Ram Charan Upasana: చిరు, చెర్రీల‌ను మించిన ఆస్తులు.. ఉపాస‌న నెట్‌వ‌ర్త్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Published : Feb 01, 2026, 12:27 PM IST

Ram Charan Upasana: రామ్‌చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తులు మ‌రోసారి త‌ల్లిదండ్రులైన విష‌యం తెలిసిందే. శ‌నివారం ఉపాస‌న క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ నేప‌థ్యంలో ఉపాస‌న ఆస్తులకు సంబంధించి మ‌రోసారి సోష‌ల్ మీడియాలో చ‌ర్చ నడుస్తోంది. 

PREV
15
మెగా కుటుంబంలో డబుల్ సెలబ్రేషన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట మరోసారి పండుగ వాతావరణం నెలకొంది. శనివారం ఉపాసన ఒక పాప, ఒక బాబుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కుమార్తె క్లింకారతో తల్లిదండ్రులుగా ఉన్న ఈ జంట ఇప్పుడు ముగ్గురు పిల్లలతో కుటుంబ జీవితం మరింత ఆనందంగా మారింది. ఈ శుభవార్తతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

25
రామ్‌చ‌ర‌ణ్ భార్య‌గానే కాకుండా

రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా ఉపాసన కార్పొరేట్ రంగంలో తనకంటూ ఓ బలమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అపోలో హాస్పిటల్స్‌లో CSR వైస్ చైర్‌పర్స‌న్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థను ఆమె తాత డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి స్థాపించారు. ఆరోగ్యం, సేవా కార్యక్రమాల్లో ఉపాసన కీలక పాత్ర పోషిస్తున్నారు.

35
రూ.77,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలు

ఇటీవల కమియా జానీ నిర్వహించే Curly Tales షోలో ఉపాసన సంపద గురించి ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఉపాసన, రామ్ చరణ్, చిరంజీవి కంటే ఎక్కువ సంపన్నురాలిగా గుర్తింపు పొందారు. ఆమె కుటుంబ వ్యాపార విలువ సుమారు రూ.77,000 కోట్లుగా అంచనా. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీశాయి.

45
వ్యాపారంలో స్వంత ప్రయాణం

చదువు పూర్తయ్యాక ఉపాసన కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తల్లి శోభన కామినేని ప్రేరణతో ముందుకు సాగారు. ప్రస్తుతం ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ టీపీఏ (FHPL) మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతేకాదు UR.Life పేరుతో హెల్త్, వెల్‌నెస్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించారు. సేవా రంగంలో చేసిన కృషికి దాదాసాహెబ్ ఫాల్కే ఫిలాంత్రపిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, Forbes Tycoon of Tomorrow గుర్తింపు లభించింది.

55
సంపదపై ఉపాసన స్పష్టమైన మాటలు

తాను ధనిక కుటుంబంలో పుట్టినప్పటికీ సంపద సులభంగా లభించలేదని ఉపాసన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వ్యాపారాన్ని అర్థం చేసుకుని, నైపుణ్యాలు పెంచుకుని ముందుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. ప్రతి మీటింగ్‌కు పూర్తి సిద్ధతతో వెళ్లడమే తన ఆత్మవిశ్వాసానికి కారణమని చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories