కోపంతో టీవీ పగలగొట్టిన ధోని - హ‌ర్భ‌జ‌న్ సింగ్ షాకింగ్ కామెంట్స్, సీఎస్కే ఏం చెప్పిందంటే?

First Published | Oct 4, 2024, 2:17 PM IST

Harbhajan Singh's sensational comments on Dhoni : ఐపీఎల్ 2024 ప్రస్తావన వచ్చినప్పుడల్లా మే 18న ఆర్సీబీ vs సీఎస్కే మ్యాచ్ గురించి ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ ఆర్సీబీ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయాడు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ధోనిపై  హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

Harbhajan Singh, MS Dhoni, IPL

Harbhajan Singh's sensational comments on MS Dhoni : అంత‌ర్జాతీయ క్రికెట్ లో గొప్ప ప్లేయ‌ర్ గా, కెప్టెన్ గా పేరు సంపాదించాడు మ‌హేంద్ర సింగ్ ధోని. భార‌త జ‌ట్టును అద్భుతంగా ముందుకు న‌డిపించి మూడు ఫార్మాట్ల‌ల‌లో ఐసీసీ ట్రోఫీలు గెలిపించాడు. భార‌త దిగ్గ‌జ కెప్టెన్ల‌లో ఒక‌రిగా గుర్తింపు సాధించాడు. 

మ‌రీ ముఖ్యంగా ధోని అంటే గ్రౌండ్ లో ఎంత ఒత్తిడి ఉన్నా కూల్ గా నిర్ణ‌యాలు తీసుకుంటూ మ్యాచ్ ను త‌మ వైపు  తిప్పుకునే స్టైల్ అంద‌రికీ న‌చ్చుతుంది. కానీ, ఎప్పుడూ కూల్ గా క‌నిపించే ధోని గ‌త ఐపీఎల్ సీజ‌న్ లో సహనం కోల్పోయి టీవీ పగలగొట్టాడ‌ని టీమిండియా మాజీ స్టార్ బౌల‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. 

MS Dhoni

ధోని గురించి హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఏం చేప్పాడంటే?

స్పోర్ట్స్ యారీకి ఇచ్చిన ప్ర‌త్యేక‌ ఇంటర్వ్యూలో భార‌త మాజీ స్టార్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ భార‌త జ‌ట్టు, భార‌త ఆట‌గాళ్లు, భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి  (బీసీసీఐ), ఐపీఎల్  గురించిన ప‌లు సంఘ‌ట‌న‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇదే క్ర‌మంలో భార‌త మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి కూడా ప్ర‌స్తావించాడు. ఎప్పుడూ కూల్ గా ఉండే ధోని డ్రెస్సింగ్ రూమ్ వెలుపల టీవీ స్క్రీన్‌ను ప‌గ‌ల‌గొట్టాడ‌నీ, దీని వెనుక వున్న క‌థ‌ను గురించి వివ‌రించాడు. 

ఈ ఘ‌ట‌న ఐపీఎల్ 2024 లో జ‌రిగింది. ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌లో బెర్త్ ద‌క్కించుకోవడం కోసం తమ లీగ్ ద‌శ‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ చివ‌రి మ్యాచ్ ఆడింది. ఈ కీల‌మైన మ్యాచ్ లో చెన్నై జోరు సాగించ‌లేక‌పోయింది. లాస్ట్ ఓవ‌ర్ లో 18 పరుగులు అవ‌స‌రం కాగా, ఆర్సీబీ బౌలర్ యశ్‌ దయాళ్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవ‌లం 7 పరుగులు మాత్ర‌మే ఇచ్చాడు. అలాగే, ధోని వికెట్ కూడా తీశాడు. ఆర్సీబీ సూప‌ర్ విక్ట‌రీతో ప్లేఆఫ్ రేసులోకి వెళ్లింది. చెన్నై ఇంటిదారి ప‌ట్టింది. 


స‌హ‌నం కోల్పోయిన ధోని టీవీని ప‌గ‌ల‌గొట్టాడు..

చెన్నై సూప‌ర్ కింగ్స్ కీల‌క మ్యాచ్ లో ఓడిపోయిన త‌ర్వాత కూల్ గా ఉండే ధోని స‌హ‌నం కోల్పోయాడ‌ని హ‌ర్భ‌జ‌న్ సింగ్ కామెంట్ చేశాడు. ఓటమి తర్వాత అతని భావోద్వేగ క్షణాలను వివరించాడు. ఆ మ్యాచ్ స‌మ‌యంలో హ‌ర్భ‌జ‌న్ సింగ్ కామెంటర్ గా ఉన్నారు. తాజా ఇంట‌ర్వ్యూలో భ‌జ్జీ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ  ధోని తన కూల్‌ నెస్ ను కోల్పోయాడనీ, డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లినప్పుడు స్క్రీన్‌పై పంచ్ వేశాడని చెప్పాడు. 

"ఆర్సీబీ గెలుపుతో సంబ‌రాలు చేసుకుంటోంది. ఈ సంబ‌రాల‌కు ఆర్సీబీ టీమ్ అర్హ‌త క‌లిగి ఉంది. నేను అక్కడ ఉన్నందున నేను మొత్తం సన్నివేశాన్ని పై నుండి చూస్తున్నాను. షేక్‌హ్యాండ్ ఇవ్వ‌డానికి ధోని గ్రౌండ్ వేచిచూస్తున్నాడు. అయితే, ఆర్సీబీ ప్లేయ‌ర్లు అక్క‌డికి రావ‌డానికి  కొంచెం ఆలస్యమైంది. అప్ప‌టికే ధోని గ్రౌండ్ లో ఉన్న వారికి బై చెప్పి వెళ్లిపోయాడు. స‌హ‌నం  కోల్పోయి డ్రెస్సింగ్ రూమ్ ద‌గ్గ‌ర టీవీని ప‌గ‌ల‌గొట్టాడు. కొన్ని సార్లు ఇలా జ‌రుగుతుంది. ఓడిపోయినా, గెలిచినా అది ఆట‌లో భాగంగా ఉండాలి" అని హ‌ర్భ‌జ‌న్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 

Harbhajan Singh

ఐపీఎల్ 2024 లో ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కించుకోవడానికి సీఎస్కేకు 201 పరుగులు అవసరం. ఆఖరి ఓవర్‌లో జట్టు క్వాలిఫై కావడానికి 17 పరుగులు అవసరమైనప్పుడు ఎంఎస్ ధోని క్రీజులో ఉన్నాడు. తొలి బంతికే భారీ సిక్సర్ కొట్టి ఓవర్ ప్రారంభించాడు. అయితే, తర్వాతి డెలివరీలో ఆర్సీబీ బౌల‌ర్ యష్ దయాల్ చేతిలో ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో సీఎస్కే 9 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. 

మ్యాచ్ తర్వాత, నిరాశకు గురైన ధోని తన సీఎస్కే సహచరులతో కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వ‌డానికి గ్రౌండ్ లో ఉన్నాడు. ఆర్సీబీ ఆట‌గాళ్లు సంబ‌రాలు చేసుకుంటున్న క్ర‌మంలో ధోని అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. సాధార‌ణంగా మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఇరు జ‌ట్ల ప్లేయ‌ర్లు గెలుపోట‌ముల‌తో సంబంధం లేకుండా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అయితే, అలా ధోని చేయ‌క‌పోవ‌డంతో అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయింది. 

Dhoni-Kohli

ధోనిపై హ‌ర్భ‌జ‌న్ సింగ్ చెప్పిన దాంట్లో నిజం లేదు :  సీఎస్‌కే ఫిజియోథెరపిస్ట్ టామ్మీ సిమ్‌సెక్

హ‌ర్భ‌జ‌న్ సింగ్ ధోనిపై చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ కావ‌డంతో విష‌యం తెలుసుకున్న సీఎస్‌కే ఫిజియోథెరపిస్ట్ టామ్మీ సిమ్‌సెక్ స్పందిస్తూ ఇందులో నిజం లేద‌ని పేర్కొన్నాడు. ఇదంతా ఒక చెత్త అంటూ భ‌జ్జీ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఆ మ్యాచ్ కాదు ఏ మ్యాచ్ తర్వాత కూడా ఎంఎస్ ధోని నుంచి అలాంటి ప‌నిని చూడ‌లేద‌ని  దూకుడును చూడలేదని టామ్మీ సిమ్‌సెక్ పేర్కొన్నాడు. ఇది ఫేక్ న్యూస్.. పెద్ద చెత్త అంటూ కామెంట్ చేశాడు. 

కాగా, ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ధోని సీఎస్కే కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నాడు. చెన్నై కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ కు ప‌గ్గాలు అప్ప‌గించాడు. 43 ఏళ్ల ధోనికి ఐపీఎల్ 2024 సీజ‌న్ లో బ్యాటింగ్ చేసే అవ‌కాశం పెద్ద‌గా రాలేదు. అయితే, ఆడిన స‌మ‌యంలో 14 ఫోర్లు, 13 సిక్సర్లతో 220.55 స్ట్రైక్ రేట్‌తో 161 పరుగులు చేశాడు. రాబోయే ఐపీఎల్ 2025 సీజ‌న్ లో ధోని గత ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడ‌లేదు కాబట్టి చెన్నై సూప‌ర్ కింగ్స్ టీమ్ అతన్ని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా జ‌ట్టులో ఉంచుకోవాల‌ని చూస్తోంది. ఇక ఐపీఎల్ చ‌రిత్ర‌లో విజ‌య‌వంత‌మై టీమ్ గా సీఎస్కే ధోని సార‌థ్యంలో ముందుకు సాగింది. ధోని కెప్టెన్సీలో ఐదు సార్లు చెన్నై టీమ్ ఐపీఎల్ ఛాంపియ‌న్ గా నిలిచింది. 

Latest Videos

click me!