సమంత - శోభిత ధూళిపాళ ఈ ఇద్దరి పేరు ఎత్తితే.. వీరేదో శత్రువులు అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. సమంత నాగచైతన్య విడాకులు తరువాత శోభిత ధూళిపాళను ప్రేమించి పెళ్ళాడాడు నాగచైతన్య. వీరి పెళ్ళి జరిగి నెలరోజులు అవుతోంది.. సమంతో నాగచైతన్య విడాకులు తీసుకుని మూడేళ్లు పైనే అవుతోంది. అయినా సరే ఏదో ఒక రకంగా ఈ ముగ్గురు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇక సమంత - శోభిత గురించి అయితే ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవ్వాల్సిందే.
Samantha and Sobhita Dhulipala
సమంత ప్లేస్ లో శోభిత వచ్చింది కాబట్టి.. వీరిద్దరు శత్రువులు అన్నట్టుగా చూస్తున్నారు చాలామంది. కాని నిజానికి వీరిద్దరుమాత్రం అలా ఎందుకు ఫీల్ అవుతారు. అసలు వీరు మంచి స్నేహితులని బయట టాక్ ఉంది. సమంత నాగచైతన్య జీవితంలో ఉన్నప్పుడు.. శోభిత వీరిద్దరికి స్నేహితురాలట. అంతే కాదు వీరి కాంబినేషన్ లో సినిమా కూడా వచ్చిందట. కాని శోభిత జస్ట్ మీస్ అయ్యిందని అంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.
Samantha and Sobhita Dhulipala
నాగచైతన్య - సమంత పెళ్ళి తరువాత వచ్చిన సినిమా మజిలీ. ఈసినిమాలో సమంత నాగచైతన్యపై ఎంత ప్రేమ ఉందో కనిపిస్తుంది. చాలా ఎమోషనల్ గా అనిపించే ఈ మూవీలో నాగచైతన్య ముందుగా మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ పాత్రలో దివ్వాంశ కౌశిక్ నటించింది. అయితే ఈ పాత్రలో ముందుగా శోభితను తీసుకున్నారట.
Samantha and Sobhita Dhulipala
అంతే కాదు కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారట. కాని కొన్ని రోజుల షూటింగ్ తరువాత శోభిత ఈసినిమా నుంచితప్పుకున్నట్టు తెలుస్తోంది. తరువాత ఈ పాత్రకోసం దివ్యాంశ ను తీసుకున్నారట. ఈరకంగా నాగచైతన్య లైఫ్ లో ఉన్న ఇద్దరు.. రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో ఉన్నట్టు అయిపోయింది. అలా మజిలీ సినిమా ద్వారా ఇద్దరు నటించినా.. కాంబినేషన్ మూవీ మాత్రం మిస్ అయ్యింది.
Samantha and Sobhita Dhulipala
అయితే ఈ ఇద్దరు తారలు కలిసి కొన్ని యాడ్స్ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఇలా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందట. అంతే కాదు చైతూ, సమంత కలిసి ఉన్న టైమ్ లో వీరి ఇంటికి కూడా వచ్చేదట శోభిత. ఇక అలా కాలం గడిచిపోయి..సమంతతో చైతూ విడిపోవడం..ఆతరువాత శోభితతో ప్రేమలో పడటం.. పెళ్ళి చేసుకోవడం జరిగిపోయింది. ఇక ప్రస్తుతం సమంత పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టింది.
బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది టాలీవుడ్ లో ఆమె ప్రస్తుతం ఏ సినిమా చేయడంలేదు. ఆమధ్య ఏడాదిన్నరకు పైగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బ్యూటీ.. ఇప్పుడిప్పుడే యాక్టీవ్ అవుతోంది. ఇక శోభితన పెళ్ళి తరువాత సినిమాలు చేస్తుందా లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఎటువంటి అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వలేదు.