IPL 2025 - RCB - Rohit Sharma - Virat Kohli
హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టులో సాధారణ ఆటగాడిగా ఆడుతున్న రోహిత్ శర్మ, ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడటంపై సందేహాలు తలెత్తాయి. ఐపీఎల్ 2025లో కొత్త జట్టు తరఫున ఆడే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం గత సీజన్ ప్రారంభం ముందు రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడమేనని తెలుస్తోంది. 18వ ఐపీఎల్ సీజన్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు ఊపందుకున్నాయి. 2025 ఐపీఎల్ సీజన్‌లో ప్రతి జట్టు రూ.120 కోట్లు ఖర్చు చేయవచ్చనీ, 6 మంది ఆటగాళ్లను నిలుపుకోవచ్చని బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఇప్పుడు మరోసారి రోహిత్ శర్మ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
IPL 2025 - RCB - Rohit Sharma - Virat Kohli
బీసీసీఐ ఐపీఎల్ 2025 కోసం రిటెన్షన్ రూల్స్, ఐపీఎల్ మెగా వేలం 2025 కోసం నిర్ణయాలు ప్రటించిన తర్వాత అన్ని ఫ్రాంఛైజీలు జట్టుతో ఎవరిని నిలుపుకోవాలనే దానిపై తీవ్ర చర్చలు జరుపుతున్నాయి. ముంబై, బెంగళూరు టీమ్ లు కూడా ఇవే విషయంలో కసరత్తులు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని భారత జట్టు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌లో కొనసాగడంపై సందేహం ఉంది. కాబట్టి ఆర్‌సీబీ అతడిని కొనుగోలు చేయడానికి ముందుకు రావాలి. అంతేకాదు, రోహిత్ శర్మ ఆర్సీబీకి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నట్లు కైఫ్ చెప్పారు. దీంతో క్రికెట్ సర్కిల్ లో మరో కొత్త రచ్చ మొదలైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా వీరిద్దరూ ఒకే టీమ్ లో ఆడాలని కోరుకుంటూ సోషల్ మీడియలో పోస్టులు పెడుతున్నారు.
IPL 2025 - RCB - Rohit Sharma - Virat Kohli
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక విజయాలు అందించిన అత్యుత్తమ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. ఇప్పటివరకు జరిగిన 17 సీజన్లలో 5 సార్లు ముంబై ఇండియన్స్‌కు ట్రోఫీ అందించారు. ముంబై జట్టు తరఫున అత్యధిక కాలం కెప్టెన్ గా ఉన్నాడు. ఐపీఎల్ లో అత్యుత్తమ కెప్టెన్ గా గుర్తింపు పొందాడు.
అంతేకాదు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో ట్రోఫీ గెలిచిన డెక్కన్ ఛార్జర్స్ జట్టులోనూ రోహిత్ శర్మ చోటు దక్కించుకున్నారు. ఇలా ఐపీఎల్ లో అత్యధిక ట్రోఫీలు గెలిచిన ప్లేయర్ల లిస్టులో కూడా రోహిత్ శర్మ టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. అయితే, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీ సాధించని ఆర్‌సీబీకి కొత్త కెప్టెన్ అవసరం. అందువల్ల ఆర్‌సీబీ రోహిత్అ శర్మను కొనుగోలు చేయాలని మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.
IPL 2025 - RCB - Rohit Sharma - Virat Kohli
విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ రోహిత్ శర్మను జట్టులోకి తీసుకుంటే ఐపీఎల్ 2025 ట్రోఫీ అంచనాల్లో పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఈసారి ఆర్సీబీ రోహిత్ శర్మను తీసుకుంటే ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడటం తథ్యం. రోహిత్ రాకతో ట్రోఫీ గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కైఫ్ చెప్పారు. మహమ్మద్ కైఫ్ మాత్రమే కాదు అభిమానులు సైతం రోహిత్ శర్మ ఆర్‌సీబీ తరఫున ఆడాలని కోరుకుంటున్నారు. గత ఐపీఎల్ వేలంలో ఆర్‌సీబీ బలమైన ఆటగాళ్లను తీసుకున్నప్పటికీ చివరి వరకు పోరాడి ఎలిమినేటర్‌లో ఓడిపోయింది.
ముంబై ఇండియన్స్‌కు మాత్రమే కాకుండా భారత జట్టుకు టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా వ్యవహరించి 14 ఏళ్ల తర్వాత రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను రోహిత్ శర్మ అందించారు. రోహిత్ ఆర్‌సీబీలోకి వస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జోడీ తో బెంగళూరు టీమ్ కు పక్కా లాభిస్తుంది. రోహిత్ శర్మ ఆర్‌సీబీ తరఫున ఆడటం చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
IPL 2025 - RCB - Rohit Sharma - Virat Kohli
విరాట్ కోహ్లీ - రోహిత్ శర్మలకు ఐపీఎల్ లో సూపర్ రికార్డులు
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ఆడిన 252 మ్యాచ్‌ల్లో 55 హాఫ్ సెంచరీలు, 8 శతకాలతో కలిపి మొత్తం 8004 పరుగులు చేశారు. అదేవిధంగా రోహిత్ శర్మ 257 మ్యాచ్‌ల్లో 43 అర్ధశతకాలు, 2 శతకాలతో కలిపి మొత్తం 6628 పరుగులు చేశారు. ఐపీఎల్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ రూ.15 కోట్లకు ఆడుతుండగా, రోహిత్ శర్మ రూ.16 కోట్లకు ఆడుతున్నారు.
కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఆడిన 158 మ్యాచ్‌ల్లో 87 మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. అలాగే 67 మ్యాచ్‌ల్లో ఓడిపోగా, 4 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. విజయ శాతం 55.06గా ఉండటం గమనార్హం. పరులుగు, కెప్టెన్సీలో రోహిత్ శర్మకు అద్భతమైన రికార్డులు ఉన్నాయి. విరాట్ కోహ్లీకి ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ముందున్నాడు. భారత్ జట్టుకు అద్భుత విజయాలు అందించిన వీరిద్దరూ కలిస్తే ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఛాంపియన్ గా నిలవడం పక్కాఅనీ, విరాట్ కోహ్లీ కల కూడా నెరవేరుతుందని క్రికెట్ లవర్స్ పేర్కొంటున్నారు.