గౌత‌మ్ గంభీర్ ప్ర‌ధాన కోచ్ అయిన వెంట‌నే ఈ భీకర బ్యాట‌ర్ ఎందుకిలా కామెంట్స్ చేశాడు?

First Published | Aug 16, 2024, 7:09 PM IST

India : గౌతమ్ గంభీర్ టీమిండియా ప్ర‌ధాన కోచ్ అయిన త‌ర్వాత భార‌త్ శ్రీలంక‌తో త‌న తొలి సిరీస్ ను ఆడింది. టీ20 సిరీస్ ను గెలుచుకున్న భార‌త్.. వ‌న్డే సిరీస్ ను మాత్రం కోల్పోయింది. వ‌చ్చే నెల‌లో బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ఆడ‌నుంది భార‌త జ‌ట్టు. 
 

Indian national cricket team : గౌతమ్ గంభీర్ భార‌త ప్ర‌ధాన కోచ్ అయిన తర్వాత జ‌ట్టు కూర్పులో భారీగానే మార్పులు క‌నిపిస్తున్నాయి. సీరియస్‌గా ఉన్న యువ ఆటగాళ్లకు పుష్కలంగా అవకాశాలు ఉంటాయ‌నే సంకేతాలు పంపాడు. శ్రీలంక టూర్‌లో కూడా కొంతమంది యువ ఆటగాళ్లకు భార‌త జ‌ట్టులో చోటుద‌క్కింది. 

ఇదిలావుంటే, దేశ‌వాళీ క్రికెట్ లో సూప‌ర్ షో తో అద‌ర‌గొట్టి భార‌త జ‌ట్టు త‌ర‌ఫున అరంగేట్రం చేసిన బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం వ‌స్తుందా?  రాదా? అనే టాక్ క్రికెట్ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. ఇటీవ‌ల శ్రీలంక ప‌ర్య‌ట‌న‌ను ముగించిన భార‌త్ వ‌చ్చే నెల‌లో బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ఆడ‌నుంది.  ఈ సిరీస్‌కు టీమిండియా ప్రకటన వెలువడకముందే సర్ఫరాజ్ ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. 


ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ అరంగేట్రం చేసి అంచనాలను అందుకున్నాడు. అయితే, అత‌ను జ‌ట్టులోకి రావ‌డానికి చాలానే క‌ష్ట‌ప‌డ్డాడు. దేశవాళీ క్రికెట్ రికార్డు హోల్డర్ సర్ఫరాజ్ అరంగేట్రం మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలు సాధించాడు. దీని తర్వాత, అతను తన మూడో మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. అద్భుతమైన గణాంకాలు ఉన్నప్పటికీ భార‌త్ vs బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్‌లో తన ఎంపిక గురించి ఆందోళన చెందుతున్నాడు.

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో తన ఎంపిక గురించి సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ.. 'నాకు ఎలాంటి అంచనాలు లేవు.. కానీ అవకాశం వస్తే మాత్రం సిద్ధంగా ఉంటా. ఇది నేను ఎప్పుడూ చేస్తూనే ఉన్నాను, దీన్ని మార్చడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు..' అంటూ నిరాశ‌తో ఆందోళ‌న‌ను వ్య‌క్తంచేయ‌డం  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 

Rohit Sharma-Sarfaraz Khan

సెప్టెంబర్ 19 నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ సీనియ‌ర్ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌కు విశ్రాంతి ల‌భించ‌వ‌చ్చు. పనిభారం కారణంగా ఈ అంశం ముందుకు వ‌స్తోంది. అయితే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ దృష్ట్యా భారత జట్టుకు ఈ సిరీస్ కూడా చాలా కీలకం. దీంతో జ‌ట్టులో ఎవ‌రెవ‌రు ఉంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ కామెంట్స్ తో అత‌నికి జ‌ట్టులో చోటుద‌క్కుతుందా?  లేదా అనేది కూడా హాట్ టాపిక్ అవుతోంది. 

Latest Videos

click me!