Womens World Cup 2025: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఆతిథ్య హక్కులు భారత్ కు ఉన్నాయి. అయితే, మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లు శ్రీలంకలోని కొలంబోలో కూడా ఎందుకు నిర్వహిస్తున్నారు?
భారత్ తో పాటు శ్రీలంకలో మహిళల వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ లు ఎందుకు?
Womens World Cup 2025: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 పై ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. ఐసీసీ ఈ మెగా టోర్నీకి సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరిగే ఈ టోర్నమెంట్ నిర్వహణ హక్కులు కలిగిన ఏకైక దేశంగా భారత్ ఉన్నప్పటికీ, శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం పలు కీలక మ్యాచ్‌లకు వేదికగా నిలవనుంది.
25
Womens World Cup 2025: కొలంబో వేదికగా ఎందుకు ఎంపిక చేశారు?
శ్రీలంకలోని కొలంబో ఉన్న ఆర్. ప్రేమదాస స్టేడియంలో కనీసం 7, గరిష్ఠంగా 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో 7 మ్యాచ్‌లు ఖరారవగా, ఒక సెమీఫైనల్, ఫైనల్ కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉంది. కొలంబోతో పాటు మహిళ వన్డే ప్రపంచ కప్ 2025 మ్యాచ్‌లు గౌహతి, ఇండోర్, విశాఖపట్నం, బెంగళూరు నగరాలు వేదికలుగా ఉన్నాయి. ఇండియా తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 30న శ్రీలంకతో బెంగళూరులో ఆడుతుంది. అక్టోబర్ 5న భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ కొలంబోలో జరగనుంది.
35
హైబ్రిడ్ మోడల్ కారణంగానే శ్రీలంకలో వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ లు
ఈ తరహా షెడ్యూలింగ్ వెనుక ప్రధాన కారణం హైబ్రిడ్ మోడల్. ICC, BCCI, PCB సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు 2025 నుంచి 2027 వరకు జరిగే అంతర్జాతీయ టోర్నీల్లో ఇండియా-పాకిస్థాన్ లు ఇరు దేశాల్లో పరస్పరం ప్రయాణించకుండా మూడో దేశంలో తమ మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయించుకున్నాయి.
దీంతో పాకిస్థాన్ 2025 పురుషుల చాంపియన్స్ ట్రోఫీకి అతిథ్య దేశంగా ఉన్నప్పటికీ, భారత జట్టు ఆ టోర్నీలో అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది. ఇదే విధంగా, 2025 మహిళల వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు తమ అన్ని మ్యాచ్‌లను కొలంబోలో ఆడనుంది. భారత జట్టుతో అక్టోబర్ 5న జరగబోయే హై ప్రొఫైల్ మ్యాచ్ కూడా అక్కడే జరుగుతుంది.