ఏ.ఆర్.రెహమాన్, ఇళయరాజా కలిసి సంగీతం అందించిన సినిమా ఏదో తెలుసా?

Published : Mar 11, 2025, 03:04 PM IST

సంగీత జ్ఞాని ఇళయరాజా, సంగీత సంచలనం ఏ.ఆర్.రెహమాన్ ఇద్దరు కలిసి  ఒకే సినిమాకి మ్యూజిక్  చేశారని మీకు తెలుసా? అసలు ఇది ఎలా సాధ్యం అయ్యింది. ఈ సినిమా వెనక ఉన్న కథేంటంటే? 

PREV
14
ఏ.ఆర్.రెహమాన్, ఇళయరాజా కలిసి సంగీతం అందించిన సినిమా ఏదో  తెలుసా?

1976లో వచ్చిన అన్నకిలి సినిమాతో ఇళయరాజా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 15 ఏళ్లు సంగీత ప్రపంచంలో తిరుగులేని రారాజుగా వెలుగొందారు. ఆయన సంగీతానికి పోటీ ఇవ్వలేక చాలామంది సంగీత దర్శకులు ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ఏ.ఆర్.రెహమాన్ అనే సంగీత సంచలనం వచ్చి మొదటి సినిమాతోనే రాజాని ఓవర్ టేక్ చేశారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన మొదటి సినిమా రోజా జాతీయ అవార్డు గెలుచుకుంది.

Also Read: 2025లో 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ 6 హీరోయిన్లు ?

24
ఏ.ఆర్.రెహమాన్, ఇళయరాజా

అప్పుడు కూడా రెహమాన్‌కు పోటీగా నిలిచింది ఇళయరాజానే. రెహమాన్ 'రోజా' సినిమాకి, ఇళయరాజా 'దేవర్ మగన్' సినిమాకి, మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆ సమయంలో ఒక ఓటు తేడాతో ఇళయరాజాని ఓడించి జాతీయ అవార్డును గెలుచుకున్నారు ఏ.ఆర్.రెహమాన్. ఆయన సంగీత దర్శకుడిగా పరిచయం కాకముందు ఇళయరాజా దగ్గర కీబోర్డు వాయించేవారు. 'పున్నగై మన్నన్'తో సహా చాలా సినిమాలకు రెహమాన్ కీబోర్డు ప్లేయర్‌గా పనిచేశారు.

Also Read:నా భర్తపైనే ఎందుకు అంత పగబట్టారు, సూర్య సినిమాలపై నెగెటీవ్ కామెంట్ విషయంలో జ్యోతిక ఆవేదన

 

34
ఒకే సినిమాకి ఏ.ఆర్.రెహమాన్, ఇళయరాజా సంగీతం

సంగీత దర్శకుడు కాకముందు ఇళయరాజా  సినిమాల్లో పనిచేసిన ఏ.ఆర్.రెహమాన్, సంగీత దర్శకుడు అయ్యాక ఇద్దరూ కలిసి ఒకే సినిమాకి సంగీతం అందించారు. విజయ్, షాలిని నటించిన కధలుక్కు మరియాదై సినిమాని మలయాళ దర్శకుడు ఫాజిల్ తెరకెక్కించారు.

ఈ సినిమా మొదట మలయాళంలో తీశారు. అక్కడ సూపర్ హిట్ అయ్యాక ' తమిళంలో కధలుక్కు మరియాదై గా రీమేక్ చేశారు. ఈ సినిమాలో ఇళయరాజా సంగీతం అందించిన పాటలన్నీ ఇప్పటికీ ఎంతో గొప్పగా చెప్పుకునే పాటలుగా ఉన్నాయి.

Also Read:సౌందర్య ని మోహన్ బాబు హత్య చేయించాడా? నేనే సాక్ష్యం అంటూ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవరు?

44
సంగీత సంచలనం, సంగీత జ్ఞాని

తమిళంలో 'కధలుక్కు మరియాదై హిట్ అవ్వడంతో ఆ సినిమాని హిందీలో రీమేక్ చేశారు. హిందీలో 'Doli Saja Ke Rakhna' పేరుతో వచ్చిన ఈ సినిమాని ప్రియదర్శన్ డైరెక్ట్ చేశారు. ఇందులో అక్షయ్ ఖన్నా హీరోగా, జ్యోతిక హీరోయిన్‌గా నటించారు.

ఈ సినిమాకి సంగీత సంచలనం ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఆయన సంగీతం అందించిన పాటలన్నీ ఊరూరా హిట్ అయ్యాయి. ఇలా ఒకే కథతో వచ్చిన సినిమాలకు ఏ.ఆర్.రెహమాన్, ఇళయరాజా సంగీతం అందించడం ఒక అరుదైన విషయంగా చెప్పుకుంటారు.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 'కధలుక్కు మరియాదై' హిందీ రీమేక్ కోసం చేసిన ట్యూన్లనే ఏ.ఆర్.రెహమాన్ తెలుగులో ప్రశాంత్ నటించిన 'జోడి' సినిమా పాటల కోసం వాడారు.

Also Read:బిగ్ బాస్ తెలుగు టీమ్ కు విజయ్ దేవరకొండ కండీషన్లు, సీజన్ 9 కోసం రౌడీహీరో రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

 

Read more Photos on
click me!

Recommended Stories