ఆరేండ్ల తర్వాత టీమిండియా ఆల్ రౌండర్ కు బంపరాఫర్.. జయంత్ యాదవ్ కు గోల్డెన్ ఛాన్స్

First Published Jan 12, 2022, 2:09 PM IST

Jayant Yadav: టీమిండియా తరఫున ఆరేండ్ల క్రితం వన్డే మ్యాచ్ ఆడిన జయంత్ యాదవ్ కు బంపరాఫర్ దక్కింది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు కరోనా రావడంతో అతడికి... 
 

భారత జట్టు ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ కు బంపరాఫర్ దక్కింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు ఎంపికైన అతడిని.. మూడో టెస్టు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండాలని బీసీసీఐ కోరింది.

దక్షిణాఫ్రికాతో త్వరలో మొదలుకాబోయే వన్డే సిరీస్ కోసం జయంత్ ను బ్యాకప్ ప్లేయర్ గా ఉంచనున్నట్టు తెలుస్తున్నది.  టీమిండియా యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు కరోనా సోకడంతో జయంత్ యాదవ్ కు ఈ ఆఫర్ దక్కింది. 

సఫారీ పర్యటనలో భాగంగా టీమిండియా స్సిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లు  గాయపడటంతో  జయంత్ యాదవ్ కు చోటు దక్కిన విషయం తెలిసిందే.  టెస్టు సిరీస్ కు ఎంపికైనా అతడు బెంచ్  కే పరిమితమయ్యాడు. 
 

కాగా..  చాలా కాలం తర్వాత భారత వన్డే జట్టుకు ఎంపికైన వాషింగ్టన్ సుందర్ కరోనా  బారిన పడటంతో టీమిండియా యాజమాన్యం.. సుందర్ ను అతడి బ్యాకప్ గా ఉంచనుంది. వన్డే సిరీస్ వరకు సుందర్ కోలుకోకుంటే  జయంత్ యాదవ్ కు ఛాన్స్ దక్కే అవకాశముందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. 

ఇదిలాఉండగా.. 2016లో  న్యూజిలాండ్ పై జరిగిన వన్డే  మ్యాచులో అరంగ్రేటం చేసిన జయంత్ యాదవ్.. ఇప్పటివరకు భారత్  తరఫున ఒకే ఒక వన్డే ఆడాడు. అందులో ఒక వికెట్ తీశాడు. ఆ  తర్వాత అడపాదడపా టెస్టులలో కనిపించినా  అతడికి వన్డేలలో ఛాన్సు రాలేదు. 
 

భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 19న తొలి వన్డే జరుగనుంది. దానికి మరో వారం రోజులే గడువుంది. అయితే అప్పటివరకు సుందర్ కోలుకోవడం అనుమానమే. దీంతో  జయంత్ కు ఛాన్స్ దక్కుతుందని సమాచారం. 

ఇక వన్డే సిరీస్ లో భాగంగా 19న తొలి వన్డే, జనవరి 21న రెండో వన్డే,  23న మూడో వన్డే జరుగుతాయి. భారత పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ ఈ పర్యటనకు దూరం కావడంతో అతడి స్థానంలో కెఎల్ రాహుల్.. కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

click me!