IND vs ENG: లార్డ్స్ పిచ్‌పై పేస్ వార్.. బుమ్రా, ఆర్చర్ రీ ఎంట్రీతో రగడకు రెడీ

Published : Jul 08, 2025, 09:27 PM IST

Lords pitch: హోమ్ ఆఫ్ క్రికెట్ గా గుర్తింపు పొందిన లార్డ్స్ క్రికెట్ మైదానంలో భారత్ ఇంగ్లాండ్ జట్లు మూడో టెస్టును ఆడనున్నాయి. ఇక్కడి పిచ్ ఎలా ఉండనుంది? గత రికార్డులు ఎలా ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
భారత్ vs ఇంగ్లాండ్: లార్డ్స్ టెస్ట్‌కు గ్రీన్ పిచ్ సిద్ధం

భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరుగుతోంది. రెండు టెస్టులు పూర్తికాగా, మూడో టెస్ట్ జూలై 10 నుంచి లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఘన విజయం సాధించిన భారత్ ఇప్పుడు అదే ఉత్సాహంతో గొప్ప చరిత్ర కలిగిన లార్డ్స్ వేదికపై మరో చరిత్రను రాయడానికి సిద్ధమవుతోంది. అయితే, లార్డ్స్ మైదానం పరిస్థితులు, పిచ్ లక్షణాలు మ్యాచ్‌పై కీలక ప్రభావం చూపనున్నాయి.

మ్యాచ్‌కు రెండు రోజులు ముందే సోషియల్ మీడియాలో విడుదలైన లార్డ్స్ పిచ్ ఫోటోలు క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. గ్రీన్ టాప్‌తో, బాగా నీరు పోసి సిద్ధం చేసిన పిచ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది పేసర్లకు సహకరించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

26
జట్టులోకి తిరిగివస్తున్న బుమ్రా - భారత్‌కు మరింత బలం

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరమైనప్పటికీ, మూడో టెస్ట్‌లో అతను తిరిగి జట్టులోకి వస్తున్నారు. 2021లో లార్డ్స్‌లో భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఆ విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించారు. ఈసారి కూడా పేస్ కు సహకరించే పిచ్ లో బుమ్రా ప్రభావం చూపనున్నారనే అంచనాలు ఉన్నాయి.

36
పేసర్లకు అనుకూలమైన పిచ్ కావాలంటున్న ఇంగ్లాండ్

ఎడ్జ్‌బాస్టన్‌లో 336 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు మేనేజ్‌మెంట్, మళ్లీ పేసర్లకు అనుకూలమైన పిచ్ కావాలని కోరుతోంది. పీటీఐ నివేదికల ప్రకారం.. ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, లార్డ్స్ మైదానం హెడ్ గ్రౌండ్స్‌మన్ కార్ల్ మెక్‌డెర్మాట్‌ను “బౌన్స్, పేస్, స్వింగ్” కలిగిన పిచ్ కావాలని కోరారు.

ఇది గత నెలలో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆధారంగా తీసుకున్న నిర్ణయమని తెలుస్తోంది. అందులో ప్యాట్ కమిన్స్, కగిసో రబాడా లాంటి పేసర్లకు పిచ్ అద్భుతంగా సహకరించింది.

46
ఇంగ్లాండ్ జట్టులోకి జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్?

గాయాల కారణంగా 2021 నుంచి టెస్టులకు దూరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్.. లార్డ్స్ లో జరిగే మూడో టెస్టు మ్యాచ్ లో బరిలోకి దిగనున్నాడు. అలాగే, గస్ అట్కిన్సన్ కూడా రెండో టెస్ట్ మిస్సయ్యాక మూడో టెస్ట్‌లో కనిపించే అవకాశముంది. ఇంతకు ముందుగా ఫ్లాట్ పిచ్‌లపై ఆడిన ఇంగ్లాండ్, ఇప్పుడు బౌన్స్-క్యారీ ఉన్న పిచ్ కోరుతున్నట్లు కనిపిస్తోంది.

బ్రెండన్ మెక్‌కల్లమ్ మాట్లాడుతూ, “ఇది బ్లాక్‌బస్టర్ మ్యాచ్ అవుతుందనే నమ్మకముంది, పిచ్‌లో లైఫ్ ఉంటే మరింత ఆసక్తికరంగా మారుతుంది” అని ESPNcricinfo కు చెప్పారు.

56
లార్డ్స్‌లో భారత్ vs ఇంగ్లాండ్ రికార్డులు ఎలా ఉన్నాయి?

లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ - భారత్ ఇప్పటివరకు 19 టెస్టులు ఆడాయి.

• మొత్తం మ్యాచ్‌లు: 19

• ఇంగ్లాండ్ విజయాలు: 12

• భారత్ విజయాలు: 3

• డ్రా మ్యాచ్ లు: 4

ఇంగ్లాండ్‌కు లార్డ్స్‌లో భారత్‌పై స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ, 2021లో కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. అదే సమయంలో, ఇంగ్లాండ్ చివరిసారి లార్డ్స్‌లో భారత్‌ను 2018లో ఓడించింది.

భారత్ బాటింగ్ సగటు లార్డ్స్‌లో 37 ఇన్నింగ్స్‌లలో 24.94గా ఉంది. ఇంగ్లాండ్ అత్యధిక స్కోరు 653 కాగా, భారత్ అత్యధిక స్కోరు 454 పరుగులు.

66
ఉత్కంఠగా మారిన భారత్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ 2025

ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌లో అద్భుతంగా ఆడి, 58 ఏళ్ల తర్వాత ఆ మైదానంలో తొలి విజయం సాధించింది. భారత్ ఇప్పుడు అదే ఫామ్ ను కొనసాగించాలని చూస్తోంది. 

శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో జట్టు అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తోంది. లార్డ్స్‌లో పేస్ ఫ్రెండ్లీ పిచ్ అంచనాల మధ్య రెండు జట్ల బలమైన పేస్ దళాలు మ్యాచ్‌పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories