గుజరాత్ ను ముంచేసిన ఓవర్సీస్ ప్లేయర్లు
వడోదరలోని కోటంబి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్ మొదటి నుంచి ఎదురుదెబ్బలు తింటూ మ్యాచ్ ను కోల్పోయింది.
ఈ మ్యాచ్ లో గుజరాత్ ప్లేయర్లు పూర్తిగా విఫలం అయ్యారు. ఓవర్సీస్ ప్లేయర్లు పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయారు. బెత్ మూనీ 1, లారా వోల్వార్డ్ట్ 4, ఆష్లీ గార్డనర్ 10, డియాండ్రా డాటలిన్ 7 పరుగులు మాత్రమే చేశారు. దయాళన్ హేమలత, సిమ్రాన్ షేక్ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. హర్లీన్ డియోల్ 32 పరుగులు, కాశ్వీ గౌతమ్ 20 పరుగుల ఇన్నింగ్స్ తో 20 ఓవర్లలో గుజరాత్ టీమ్ అన్ని వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3 వికెట్లు తీసుకున్నారు. ఆమెతో పాటు బ్రంట్ 2, అమేలియా కెర్ 2, వికెట్లు పడగొట్టారు.