సాయిపల్లవి కొత్త ఏడాది పూజలు, భక్తుల మధ్య కూర్చొని మామూలు అమ్మాయిగా మారిన వైనం, ఎక్కడో తెలుసా?

First Published | Jan 1, 2025, 3:15 PM IST

సాయిపల్లవి కొత్త ఏడాది సందర్భంగా భక్తిశ్రద్ధలతో మునిగిపోయింది. సాధారణ అమ్మాయిలా మారి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి ఇంతకి సాయిపల్లవి ఏం చేసిందంటే?
 

Sai Pallavi

లేడీ పవర్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి. అద్బుతమైన నటనతో, అత్యద్భుతమైన డాన్సులతో ఆమె మెస్మరైజ్‌ చేస్తుంది. ఆడియెన్స్ ని కట్టిపడేస్తుంది. అంతే నిజాయితీగా ఉంటూ ఆకట్టుకుంటుంది. అందుకే ఆమెకి విశేషమైన ఫాలోయింగ్‌ ఉంటుంది. ఫ్యాన్‌ బేస్‌ ఉంటుంది. ఈ క్రమంలో సాయిపల్లవి క్రేజ్‌ని చూసి లేడీ పవర్‌ స్టార్‌ అంటూ ఖితాబిచ్చాడు. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. 
 

సాయిపల్లవి ఇటీవలే `అమరన్‌` సినిమాతో విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ఇండియా వైడ్‌గా దుమ్ములేపింది. భారీ వసూళ్లని రాబట్టింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో సాయిపల్లవి చేసిన మ్యాజిక్‌ అంతా ఇంతా కాదు. ఆమె వల్లనే సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందని అంటుంటారు. అంతటి సక్సెస్‌ని అందుకున్న సాయిపల్లవి ఇప్పుడు చాలా సింపుల్‌గా మారిపోయింది. తనకు ఏం తెలియదన్నట్టుగా మారిపోయింది. మామూలు అమ్మాయిగా మారిపోయింది. భక్తుల్లో ఒకరిగా మారిపోయి కనిపించింది. 

read more: మహేష్‌ బాబు, రాజమౌళి సినిమా ప్రారంభమయ్యేది అప్పుడే ? న్యూ ఇయర్‌ సర్‌ప్రైజ్‌, కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే?
 


కొత్త సంవత్సరం సందర్భంగా సాయిపల్లవి పూజా కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె అందరితో కలిసి టెంపుల్‌ని దర్శించుకుని ద్యానంలో మునిగిపోయింది. అవును కొత్త ఏడాది సందర్భంగా సాయిపల్లవి పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ధ్యానం నిర్వహించింది. అందరిలో ఒకరిగా మారిపోయి పుట్టపర్తి బాబా ఆలయంలో కొత్త ఏడాది వేడుకలు జరుపుకుంది. ఇందులో ఆమె కనిపించిన తీరు చూస్తే షాక్‌ అవ్వాల్సిందే. ఇందులో ఎరుపు రంగు లెహంగా వోణిలో కనిపిస్తుంది సాయిపల్లవి. 
 

ఇలా తాను ఎంత ఎదిగినా, సింపుల్‌గానే ఉంటుందనే దానికి ఉదాహరణగా నిలుస్తుంది. సింప్లిసిటీకి కేరాఫ్‌గా నిలుస్తుంది  సాయిపల్లవి. గతేడాది `అమరన్‌`తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న ఆమె ఈ ఏడాది మరో సినిమాతో రాబోతుంది. నాగచైతన్యతో తెలుగులో `తండేల్‌` సినిమాలో నటిస్తుంది. చందూమొండేటి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న చిత్రమిది. ప్రేమికుల రోజుని పురస్కరించుకుని ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కాబోతుంది. 

also read: శోభన్‌ బాబు భోజనంలో ప్రతిరోజూ వడ పాయిసం.. ప్రొడక్షన్‌ బాయ్‌ చేత అంత అవమానం ఫేస్‌ చేశాడా?
 

మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో ఫోర్ట్ ఏరియాలోని ఓ జాలరి కుర్రాడి జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. ఆ యువకుడి ప్రేమ,స్ట్రగుల్స్ ని ఈ మూవీలో ఆవిష్కరించబోతున్నారట. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. పాటలు అలరిస్తున్నాయి. `బుజ్జమ్మ` సాంగ్‌ విశేషంగా అలరిస్తుంది. దీంతోపాటు హిందీలో రెండు సినిమాలు చేస్తుంది సాయిపల్లవి. వాటిలో `రామాయణ్‌` కూడా ఉంది. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా నటిస్తున్నారు.  

read more: కృష్ణ సినిమాలో విలన్‌గా చేసి, తర్వాత సూపర్‌ స్టార్‌గా ఎదిగి తనకే పోటీ ఇచ్చిన హీరో ఎవరో తెలుసా?

Latest Videos

click me!