వికెట్ కీపర్ ఎప్పటికీ ఓపెనింగ్ బ్యాటర్ కాలేడు.. అది పనికిమాలిన ఆలోచన: రాహుల్ పై గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : Jan 12, 2022, 03:36 PM IST

India Vs South Africa: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ వరుస వైఫల్యాల నేపథ్యంలో అతడిపై వేటు వేయాలని వాదనలు వినిపిస్తున్నాయి.  కెఎల్ రాహుల్ తో...  

PREV
18
వికెట్ కీపర్ ఎప్పటికీ ఓపెనింగ్ బ్యాటర్ కాలేడు.. అది పనికిమాలిన ఆలోచన: రాహుల్ పై గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా రెగ్యులర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ వరుస వైఫల్యాలతో ఇబ్బందులు పడుతున్న వేళ అతడి స్థానాన్ని భర్తీ చేయాలని వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. 
 

28
Rishabh Pant

టెస్టులలో రెగ్యులర్ వికెట్ కీపర్ గా ఉన్న వృద్ధిమాన్ సాహానే దీనికి బెటర్ ఛాయిస్ అని కొందరు చెబుతుండగా..  ఆంధ్రా కుర్రాడు కెఎస్ భరత్ కు ఛాన్సులు ఇవ్వాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

38

అయితే ఇదే క్రమంలో ఇప్పటికే వికెట్ కీపర్ గా అనుభవం ఉన్న టీమిండియా ఓపెనర్  కెఎల్ రాహుల్ కే ఆ అవకాశమిచ్చింది బెటరని కూడా పలు వాదనలు వినిపిస్తున్నాయి.  అలా అయితే జట్టుకు ఒక అదనపు బ్యాటర్ లేదా బౌలర్ కలిసొచ్చే అవకాశముందని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

48

ఇప్పుడు ఇదే విషయమ్మీద భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ స్పందించాడు. టెస్టులలో వికెట్ కీపింగ్ బాధ్యతలను చేయకపోవడమే కెఎల్ రాహుల్ కు, భారత జట్టుకు మంచిదని అన్నాడు. 

58

గంభీర్ మాట్లాడుతూ.. ‘నేను రాహుల్ ను ఓపెనర్ గా చెబుతాను.  కానీ అతడు టెస్టులలో వికెట్ కీపింగ్ బాధ్యతలు మోయడం కరెక్ట్ కాదు.  మీరు ప్రపంచంలో ఏ వికెట్ కీపర్ ను చూసినా టెస్టులలో ఓపెనింగ్ బ్యాటర్ గా లేరు.

68

ఎందుకంటే 150 ఓవర్లు ఫీల్డింగ్ చేసి మళ్లీ  ఇన్నింగ్స్ ను ప్రారంభించడమనేది అసాధ్యమైన విషయం.. ఇది వన్డే, టీ20లలో సాధ్యమవుతుంది గానీ టెస్టులలో మాత్రం కష్టం.. 
 

78

ఇక భారత్ కు టెస్టులలో రెగ్యులర్ వికెట్ కీపర్ కావాల్సిందే. రాహుల్ ను మాత్రం టెస్టులలో వికెట్ కీపింగ్ చేయించడం అనేది సరికాదు. ఎందుకంటే అతడు పరుగులు చేయడం జట్టుకు ఎంతో అవసరం. ఓపెనింగ్ సమస్యకు ఇది దీర్ఘకాలిక పరిష్కారం కూడా కాదు.  కొద్దిరోజుల నుంచే అతడు టెస్టులలో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు...’ అని గంభీర్ చెప్పాడు. 
 

88

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో రిషభ్ పంత్ పేలవ ఆటతీరుతో విమర్శలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టులలో విఫలమైన పంత్.. మూడో టెస్టులో కుదురుకున్నట్టే కనిపించాడు. కానీ 50 బంతుల్లో 27 పరుగులు చేసి  జాన్సేన్ బౌలింగ్ లో వెనుదిరిగి మరోసారి నిరాశపరిచాడు. 
 

Read more Photos on
click me!

Recommended Stories