Ind vs SA: కోహ్లి దానిని బ్యాగ్ లోనే పెట్టి ఆడాడు.. విరాట్ క్లాసిక్ ఇన్నింగ్స్ పై గంభీర్ వ్యాఖ్యలు

Published : Jan 12, 2022, 01:35 PM IST

Gautam Gambhir Praises  Virat Kohli:  కేప్టౌన్ టెస్టులో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన భారత టెస్టు సారథి విరాట్ కోహ్లి పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లిపై ఎప్పుడూ చురుక్కులు విసిరే  భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్ స్పందిస్తూ...

PREV
19
Ind vs SA: కోహ్లి దానిని బ్యాగ్ లోనే పెట్టి ఆడాడు.. విరాట్ క్లాసిక్ ఇన్నింగ్స్ పై గంభీర్ వ్యాఖ్యలు

సుమారు రెండేండ్ల తర్వాత టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లి తనలోని పాత  ఆటగాడిని బయటకు తీస్తూ దక్షిణాఫ్రికాపై మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆడిన ఆటతీరు అందర్నీ ఆకట్టుకుంటున్నది. సెంచరీ చేయలేకపోయినా  దానికంటే  ఈ ఇన్నింగ్స్ ఎంతో అమూల్యమైందని అంటున్నారు  భారత  మాజీ క్రికెటర్లు.. 

29

ఇదే విషయమై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కూడా స్పందించాడు.  టీమిండియా విదేశాలకు వెళ్లినప్పుడు తన సహచరులకు కీలకమైన సూచన చేసే కోహ్లి.. ఇప్పుడు దానిని తానే పాటించాడని  అన్నాడు. 
 

39

గంభీర్ మాట్లాడుతూ... ‘విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు ఆటగాళ్లంతా తమ అహాన్ని వదిలేసి వెళ్లాలని  కోహ్లి గతంలో పలుమార్లు వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్,  ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్లినప్పుడల్లా అతడు ఇదే మాట చెప్పేవాడు. 
 

49

ఇప్పుడు కోహ్లి అదే మాటను రుజువు చేశాడు. మూడో టెస్టు  తొలి ఇన్నింగ్స్ లో ఎంతో సహనంతో బ్యాటింగ్ చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు కవ్వించే బంతులు విసిరినా ఏకాగ్రత కోల్పోకుండా సంయమనంతో ఆడాడు. 

59

ఒకవైపు వరుసగా వికెట్లు పడుతూ సహచరుల నుంచి సహకారం కరువైనా.. బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించకుండా తన ఆట తాను ఆడాడు. అహాన్ని పక్కనబెట్టి జట్టు కోసం విలువైన ఇన్నింగ్స్ ఆడాడు...’ అని గంభీర్ తెలిపాడు. 
 

69

ఈ ఇన్నింగ్స్ లో కోహ్లి..  201 బంతులాడి 79 పరుగులు చేసిన విషయం తెలిసిందే.  158 బంతుల్లో అర్థసెంచరీ చేశాడు.తన సహజ శైలికి భిన్నంగా.. ఓపిగ్గా ఆడిన కోహ్లి  చాలా కాలం తర్వాత తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీశాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. 

79

ఈ ఇన్నింగ్స్ లో కోహ్లి..  201 బంతులాడి 79 పరుగులు చేసిన విషయం తెలిసిందే.  158 బంతుల్లో అర్థసెంచరీ చేశాడు.తన సహజ శైలికి భిన్నంగా.. ఓపిగ్గా ఆడిన కోహ్లి  చాలా కాలం తర్వాత తనలోని అసలైన ఆటగాడిని బయటకు తీశాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. 

89

ఇక సిరీస్ విజేతను తేల్చే మూడో టెస్టులో భారత సారథి కీలక ఇన్నింగ్స్ ఆడాడని భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. కోహ్లి సెంచరీ చేయలేకపోయినా.. అంతకంటే గొప్ప ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసించారు.
 

99

కోహ్లి  తన క్లాస్ బ్యాటింగ్ తో ఆసాంతం కట్టి పడేశాడని  టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు.  కోహ్లి చేసిన 79 పరుగులు   శతకం కంటే విలువైనవని ఆకాశ్ చోప్రా ట్వీట్ లో పేర్కొన్నాడు. వసీం జాఫర్,  ఆర్పీసింగ్ లు కూడా కోహ్లిని ప్రశంసల్లో ముంచెత్తారు.

Read more Photos on
click me!

Recommended Stories