Adavi Ramudu Review : 50 ఏళ్ల క్రితం.. 300 రోజులు ఆడి, 3 కోట్లకు పైగా వసూలు చేసిన ఎన్టీఆర్ సినిమా..

Published : Feb 01, 2026, 12:44 PM IST

Adavi Ramudu Review : పౌరాణిక సినిమాలే కాదు.. జానపద, సాంఘిక చిత్రాలతో కూడా విజయం సాధించి, జనం చేత జేజేలు కొట్టించుకున్న నటుడు నటరత్న ఎన్టీ రామారావు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు రికార్డులు క్రియేట్ చేశాయి. అందులో అడవి రాముడు కూడా ఒకటి. 

PREV
16
పౌరాణికాలు మాత్రమే కాదు..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నిలబెట్టిన మొదటి తరం హీరో నటరత్న ఎన్టీఆర్‌. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు సినిమా దశ దిశని మార్చిన నటుడు ఎన్టీ రామారావు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలతో టాలీవుడ్ కే వన్నెతెచ్చిన నటుడు ఆయన.

 ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ.. అసాధ్యాలను సుసాధ్యం చేసి.. ఎన్నో అద్భుతమైన పాత్రలకు జీవం పోసిన ఎన్టీఆర్.. తన నటనతో ఆడియెన్స్ చేత జేజేలు కొట్టించుకున్నాడు. రాముడిగా, కృష్ణుడిగా, రావణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా, శివుడిగా, బ్రమ్మంగారిలా ఇలా ఎవరూ చేయనన్ని పౌరాణిక పాత్రలు చేసిన ఆయన.. ప్రజలచేత దేవుడిలా కొలవబడ్డాడు.

26
కమర్షియల్‌ చిత్రాలతో

పౌరాణికాలతో దుమ్మురేపుతూనే.. అదే సమయంలో కమర్షియల్‌ చిత్రాలతోనూ అదరగొట్టాడు ఎన్టీఆర్. `అడవిరాముడు`, `వేటగాడు` వంటి చిత్రాలతో బాక్సాఫీసు షేక్ చేసిపడేశాడు.. ఎన్టీఆర్ మాస్ సినిమాలతో అదరగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అభిమానులకు పూనకాలు తెప్పించిన సినిమాల్లో అడవి రాముడు ఒకటి. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. 50 ఏళ్ల క్రితమే అడవి రాముడు బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసింది.. థియేటర్లను షేక్ చేసింది.

36
అడవి రాముడు కథ విషయానికి వస్తే..

అటవీ ప్రాతంలో ధర్మరాజు అనే వ్యక్తి (నాగభూషణం), కొడుకు నాగరాజు( సత్యనారాయణ)తో కలిసి కలప స్మగ్లింగు, అక్రమ జంతు రవాణా వంటి వ్యాపారాలు చేస్తూ అక్కడి ప్రజల్ని దోపిడీ చేస్తుంటాడు. రాము (రాముడు, ఎన్.టి.ఆర్) ప్రజల పక్షాన నాగభూషణాన్ని ఎదుర్కుంటాడు. అక్కడి ప్రజలలో చైతన్యం కల్పిస్తాడు. తెస్తాడు. అటవీ శాఖాధికారి కూతురు పద్మ ( జయప్రద) అతన్ని ప్రేమిస్తుంది. అక్కడి గూడెంలో ఉండే యువతి చిలకమ్మ (జయసుధ) రామూను అన్నగా అభిమానిస్తూ.. ప్రేమిస్తుంది. 

కానీ వీరిద్దరిని మొదట అపార్ధం చేసుకున్న జయప్రద తర్వాత నిజం తెలుసుకుంటుంది. రాము అడవిలో ఉంటే తమకు ఇబ్బంది అని నాగభూషణం బృందం రామును అడవి నుంచి బయటకు పంపించేయాలని ప్లాన్ చేస్తారు. గూడెంలో ఉన్న జగ్గు (శ్రీధర్) ను అందుకోసం వాడుకుంటారు. 

అయితే రాము అక్కడి విషయాలు తెలుసుకోవడానికి మామూలు వ్యక్తిగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసరని వారెవరికి తెలియదు. ఆతరువాత రాము ఫ్లాష్ బ్యాక్ రివిల్ అవుతుంది. అసలు రాము కి వారికి ఉన్న సంబంధం ఏంటి? విలన్ల ఆట ఎలా కట్టించాడు అనేది చాలా ఇంట్రెస్టింగా ఉంటుంది.

46
అడవి రాముడు సినిమా రివ్యూ..

కన్నడలో రాజ్ కుమార్ నటంచిన గంధద గుడి సినిమా సోల్ నుంచి పుట్టుకొచ్చింది ఈ అడవి రాముడు సినిమా. కానీ హీరో పాత్రకు సబంధించి చాలా వరకూ మార్పులు చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. అప్పటి వరకూ తెలుగు పరిశ్రమలో రామారావు కు ఉన్న ఇమేజ్ ను కంప్లీట్ గా మారుస్త.. కొత్త ఎన్టీఆర్ ను ఈసినిమా ద్వారా చూపించారు. ఆయన యాటిట్యూడ్, డ్రెస్సింగ్ స్టైల్ కంప్లీట్ గా మారిపోయింది అడవి రాముడు సినిమాతో. 

ఈసినిమాలో హీరో సన్నివేశాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఆహార్యం, దుస్తులు మార్పులు చేసి రాఘవేంద్రరావు కొత్త రామారావును చూపించారు. రామారావు ఇంట్రడక్షన్ నుండి హీరోయిజం అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. అయితే ఈసినిమాలో హీరో సన్నివేశాలు కొన్ని హిందీ చిత్రం షోలే నుంచి తీసుకున్నట్టు తెలుస్తోంది. 

రోహిణిని విలన్లు చంపడం, రామును గూడెం నుండి వెళ్ళిపొమ్మని శ్రీధర్ బెదిరించే సన్నివేశం, కాకరాల రామారావును అక్కడే ఉండమనడం, జయప్రద రాము కోసం గుడిలో ప్రార్థించడం, జయసుధ వెనకనుండి మాట్లాడటం, జయసుధ, జయప్రదలను గుర్రపు బండిమీద సత్యనారాయణ వెంటాడటం ఈసన్నివేశాలన్నీ సనిమాకు హైలెట్ అయ్యాయి. అయితే ఇవి షోలే మూవీ నుంచి తీసుకున్నట్టు తెలుస్తోంది.

56
ఎవర్ గ్రీన్ పాటలు

అడవి రాముడు సినిమాను అద్భుతంగా డైరెక్ట్ చేశాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. నందమూరి అభిమానులక కావల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉండేలా చూసుకున్నాడు. ఎన్టీఆర్ ఇమేజ్ ను సరికొత్త మలుపుతీసుకునేలా చేశారు. ఇక ఈ సినిమాకు పాటలు ప్రాణం పోశాయి. వేటూరి రాసిన అన్ని పాటలకు.. మహదేవన్ ట్యూన్స్ అద్భుతంగా పనిచేశాయి. 

ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ.. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, కుకుకు కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరి, అమ్మతోడూ అబ్బతోడూ నీ తోడూ నాతోడూ లాంటి పాటలు ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచాయి. ఈసినిమా నందమూరి అభిమానులకే కాదు.. అన్ని వర్గాల ఆడియన్స్ మనసుదోచింది. అడవిరాముడు సినిమా చూసి..అప్పటి యువత ఉర్రూతలూగిపోయింది.

66
అడవి రాముడు`తో ఎన్టీఆర్‌ సరికొత్త రికార్డులు

ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే `అడవి రాముడు`(1977) ఒక సంచలనం. ఈ మూవీ ఇండస్ట్రీని షేక్‌ చేసింది. అత్యధిక రోజులు ప్రదర్శించిన మూవీగా నిలిచింది. అదే సమయంలో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగానూ నిలిచింది. అడవి రాముడు సినిమాకు అప్పటి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. 50 ఏళ్ల క్రితమే.. దాదాపు 300 రోజులకు పైగా థియేటర్లలో నడిచి.. మూడు కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డుకెక్కింది.

 మళ్లీ ఈ సినిమా రికార్డును రామారావే బ్రేక్ చేశారు. వేటగాడు సినిమాతో అడవి రాముడు రికార్డ్ బ్రేక్ అయ్యింది. సినిమాస్కోప్ లో ఎన్టీఆర్ మొదటి కలర్ సినిమా అడవి రాముడు. మొదటి సారిగా జపాన్ టెక్నాలజీని వాడింది కూడా ఈసినిమా కోసమే.

 అంతే కాదు . 50 రోజుల్లో 83 లక్షలు, 67 రోజులకే 1 కోటి కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా ఇది రికార్డుకెక్కింది. తెలుగులో 3 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా రికార్డు కూడా అడవి రాముడి పేరుమీదే ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories