Womens World Cup 2025: ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్ కప్ కోసం భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. మొత్తం USD 13.88 మిలియన్లకు పెంచింది. ఇది మెన్స్ 2023 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువగా ఉండటం విశేషం.
మహిళల వరల్డ్ కప్ 2025 కోసం భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంక వేదికలుగా నిర్వహించే ఈ టోర్నమెంట్‌కు మొత్తం USD 13.88 మిలియన్ల (దాదాపు 122 కోట్లు) ప్రైజ్ మనీ కేటాయించింది. ఇది 2023 పురుషుల వన్డే వరల్డ్ కప్ ప్రైజ్ మనీ కంటే USD 3.88 మిలియన్లు ఎక్కువ.
DID YOU KNOW ?
మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత్
2005లో దక్షిణాఫ్రికాలో భారత్ మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేరి ఆస్ట్రేలియాతో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 2017లో ఇంగ్లాండ్‌లో మరోసారి ఫైనల్ చేరి ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది.
26
గత వరల్డ్ కప్‌లతో పోల్చితే భారీగా పెరిగి ప్రైజ్ మనీ
2022లో న్యూజిలాండ్‌లో జరిగిన మహిళల వరల్డ్ కప్‌లో మొత్తం ప్రైజ్ మనీ USD 3.5 మిలియన్లు మాత్రమే. ఇప్పుడు అది 297 శాతం పెరిగింది. విజేత జట్టు USD 4.48 మిలియన్లు పొందనుంది. ఇది 2022లో ఆస్ట్రేలియా సాధించిన USD 1.32 మిలియన్లతో పోల్చితే 239 శాతం ఎక్కువ. రన్నరప్ జట్టుకు USD 2.24 మిలియన్లు, సెమీఫైనల్ జట్లకు ఒక్కొక్కదానికి USD 1.12 మిలియన్ల ప్రైజ్ మనీ లభించనుంది.
36
ప్రతి మ్యాచ్ విజయానికి ప్రత్యేక బోనస్ ను ప్రకటించిన ఐసీసీ
ఈ టోర్నమెంట్‌లో ప్రతి జట్టు కనీసం USD 250,000 (దాదాపు రూ. 2.19 కోట్లు) అందుకుంటాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో ఒక్కో విజయం సాధించినప్పుడు USD 34,314 (దాదాపు 30.18 లక్షలు) అదనంగా అందుకుంటాయి. ఐదో, ఆరవ స్థానాల్లో టోర్నీని ముగించిన జట్లకు USD 700,000 (దాదాపు రూ. 6.15 కోట్లు) చొప్పున, ఏడో, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన జట్లకు USD 280,000 (దాదాపు రూ. 2.46 కోట్లు) చొప్పున ఇవ్వనున్నారు.
ఐసీసీ చైర్మన్ జైషా మాట్లాడుతూ.. “ఈ ప్రకటన మహిళా క్రికెట్‌లో ఒక మైలురాయి. భారీగా పెరిగిన ఈ ప్రైజ్ మనీ క్రికెట్ దీర్ఘకాల వృద్ధికి మేము చేస్తున్న పనులను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మహిళా క్రికెటర్లకు పురుషుల స్థాయిలోనే గౌరవం దక్కాలి” అని అన్నారు. అలాగే, “భవిష్యత్ తరాల ఆటగాళ్లను, అభిమానులను ప్రేరేపించే స్థాయి వరల్డ్ కప్‌ను అందించడమే మా లక్ష్యం” అని జైషా పేర్కొన్నారు.
56
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025
ఈసారి మహిళల వన్డే వరల్డ్ కప్ 13వ ఎడిషన్‌గా జరగనుంది. భారత్, శ్రీలంకలో జరిగే ఈ టోర్నమెంట్‌కు ఇంకా టికెట్లు విక్రయానికి రాలేదు. అయితే ఐసీసీ ఈ వారం నుంచే ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. 2022 వరల్డ్ కప్ టికెట్లు టోర్నమెంట్‌కు ఆరు నెలల ముందే విక్రయానికి వచ్చాయి.
66
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ప్రైజ్ మనీ వివరాలు
• మొత్తం ప్రైజ్ మనీ : USD 13.88 మిలియన్లు (దాదాపు 122 కోట్లు)
• విజేత: USD 4.48 మిలియన్లు (దాదాపు రూ. 39 కోట్లు)
• రన్నరప్: USD 2.24 మిలియన్లు (దాదాపు 19 కోట్లు)
• సెమీఫైనలిస్టులు: ఒక్కొక్కరికి USD 1.12 మిలియన్లు (దాదాపు 9.84 కోట్లు)
• గ్రూప్ మ్యాచ్ విజయానికి: USD 34,314 (దాదాపు 30.18 లక్షలు)
• ప్రతి జట్టుకు హామీగా: USD 250,000 (దాదాపు 2.29 కోట్లు)
మొత్తంగా 2025 మహిళల వరల్డ్ కప్ రికార్డు స్థాయి ప్రైజ్ మనీతో కొత్త చరిత్ర సృష్టించబోతోంది.