'7G బృందావన కాలనీ 2' అనేది సెల్వరాఘవన్ శైలి కథాకథనాలు, బలమైన భావోద్వేగాలతో రూపొందుతోన్న హృదయాలను హత్తుకునే ఓ విభిన్న ప్రేమ కథా చిత్రం. ఇది ప్రేక్షకులను ఎప్పటికీ మరచిపోలేని సరికొత్త అనుభూతిని అందించనుంది. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ చిత్రీకరణ తుది దశకు చేరుకుందని నూతన సంవత్సరం సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది.
లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటుంది. సిటీలో దగదగ మెరిసే బిల్డింగ్స్ మధ్యలో జంట నడుచుకుంటూ వెళ్తుండగా, అర్థరాత్రి భవనాల వెలుగులు, ఆకాశంలో నక్షత్రాల వెలుగులు ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. నేటి ట్రెండీ లవ్ స్టోరీగా ఈ మూవీ రాబోతుందనే విషయాన్ని ఈ పోస్టర్ చెప్పకనే చెబుతుంది.