ఆసియా కప్ 2025 : భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ ధర ఎంత? ఎలా బుకింగ్ చేసుకోవాలి?

Published : Sep 01, 2025, 07:18 PM IST

India vs Pakistan Tickets: ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. టికెట్ల ధరలు, బుకింగ్ ప్రాసెస్, షెడ్యూల్ ఇలా పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
ఆసియా కప్ 2025 ఎప్పుడు ప్రారంభం అవుతుంది? వేదికలు ఏవి?

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు.

• గ్రూప్ A: భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్

• గ్రూప్ B: బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్, హాంకాంగ్

ప్రతి గ్రూపు నుంచి టాప్ రెండు జట్లు సూపర్ ఫోర్ దశకు చేరుకుంటాయి. ఇక్కడ టాప్ లో నిలిచి రెండు జట్లు ఫైనల్ కు చేరుకుంటాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరగనుంది.

DID YOU KNOW ?
ఆసియా కప్ లో భారత్
భారత జట్టు ఇప్పటివరకు 8 సార్లు ఆసియా కప్ టోర్నమెంట్ ఛాంపియన్ గా నిలిచింది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లలో భారత్ దే పైచేయిగా ఉంది.
26
భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడు?

క్రికెట్ ప్రపంచంలో అత్యంత హై వోల్టేజ్ రైవల్రీగా పరిగణించే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు టికెట్లు Platinumlist.netలో ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయని ఎమిరేట్స్ క్రికెట్ అధికారికంగా ప్రకటించింది.

36
ఆసియా కప్ 2025 టికెట్ ధరలు, ప్యాకేజీ వివరాలు ఎలా ఉన్నాయి?

ఎమిరేట్స్ క్రికెట్ ప్రకారం సాధారణ మ్యాచ్ టికెట్ల ధరలు

• అబుదాబి మ్యాచ్‌లు – AED 40 (సుమారు రూ. 960)

• దుబాయ్ మ్యాచ్‌లు – AED 50 (సుమారు రూ. 1200)

అయితే, భారత్-పాక్ మ్యాచ్‌కు టికెట్‌ను ప్రత్యేకంగా కొనలేరు. ఇది కేవలం 7 మ్యాచ్‌ల ప్యాకేజీ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఆ ప్యాకేజీ ధర AED 1400 (సుమారు రూ. 33,613). ఈ ప్యాకేజీలో భారత్-పాక్ మ్యాచ్‌తో పాటు భారత్ vs UAE, B1 vs B2, A1 vs A2, A1 vs B1, A1 vs B2 (సూపర్ ఫోర్), అలాగే టోర్నమెంట్ ఫైనల్ ఉంటాయి.

46
ఆసియా కప్ 2025 ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ టికెట్ బుకింగ్ గైడ్

• ఆన్‌లైన్ టికెట్లు: Platinumlist.net లో అందుబాటులో ఉన్నాయి.

• ఆఫ్‌లైన్ టికెట్లు: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, అబుదాబిలోని జాయెద్ క్రికెట్ స్టేడియంలో విక్రయిస్తారు. ఈ వివరాలను నిర్వాహకులు త్వరలో ప్రకటించనున్నారు.

56
ఆసియా కప్ 2025 లీగ్ దశ పూర్తి షెడ్యూల్

• సెప్టెంబర్ 9: అఫ్గానిస్తాన్ vs హాంకాంగ్ – 7:30 pm – అబుదాబి

• సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ – 7:30 pm – దుబాయ్

• సెప్టెంబర్ 11: బంగ్లాదేశ్ vs హాంకాంగ్ – 7:30 pm – అబుదాబి

• సెప్టెంబర్ 12: పాకిస్తాన్ vs ఒమన్ – 7:30 pm – దుబాయ్

• సెప్టెంబర్ 13: బంగ్లాదేశ్ vs శ్రీలంక – 7:30 pm – అబుదాబి

• సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్ – 7:30 pm – దుబాయ్

• సెప్టెంబర్ 15: యూఏఈ vs ఒమాన్ – 5:30 pm – అబుదాబి

• సెప్టెంబర్ 15: శ్రీలంక vs హాంకాంగ్ – 7:30 pm – దుబాయ్

• సెప్టెంబర్ 16: బంగ్లాదేశ్ vs అఫ్గానిస్తాన్ – 7:30 pm – అబుదాబి

• సెప్టెంబర్ 17: పాకిస్తాన్ vs యూఏఈ – 7:30 pm – దుబాయ్

• సెప్టెంబర్ 18: శ్రీలంక vs అఫ్గానిస్తాన్ – 7:30 pm – అబుదాబి

• సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్ – 7:30 pm – అబుదాబి

66
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్, ఫైనల్ షెడ్యూల్

• సెప్టెంబర్ 20: B1 vs B2 – 7:30 pm – దుబాయ్

• సెప్టెంబర్ 21: A1 vs A2 – 7:30 pm – దుబాయ్

• సెప్టెంబర్ 23: A2 vs B1 – 7:30 pm – అబుదాబి

• సెప్టెంబర్ 24: A1 vs B2 – 7:30 pm – దుబాయ్

• సెప్టెంబర్ 25: A2 vs B2 – 7:30 pm – దుబాయ్

• సెప్టెంబర్ 26: A1 vs B1 – 7:30 pm – దుబాయ్

ఫైనల్:

• సెప్టెంబర్ 28 – 7:30 pm – దుబాయ్

Read more Photos on
click me!

Recommended Stories