84 కోట్ల షారూఖ్ ఐటీ ట్యాక్స్ కేసు ఇల్లీగల్? , షాకింగ్ తీర్పు

Published : Mar 11, 2025, 08:11 AM IST

Shahrukh Khan: నాలుగేళ్ల పన్ను వివాదంలో షారుఖ్ ఖాన్‌కు ఐటీ ట్రిబ్యునల్  తీర్పుని ఇచ్చింది . రా-వన్ సినిమా పన్ను చెల్లింపుల విషయంలో షారుఖ్ ఖాన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. పన్ను అధికారులు కేసును సరిగా పరిశీలించలేదని ట్రిబ్యునల్ పేర్కొంది.

PREV
13
 84 కోట్ల షారూఖ్  ఐటీ ట్యాక్స్ కేసు ఇల్లీగల్? , షాకింగ్ తీర్పు
Shahrukh Khan Wins Tax Dispute as IT Tribunal Rules in His Favor in telugu


 Shahrukh Khan: నాలుగేళ్ల షారూఖ్ ఖాన్ కేసు ఓ కొలిక్కి వచ్చింది.  ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఐటీ అధికారులతో జరిగిన కేసు విషయంలో షారుఖ్ ఖాన్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఈ మేరకు తాజాగా షారూఖ్ పై పెట్టిన కేసు న్యాయ బద్దం కాదని తేల్చి చెప్పింది, అంతేకాదు ఈ కేసు విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు చురకలు సైతం అంటించింది.  కేసు వివరాల్లోకి వెళ్దాం.
 

23
Shahrukh Khan Wins Tax Dispute as IT Tribunal Rules in His Favor in telugu


గతంలో షారుఖ్ ఖాన్ రా- వణ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. అయితే సినిమా షూటింగ్ దాదాపుగా 70% శాతానికిపైగా యూకే దేశంలో జరిగింది. దీంతో ఈ సినిమాకి సంబందించిన ట్యాక్స్ వివరాలు యూకే దేశ టర్మ్స్ అండ్ కండీషన్స్ పై ఆధారపడి ఉంటాయి.

 అయితే 2011-2012 సంవత్సరానికిగానూ రూ. 83.42 కోట్లు పన్ను చెల్లిస్తున్నట్లు, అలాగే యూకేలో చెల్లించే ట్యాక్స్ విషయంలో విదేశీ క్రెడిట్స్ కోసం షారుఖ్ ఖాన్ దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఈ దరఖాస్తుని తిరస్కరించారు. అంతేకాకుండా 4 ఏళ్ళ తర్వాత ఈ ట్యాక్స్ మొత్తం రూ.84.17 కోట్లు అని, మొత్తం ట్యాక్స్ కట్టాలని షారుఖ్ ఖాన్ కి అధికారులు తెలిపారు.

33
Shahrukh Khan Wins Tax Dispute as IT Tribunal Rules in His Favor in telugu


ఈ క్రమంలో షారుఖ్ ఖాన్  ITAT(ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్) ని ఆశ్రయించాడు.  అయితే ఈ పన్ను చెల్లింపుల విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఈ కేసుని పరిశిలించారు. ఇందులోభాగంగా షారుఖ్ ఖాన్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.

అలాగే కేసు నమోదైన 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీ కరెక్షన్ చెయ్యడం సరికాదని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి చురకలంటించారు. దీంతో ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో షారుఖ్ ఖాన్ కి బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పవచ్చు. ఇక నటుడుగా  షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు దాదాపుగా రూ.1500 కోట్లు(గ్రాస్) పైగా కలెక్ట్ చేసాయి.
 

Read more Photos on
click me!

Recommended Stories