Smriti Mandhana: నంబర్ 1 వన్డే బ్యాటర్‌కు ఒక్క అడుగు దూరంలో స్మృతి మంధాన

Published : May 15, 2025, 05:10 PM IST

Smriti Mandhana: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అద్భుమైన బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిపిస్తోంది. మహిళా క్రికెట్ లో భారత జట్టుకు రన్ మెషిన్‌గా మారింది. వన్డేల్లో నంబర్ 1 బ్యాటర్‌గా నిలవడానికి ఆమె ఒక్క అడుగు దూరంలో ఉంది.  

PREV
17
Smriti Mandhana: నంబర్ 1 వన్డే బ్యాటర్‌కు ఒక్క అడుగు దూరంలో స్మృతి మంధాన

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన బ్యాట్ క్రికెట్ మైదానంలో చెలరేగుతోంది. వరుసగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశ విదేశాల్లో పరుగుల వర్షం కురిపిస్తోంది. రికార్డుల మోత మోగిస్తోంది.

27
భారత మహిాళా క్రికెట్ జట్టు రన్ మెషిన్ స్మృతి

స్మృతి మంధాన ప్రస్తుతం భారత జట్టుకు రన్ మెషిన్‌గా నిలిచింది. ఏ జట్టుపై అయినా పరుగులు చేయడంలో వెనుకాడటం లేదు. టర్నింగ్ పిచ్ అయినా, ఫ్లాట్ పిచ్ అయినా ఆమె అద్భుతమైన ఆటతీరు ముందు అన్నీ వెనుకబడిపోయాయి.

37
శ్రీలంకపై ఫైనల్లో సెంచరీ

ఇటీవల భారత్, శ్రీలంక మధ్య జరిగిన మహిళల ODI ట్రై సిరీస్ ఫైనల్లో మంధాన సెంచరీ కొట్టింది. 101 బంతుల్లో 116 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడింది. తన సెంచరీ ఇన్నింగ్స్ లో  స్మృతి మంధాన  బ్యాట్ నుండి 15 ఫోర్లు, 2 సిక్సర్లు వచ్చాయి.

47
స్మృతి మంధాన కెరీర్‌లో 11వ సెంచరీ

ఈ సెంచరీతో స్మృతి మంధాన తన వన్డే కెరీర్‌లో 11వ సెంచరీ సాధించింది. భారత మహిళా జట్టు తరపున అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్‌గా కూడా నిలిచింది. అంతేకాకుండా ప్రపంచంలోనే మూడో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన క్రీడాకారిణి స్మృతి మంధాన.

57
ఇప్పుడు నంబర్ 1 కానున్న స్మృతి మంధాన

స్టార్ ఓపెనర్ స్మృతి ఇప్పుడు నంబర్ 1 కావడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఐసీసీ మహిళల వన్డే  ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆమె రెండో స్థానంలో ఉంది. కొత్త రికార్డు సృష్టించడానికి ఇంకో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది.

67
నంబర్ 1 బ్యాటర్ ఎవరు?

ICC మహిళల ODI ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నంబర్ 1 స్థానంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్ట్ ఉంది. ఆమె 738 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. స్మృతి మంధాన 727 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉంది. స్మృతికి ఇంకా 12 రేటింగ్ పాయింట్లు అవసరం.

77
స్మృతి మంధాన ఈ ఘనత సాధిస్తుందా?

స్మృతి మంధాన నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంటుందా అనే ప్రశ్న మీ మదిలో మెదులుతుందా? అవును, అది ఖచ్చితంగా జరగవచ్చు. తదుపరి మ్యాచ్‌లో ఆమె శతకం సాధిస్తే, దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ ను వెనక్కి నెడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories