య‌శ‌స్వి జైస్వాల్ తొలి డబుల్ సెంచ‌రీ.. భార‌త 2వ ఓపెన‌ర్‌గా స‌రికొత్త రికార్డు

First Published | Feb 3, 2024, 10:52 AM IST

Yashasvi Jaiswal double century: రెండో టెస్టులో ఇంగ్లాండ్ పై టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ డ‌బుల్ సెంచ‌రీ కొట్టాడు. త‌న కెరీర్ లో తొలి డ‌బుల్ టన్ కాగా, ఇంగ్లాండ్ పై డబుల్ సెంచరీ సాధించిన రెండవ భారత ఓపెనర్‌గా చ‌రిత్ర సృష్టించాడు.
 

Yashasvi Jaiswal

India vs England -Yashasvi Jaiswal : టీమిండియా యంగ్ ప్లేయ‌ర్, స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్ లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు సెంచ‌రీ బాదిన జైస్వాల్ రెండో రోజు దానిని డ‌బుల్ సెంచ‌రీగా మ‌లిచాడు. 

జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ పై డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత ఓపెనర్ గా ఘ‌న‌త సాధించాడు. అలాగే, టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా నిలిచాడు.


ఈ టెస్టులో రెండో ఓవర్‌లో రెండు బౌండరీలు బాదిన య‌శ‌స్వి జైస్వాల్ సానుకూలంగా గేమ్ ను ప్రారంభించాడు. తొలి రోజు మార్నింగ్ సెషన్‌లో బ్యాటింగ్ వేగాన్ని తగ్గించాడు కానీ, మధ్యాహ్నం సెష‌న్ లో తన దూకుడు కొన‌సాగించాడు. 

Yashasvi Jaiswal

జైస్వాల్ బ్యాటింగ్ తో అద‌ర‌గొడుతూ శ్రేయాస్ అయ్యర్ , రజత్ పటీదార్, అక్షర్ పటేల్‌లతో కలిసి 50-ప్లస్ ప‌రుగుల భాగస్వామ్యం రికార్డ్ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 179* పరుగులతో నాటౌట్‌గా నిలిచి, రెండో రోజు తొలి సెష‌న్ లో డబుల్ సెంచ‌రీని పూర్తి చేశాడు.

య‌శ‌స్వి జైస్వాల్ 2000 నుండి ఇంగ్లండ్‌పై 150-ప్లస్ స్కోర్ చేసిన నాల్గవ భారత ఓపెనర్‌గా నిలిచాడు. జైస్వాల్ కంటే ముందు 2008 మొహాలీలో గౌతమ్ గంభీర్ (179), చెన్నై 2016లో కేఎల్ రాహుల్ (199), చెన్నైలో రోహిత్ శర్మ (161) మాత్రమే ఈ ఘనత సాధించారు.

Yashasvi Jaiswal

అలాగే, త‌న ఆరో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న య‌శ‌స్వి జైస్వాల్ 65-ప్లస్ వద్ద 600 పరుగులు దాటాడు. నాలుగు యాభై-ప్లస్ స్కోర్‌లను చేశాడు. ఇందులో సెంచ‌రీ, డ‌బుల్ సెంచ‌రీ ఉన్నాయి. 

Yashasvi Jaiswal

ఇంగ్లాండ్ పై డ‌బుల్ సెంచ‌రీ కొట్టిన రెండో భారత ఓపెన‌ర్ గా యశస్వి జైస్వాల్ రికార్డు సృష్టించాడు. అంత‌కుముందు సునీల్ గ‌వాస్క‌ర్ భార‌త ఓపెన‌ర్ గా ఇంగ్లాండ్ పై డ‌బుల్ సెంచ‌రీ కొట్టాడు.

Latest Videos

click me!