తెలిపారు. 

PREV
15
అగ్ర హీరోలతో సౌందర్య సినిమాలు 

అభినవ సావిత్రిగా పేరుగాంచిన సౌందర్య దక్షణాది సినిమాలో వెలుగు వెలిగారు. బాలీవుడ్ లో సైతం సౌందర్య రాణించారు. సౌత్ లో రజినీకాంత్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి అగ్ర నటులతో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఒక దశలో సౌందర్యకి స్టార్ హీరోల సినిమాలకు డేట్లు అడ్జెస్ట్ చేయడం కూడా కష్టం అయ్యేది. అతిగా గ్లామర్ ప్రదర్శించకుండా టాప్ పొజిషన్ కి చేరుకున్న అతికొద్దిమంది నటీమణుల్లో సౌందర్య ఒకరు. 

25
రాజా రవీంద్ర ఆ పని కూడా.. 

 ప్రముఖ నటుడు రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజా రవీంద్ర నటుడిగా మాత్రమే కాకుండా నటీనటులకు మేనేజర్ గా కూడా వ్యవహరిస్తుంటారు. వారి డేట్లు, కాల్షీట్స్ లాంటివి మేనేజ్ చేస్తుంటారు. 

35
సౌందర్య ఎంత బిజీ అంటే.. 

 గతంలో సౌందర్య కాల్షీట్స్ కూడా రాజా రవీంద్ర మేనేజ్ చేశారట. సౌందర్య క్రేజ్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనని రాజా రవీంద్ర గుర్తు చేసుకున్నారు. రాజా రవీంద్ర మాట్లాడుతూ.. సౌందర్య దాదాపుగా ఒకే టైంలో రజినీకాంత్ నరసింహ, చిరంజీవి అన్నయ్య, అమితాబ్ బచ్చన్ సూర్యవంశం చిత్రాల్లో నటిస్తున్నారు. మూడు సినిమాల షూటింగ్స్ కోసం సౌందర్య పరుగులు తీసేవారు. 

45
సౌందర్య వల్ల మాటలు పడ్డాను 

ఒకసారి ఫ్లైట్ ఆలస్యం కావడంతో రజినీకాంత్ నరసింహా షూటింగ్ కి చేరుకోలేకపోయారు. సౌందర్య ఒక్కరి వల్ల షూటింగ్ ఆరోజు క్యాన్సిల్ అయింది. ఆమె కాల్ షీట్స్ నేను మేనేజ్ చేస్తుండడంతో దర్శకుడు, నిర్మాత నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. అప్పటి నుంచి ఎవరు కాల్ షీట్స్ అయినా మేనేజ్ చేయొచ్చు కానీ హీరోయిన్ల జోలికి మాత్రం పోకూడదు అని నిర్ణయించుకున్నా.

55
హీరోయిన్ల జోలికి పోకూడదు అనుకున్నా 

హీరోలు ఆ సమయంలో ఒకటి లేదా 2 సినిమాల్లో నటిస్తూ ఉండొచ్చు. కానీ హీరోయిన్లకు అలా కాదు. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాళ్ళ డేట్లు అడ్జెస్ట్ చేయడం అంత సులువు కాదు అని రాజా రవీంద్ర అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories